
న్యూఢిల్లీ : ఎయిర్‌టెల్ థ్యాంక్స్ పేరుతో ప్రారంభించిన ప్రోగ్రాంను విభిన్న సేవలు, కస్టమర్లకు వినూత్న అనుభవం ఇచ్చేలా విస్తృతం చేసేందుకు కంపెనీ సంసిద్ధమైంది. ఎయిర్‌టెల్‌ధ్యాంక్స్ మరింత కంటెంట్, డివైజ్, సెక్యూరిటీ, వాణిజ్య సేవలు, వీఐపీ కస్టమర్ కేర్, టాప్ బ్రాండ్స్ నుంచి వినూత్న ఆఫర్లను కస్టమర్ల ముందుకు తీసుకువస్తున్నట్టు ఎయిర్‌టెల్ పేర్కొంది.
టెలికాం పరిశ్రమలోనే తొలిసారిగా థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా ప్రీపెయిడ్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను అందిస్తోంది. రూ 299కే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌తో పాటు, రోజుకు 2.5 జీబీ డేలా, 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎయిర్‌టెల్ కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేలా ఎయిర్‌టెల్ థ్యాంక్స్‌ను రీడిజైన్ చేసినట్టు సంస్ధ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment