ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. నేడు(జూలై 28) ఎయిర్‌టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను సవరించినట్లు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ ప్లాన్ ధరను దాదాపు 60 శాతం పెంచింది. టెలికాం ఆపరేటర్ తన రూ.49 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ను నిలిపివేసినట్లు తెలిపింది. కంపెనీ బేసిక్ ప్రీపెయిడ్ ప్యాక్స్ ఇప్పుడు రూ.79 స్మార్ట్ రీఛార్జ్ నుంచి ప్రారంభమవుతాయని, డబుల్ డేటాతో పాటు వినియోగదారులకు నాలుగు రెట్లు ఎక్కువ అవుట్ గోయింగ్ మినిట్స్ వినియోగాన్ని అందిస్తున్నట్లు ఎయిర్‌టెల్ ఒక ప్రకటనలో తెలిపింది.
"మెరుగైన కనెక్టివిటీ అందించడంపై కంపెనీ దృష్టి సారించినట్లు పేర్కొంది. ఎంట్రీ లెవల్ పాలన రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు ఇప్పుడు తమ అకౌంట్ బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందకుండా ఎక్కువ కాలం కనెక్ట్ కావొచ్చు'' అని ఎయిర్ టెల్ తెలిపింది. ఈ కొత్త ధరలు జూలై 29, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రూ.79 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రూ.64 టాక్ టైమ్, 200 ఎంబి డేటా, 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. టెలికాం ఆపరేటర్లు ప్రతి వినియోగదారుడి (ఏఆర్ పియు) సగటు ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించినట్లు తాజాగా తీసుకున్న నిర్ణయంతో తెలుస్తుంది. గత వారం, ఎయిర్‌టెల్ తన పోస్ట్ పెయిడ్ ప్లాన్లను అప్ గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment