Prepaid Users
-
జియో యూజర్లకు రెండు రోజులు ఉచితంగా కాల్స్, డేటా!
ముంబై: ఫిబ్రవరి 5న రిలయన్స్ జియో నెట్వర్క్ ఒక్కసారిగా డౌన్ అయిన సంగతి తెలిసిందే. ముంబై, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ప్రాంతాలలో రిలయన్స్ జియో సేవలలో డౌన్ కావడంతో చాలామంది రిలయన్స్ జియో వినియోగదారులు గత వారం కాల్స్ చేయడంలో ఇబ్బందిని ఎదుర్కోవలసి వచ్చింది. కాల్స్ చేసేటప్పుడు "మీరు నెట్ వర్క్ లో రిజిస్టర్ కాలేదు" అనే సందేశాన్ని వచ్చినట్లు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. ఆ అసౌకర్యానికి చింతిస్తూ రిలయన్స్ జియో ఇప్పుడు ప్రభావిత వినియోగదారులకు రెండు రోజుల ఉచిత కాలింగ్, డేటా సేవలను అందిస్తుంది. ముఖ్యంగా, రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ వాలిడిటీని రెండు రోజులు పొడీగిస్తున్నట్లు పేర్కొంది. గత వారం నెట్ వర్క్ అంతరాయం వల్ల ప్రభావితమైన కస్టమర్ల పోస్ట్ పెయిడ్ ఖాతాదారుల రెండు రోజుల వాలిడిటీ కూడా రెండు రోజులు పెంచుతున్నట్లు తెలిపింది. అయితే, ఇది కేవలం జియో నెట్వర్క్ వల్ల అసౌకర్యానికి గురైన వారికి మాత్రమే అని తెలియజేసింది. ఈ విషయాన్ని జియో తన వినియోగదారులకు ఒక సందేశం రూపంలో పంపుతుంది. పంపుతోంది. ఫిబ్రవరి 5న ముంబైతో పాటు దేశంలోని మరికొన్ని సర్కిల్స్‌లోనూ ఇదే తరహా సమస్యలు యూజర్లు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మరికొన్ని చోట్ల నాలుగైదు రోజుల నుంచి నెట్వర్క్ సరిగా పని చేయడం లేదంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. జియో నుంచి మాత్రమే కాదు.. ఇతర నెట్‌వర్క్‌ల నుంచి జియో నెంబర్లకు కాల్స్ కనెక్ట్ కావడం లేదనే ఫిర్యాదు అందాయి. (చదవండి: పీఎఫ్ ఖాతాదారులకు తీపికబురు.. వడ్డీ రేటు పెరిగే అవకాశం..!) -
ఎయిర్టెల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు షాక్!
ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు షాక్ ఇచ్చింది. నేడు(జూలై 28) ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ ప్లాన్ ధరలను సవరించినట్లు ప్రకటించింది. ఎంట్రీ లెవల్ ప్లాన్ ధరను దాదాపు 60 శాతం పెంచింది. టెలికాం ఆపరేటర్ తన రూ.49 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ను నిలిపివేసినట్లు తెలిపింది. కంపెనీ బేసిక్ ప్రీపెయిడ్ ప్యాక్స్ ఇప్పుడు రూ.79 స్మార్ట్ రీఛార్జ్ నుంచి ప్రారంభమవుతాయని, డబుల్ డేటాతో పాటు వినియోగదారులకు నాలుగు రెట్లు ఎక్కువ అవుట్ గోయింగ్ మినిట్స్ వినియోగాన్ని అందిస్తున్నట్లు ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. "మెరుగైన కనెక్టివిటీ అందించడంపై కంపెనీ దృష్టి సారించినట్లు పేర్కొంది. ఎంట్రీ లెవల్ పాలన రీఛార్జ్ చేసుకునే కస్టమర్లు ఇప్పుడు తమ అకౌంట్ బ్యాలెన్స్ గురించి ఆందోళన చెందకుండా ఎక్కువ కాలం కనెక్ట్ కావొచ్చు'' అని ఎయిర్ టెల్ తెలిపింది. ఈ కొత్త ధరలు జూలై 29, 2021 నుంచి అమల్లోకి వస్తాయి. రూ.79 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే రూ.64 టాక్ టైమ్, 200 ఎంబి డేటా, 28 రోజుల వాలిడిటీతో వస్తుంది. టెలికాం ఆపరేటర్లు ప్రతి వినియోగదారుడి (ఏఆర్ పియు) సగటు ఆదాయాన్ని పెంచడంపై దృష్టి సారించినట్లు తాజాగా తీసుకున్న నిర్ణయంతో తెలుస్తుంది. గత వారం, ఎయిర్టెల్ తన పోస్ట్ పెయిడ్ ప్లాన్లను అప్ గ్రేడ్ చేసిన సంగతి తెలిసిందే. -
బీఎస్ఎన్ఎల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్..
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) తన యూజర్ల కోసం కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. రూ.108తో రీచార్జ్ చేసుకున్నవారికి 60 రోజలు పాటు ప్రతి రోజు 1జీబీ డేటాను ఇవ్వనున్నది. ప్రత్యర్థి కంపెనీలకు ధీటుగా యూజర్లను ఆకర్షించే ప్రయత్నాల్లో భాగంగా కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను తీసు కొచ్చింది. ప్రస్తుతం రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కేవలం 28 రోజులకు లేదా 56 రోజుల కాలపరిమితితో 1జీబీ డేటాను అందిస్తున్న సంగతి తెలిసిందే. వీటితో పోలిస్తే తక్కువ రేటుకే ఈ ప్లాన్‌ను ఆఫర్ చేస్తోంది. బీఎస్ఎన్ఎల్ తన రూ.108 ల తాజా ప్లాన్‌లో 1జీబీ డేటాతో పాటు అన్లిమిటెడ్ కాలింగ్, ఉచితంగా 500 ఎస్ఎంఎస్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. నిర్దేశిత రోజువారి డేటా పూర్తి అయితే, అప్పుడు ఇంటర్నెట్ డౌన్లోడింగ్, అప్లోడింగ్ స్పీడ్‌ను 80కేబీపీఎస్‌కు పరిమితం కానుంది. అయితే ఈ కొత్త ప్యాక్ ఢిల్లీ, ముంబై ఎంటీఎన్ఎల్ నెట్ వర్క్‌లో లభ్యం. అలాగే రూ.47కే ఫస్ట్ రీచార్జ్, రూ.109 ప్లాన్ వోచర్, రూ.998, రూ.1098 లాంటి స్పెషల్ టారిఫ్ వోచర్స్ ను బీఎస్ఎన్ఎల్ రద్దు చేసింది. -
మొబైల్ యూజర్ల కోసం అమెజాన్ ప్రైమ్
న్యూఢిల్లీ: దేశీయంగా మొబైల్ యూజర్ల కోసం అమెజాన్ ప్రత్యేకంగా ప్రైమ్ వీడియో ప్లాన్లను ప్రవేశపెట్టింది. నెలకు రూ. 89 నుంచి ఇవి ప్రారంభమవుతాయి. ముందుగా భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లకు ఇది అందుబాటులో ఉంటుందని అమెజాన్ తెలిపింది. 30 రోజుల ఉచిత ట్రయల్ తర్వాత 6 జీబీ డేటాతో 28 రోజుల వ్యాలిడిటీతో రూ. 89 ప్లాన్‌ను యూజర్లు ఎంచుకోవచ్చని వివరించింది. కేవలం మొబైల్ యూజర్ల కోసమే అమెజాన్ ఇలాంటి ప్లాన్లను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఒక్క యూజర్‌కి మాత్రమే పరిమితమయ్యే ఈ ప్లాన్‌లో స్టాండర్డ్ డెఫినిషన్ నాణ్యతతో ప్రసారాలు పొందవచ్చని అమెజాన్ ప్రైమ్ వీడియో ఇండియా డైరెక్టర్ గౌరవ్ గాంధీ తెలిపారు. బహుళ యూజర్ల యాక్సెస్, హెచ్డీ/అల్ట్రా హెచ్డీ కంటెంట్, ప్రైమ్ మ్యూజిక్, అమెజాన్‌డాట్‌ఇన్ ద్వారా ఆర్డర్ల వేగవంతమైన డెలివరీ తదితర సర్వీసుల కోసం 30 రోజుల అమెజాన్ ప్రైమ్ సభ్యత్వాన్ని రూ. 131తో పొందవచ్చు. ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌తో పాటు దేశవ్యాప్తంగా పలు రీచార్జ్ పాయింట్లలో దీన్ని రీచార్జ్ చేయించుకోవచ్చు. ప్రస్తుతం నెలకు రూ. 129, వార్షికంగా రూ. 999 చార్జితో అందిస్తున్న అమెజాన్ ప్రైమ్ ఆఫర్ కూడా యథాప్రకారం అందుబాటులో ఉంటుందని గాంధీ పేర్కొన్నారు. దేశీ ఓవర్ ది టాప్ (ఓటీటీ) మార్కెట్లో డిస్నీప్లస్‌హాట్‌స్టార్, జీ5, నెట్‌ఫ్లిక్స్ తదితర సంస్థలతో కంపెనీ పోటీపడుతోంది. నెట్‌ఫ్లిక్స్ గతేడాదే మొబైల్ యూజర్ల కోసం రూ. 199 సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. -
ప్రీపెయిడ్ గడువు పెంచండి
న్యూఢిల్లీ: కరోనావైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ కారణంగా ప్రీపెయిడ్ యూజర్లు ఇబ్బందిపడకుండా తగు చర్యలు తీసుకోవాలని టెల్కోలకు టెలికం రంగ నియంత్రణ సంస్థ(ట్రాయ్) ఆదేశించింది. సర్వీసులకు అంతరాయం కలగకుండా వ్యాలిడిటీని పొడిగించే అంశాన్ని కూడా పరిశీలించాలని సూచించింది. ‘లాక్డౌన్ సమయంలో ప్రీపెయిడ్ యూజర్లంతా నిరంతరాయంగా సర్వీసులు పొందేందుకు... వ్యాలిడిటీని పొడిగించడం సహా అవసరమైన చర్యలన్నీ తీసుకోవాలి. టెలికమ్యూనికేషన్ సేవలను నిత్యావసర సర్వీసుల కింద పరిగణించి, మినహాయింపు ఇచ్చినప్పటికీ.. లాక్డౌన్ కారణంగా కస్టమర్ సర్వీస్ సెంటర్లు, పాయింట్ ఆఫ్ సేల్స్ స్టోర్లు పనిచేయకపోవడం వల్ల సర్వీసులకు విఘాతం కలగవచ్చు. దీంతో ఆఫ్‌లైన్ విధానాల్లో ప్రీపెయిడ్ బ్యాలెన్స్‌లను టాప్ అప్ చేయించుకునేవారికి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి‘ అని ట్రాయ్ సూచించింది. వ్యాలిడిటీ పొడిగించిన ఎయిర్టెల్.. లాక్‌డౌన్‌పరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని అల్పాదాయ వర్గాలకు చెందిన సుమారు 8 కోట్ల పైగా ప్రీపెయిడ్ కస్టమర్ల ప్యాకేజీల వేలిడిటీని ఏప్రిల్ 17 దాకా పొడిగిస్తున్నట్లు ఎయిర్టెల్ వెల్లడించింది. ప్లాన్ గడువు తీరిపోయినా 17 దాకా వీరంతా ఇన్కమింగ్ కాల్స్ పొందవచ్చని తెలిపింది. అలాగే, ఈ 8 కోట్ల మంది ప్రీ–పెయిడ్ అకౌంట్స్‌లోకి ఉచితంగా రూ. 10 టాక్‌టైమ్ క్రెడిట్‌గా ఇస్తున్నట్లు వివరించింది. దీన్ని టాక్‌టైమ్, ఎస్ఎంఎస్ల కోసం ఉపయోగించుకోవచ్చని, ఈ మొత్తాన్ని రికవర్ చేయబోమని ఎయిర్టెల్ పేర్కొంది. వచ్చే 48 గంటల్లో ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని తెలిపింది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కూడా.. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ కూడా ఇదే తరహాలో ఏప్రిల్ 20 దాకా ప్రీపెయిడ్ ప్యాక్‌ల వేలిడిటీ పెంచుతున్నట్లు ప్రకటించాయి. బ్యాలెన్స్ అయిపోయినప్పటికీ కనెక్టివిటీ దెబ్బతినకుండా రూ. 10 అదనపు టాక్‌టైమ్ అందిస్తున్నట్లు తెలిపాయి. -
ఎయిర్టెల్ రీచార్జ్‌పై రూ.4 లక్షల ఇన్సూరెన్స్
సాక్షి, న్యూఢిల్లీ: భారతి ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం బంపర్ఆఫర్ తీసుకొచ్చింది. రూ.599 ప్లాన్ రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు రూ.4 లక్షల విలువైన బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీతో జతకట్టింది. ఈ భాగస్వామ్య ఒప్పందం ద్వారా భారతి ఎయిర్టెల్ ప్రీ-పెయిడ్ మొబైల్ కస్టమర్లు ఆక్సా నుండి జీవిత బీమా పొందుతారని ఎయిర్టెల్ సోమవారం ప్రకటించింది. రూ.599 ఆఫర్లు రూ.599 ల కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌పై రోజుకు 2జీబీ డేటా, ఏ నెట్‌వర్క్‌కు అయినా అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఆఫర్ చేస్తుంది. ఈ ప్లాన్ 84 రోజులు చెల్లుబాటులో ఉంటుంది. ప్రతి రీఛార్జితో మూడు నెలల వరకు బీమా కవర్ ఆటోమాటిక్‌గా కొనసాగుతుంది. 18-54 సంవత్సరాల వయస్సు గల వినియోగదారులందరికీ లభించే ఈ జీవిత బీమా సౌకర్యానికి ఎలాంటి వైద్య పరీక్షలు, ధృవీకరణ పత్రం అవసరం లేదనీ, తక్షణమే డిజిటల్ కాపీని కస్టమర్ ఇంటికే పంపిస్తామని భారతి ఎయిర్టెల్ ఢిల్లీ-ఎన్‌సిఆర్, సీఈవో వాణి వెంకటేష్ తెలిపారు. భారతి ఆక్సా లైఫ్ ఇన్సూరెన్స్‌తో భాగస్వామ్యంతో సులభంగా వినియోగదారులకు లైఫ్ ఇన్సూరెన్స్‌ను అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ ప్రయోజనం పొందడానికి, కస్టమర్ ఎస్ఎంఎస్, ఎయిర్టెల్ థాంక్స్ యాప్ లేదా ఎయిర్టెల్ రిటైలర్ ద్వారా మొదట రీఛార్జ్ చేసిన తర్వాత నమోదు చేసుకోవాలన్నారు. కాగా న్యూఢిల్లీ సహా ఎంపిక చేసిన రాష్ట్రాల్లో ఈ సేవలను ప్రారంభించిందని, క్రమంగా దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో కూడా ఈ ఆఫర్ ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది. -
ఎయిర్టెల్ థ్యాంక్స్‌తో వినూత్న ఆఫర్లు
న్యూఢిల్లీ : ఎయిర్టెల్ థ్యాంక్స్ పేరుతో ప్రారంభించిన ప్రోగ్రాంను విభిన్న సేవలు, కస్టమర్లకు వినూత్న అనుభవం ఇచ్చేలా విస్తృతం చేసేందుకు కంపెనీ సంసిద్ధమైంది. ఎయిర్టెల్ధ్యాంక్స్ మరింత కంటెంట్, డివైజ్, సెక్యూరిటీ, వాణిజ్య సేవలు, వీఐపీ కస్టమర్ కేర్, టాప్ బ్రాండ్స్ నుంచి వినూత్న ఆఫర్లను కస్టమర్ల ముందుకు తీసుకువస్తున్నట్టు ఎయిర్టెల్ పేర్కొంది. టెలికాం పరిశ్రమలోనే తొలిసారిగా థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా ప్రీపెయిడ్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను అందిస్తోంది. రూ 299కే అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌తో పాటు, రోజుకు 2.5 జీబీ డేలా, 28 రోజుల పాటు అపరిమిత కాల్స్ సదుపాయం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎయిర్టెల్ కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చేలా ఎయిర్టెల్ థ్యాంక్స్‌ను రీడిజైన్ చేసినట్టు సంస్ధ తెలిపింది. -
వోడాఫోన్ బంపర్ ఆఫర్
టెలికాంసంస్థ వొడాఫోన్ తన ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్టెల్, జియోలకు దీటుగా ఆఫర్లతో ముందుకొచ్చింది. వోడాఫోన్ ప్రీపెయిడ్ వినియోగదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్యాక్‌లను మై వొడాఫోన్ యాప్ ద్వారా రీచార్జి చేసుకున్న వారికి నిర్దేశిత వోచర్లు వస్తాయి. అంటే రీచార్జ్ చేసుకున్న ప్లాన్ఆధారంగా ఈ వోచర్లు లభిస్తాయి. ఒక్కో వోచర్ విలువ రూ.50 ఉంటుంది. వీటిని తదుపరి చేసుకునే రీచార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. రూ.399, రూ.458, రూ.509 ప్యాక్‌లను రీచార్జి చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ.399 రీచార్జికు 8 వోచర్లు, రూ.458కు 9, రూ.509 రీచార్జికి 10 వోచర్లను వోడాఫోన్ అందిస్తోంది. వీటిద్వారా తదుపరి రీచార్జ్ సమయంలో 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. -
బీఎస్ఎన్ఎల్ 'రక్షాబంధన్' బంపర్ ఆఫర్...
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్ల కోసం సరికొత్త ఆఫర్ ప్రకటించింది. ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా రక్షాబంధన్ ఆఫర్‌ను వినియోగదారులకు అందివ్వనుంది.రేపు (ఆదివారం) రాఖీ పండగ సందర్భంగా 'రక్షాబంధన్' స్పెషల్ ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ స్పెషల్ ఆఫర్ రేపటి నుంచి అందుబాటులోకి వస్తుందని సంస్థ ట్విటర్లో వెల్లడించింది. ఈ సరికొత్తరీచార్జ్పై వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్, అపరిమిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. రూ.399 రీచార్జ్‌పై రోజుకు 1 జీబీ డేటా చొప్పున 74 రోజుల పాటు అపరిమిత డేటా ఆఫర్ చేస్తోంది. ఇంకా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్‌ను, రోజుకు 100 ఎస్ఎంఎస్లను ఆఫర్ చేస్తోంది. ఈ 'రక్షాబంధన్' ఆఫర్ దేశమంతటా వర్తిస్తుంది. అన్లిమిటెడ్ పర్సనలైజ్డ్ రింగ్ బ్యాక్ టోన్ (పీఆర్బీటీ)ను ఉచితంగా అందిస్తుంది. -
ఓన్లీ కాలింగ్ : ఎయిర్టెల్ కొత్త ప్లాన్
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో, వొడాఫోన్ల నుంచి వస్తున్న గట్టి పోటీతో టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఎప్పడికప్పుడు సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూ ఉంది. ఇన్ని రోజులు డేటా టారిఫ్ ప్లాన్లతో పోటీ పడ్డ కంపెనీలు, తాజాగా కాలింగ్ ప్రయోజనాలతో కూడా పోటీపడుతున్నాయి. ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. అదే 299 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్ కింద 45 రోజుల పాటు అపరిమితంగా వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందించనున్నట్టు ఎయిర్టెల్ పేర్కొంది. టెలికాం టాక్ రిపోర్టు ప్రకారం.. ఎయిర్టెల్ తన సబ్స్క్రైబర్లకు రూ.299 ప్లాన్ కింద అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందజేయనున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు కాలింగ్‌లో రోజువారీ పరిమితులతో ఇబ్బంది పడ్డ వారికి, ఇది ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితులను విధించడం లేదు. అయితే ఈ ప్లాన్‌లో మేజర్ విషయం కస్టమర్లకు ఎలాంటి డేటాను అందించకపోవడం. ఎలాంటి డేటా ప్రయోజనాలు లేకుండా.. కేవలం అపరిమిత కాలింగ్ ప్లాన్‌గానే దీన్ని తీసుకొచ్చింది. ఈ టెలికాం ఆపరేటర్ ఇప్పటికే రూ.249, రూ.349 ప్లాన్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్లపై అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా ప్రయోజనాలను కేవలం 28 రోజుల పాటు అందిస్తోంది. ఇటీవల రూ.1,199 పోస్టు పెయిడ్ ప్లాన్‌ను కూడా ఎయిర్టెల్ సమీక్షించింది. ఈ అప్‌గ్రేడేషన్‌తో అంతకముందు అందించే 90 జీబీ డేటా పరిమితిని, 120 జీబీకి ఎయిర్టెల్ పెంచింది. -
జియో డబుల్ ధమాకా ఆఫర్
టెలికాం ప్రత్యర్థుల గుండెల్లో ఎప్పడికప్పుడూ రైళ్లు పరిగెత్తించే రిలయన్స్ జియో తన కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. కంపెనీ తన ప్రీపెయిడ్ యూజర్లకు కొత్తగా డబుల్ ధమాకా ఆఫర్ ప్రకటించింది. ఈ ఆఫర్ కింద అదనంగా తన యూజర్లకు 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో ఈ ఆఫర్‌ను మంగళవారం ప్రకటించింది. ఎయిర్టెల్ ఇటీవలే తన రూ.149, రూ.399 ప్లాన్లపై అదనంగా 1 జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది. దీనికి కౌంటర్‌గా జియో తన ఎంపిక చేసిన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్యాక్‌లపై అదనంగా 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు పేర్కొంది. అయితే ఎయిర్టెల్ ఈ అదనపు డేటాను ఎంపిక చేసిన యూజర్లకు ఇస్తే, జియో తన యూజర్లందరికీ ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి జూన్ 30 వరకు ఈ ఆఫర్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. డబుల్ ధమాకా ఆఫర్‌తో పాటు, ఈ ఆపరేటర్ కొత్తగా రూ.499 రీఛార్జ్ ప్యాక్‌ను కూడా 3 నెలల వాలిడిటీతో లాంచ్ చేసింది. ఈ కొత్త ప్యాక్‌పై రోజుకు 3.5 జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది. కొత్త జియో డబుల్ ధమాకా ఆఫర్.. రోజుకు 1.5 జీబీ డేటా పొందే రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 3జీబీ డేటా పొందనున్నారు. రోజుకు 2 జీబీ డేటా పొందే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్ యూజర్లకు ఇక నుంచి రోజుకు 3.5 జీబీ డేటా లభ్యం. రోజుకు 3 జీబీ డేటా పొందే రూ.299 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 4.5 జీబీ డేటా పొందనున్నారు. రోజుకు 4 జీబీ డేటా పొందే రూ.509 ప్యాక్ యూజర్లకు ఇక నుంచి రోజుకు 5.5 జీబీ డేటా లభ్యం. రోజుకు 5 జీబీ డేటా పొందే రూ.799 ప్యాక్ యూజర్లు ఇక నుంచి రోజుకు 6.5 జీబీ డేటా పొందనున్నారు. దీంతో పాటు 300 రూపాయలు, ఆపై మొత్తాల అన్ని రీఛార్జ్‌లపై జియో 100 రూపాయల డిస్కౌంట్ ఆఫర్ చేయనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌లపై 20 శాతం తగ్గింపు ఇస్తోంది. అయితే ఈ డిస్కౌంట్ల కోసం మైజియో యాప్, పేటీఎం వాడుతూ ఫోన్‌పే వాలెట్ ద్వారానే రీఛార్జ్ చేయించుకోవాలి. పైన పేర్కొన్న ప్యాక్‌ల వాలిడిటీలను మాత్రం కంపెనీ మార్చలేదు. డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఉచిత ఎస్ఎంఎస్లు, జియో యాప్స్ యాక్సస్‌ను పొందవచ్చు. మరోవైపు తాజాగా తీసుకొచ్చిన రూ.499 రీఛార్జ్ ప్యాక్, 91 రోజుల వాలిడిటీలో అందుబాటులో ఉండనుంది. దీనిపై రోజుకు 3.5 జీబీ డేటాను కంపెనీ ఆఫర్ చేస్తోంది. మొత్తంగా ఈ ప్యాక్‌పై 318 జీబీ డేటాను యూజర్లు పొందనున్నారు. ఈ ఆపరేటర్ గతేడాది డిసెంబర్లో రూ.499 రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది కానీ ఆ అనంతరం ఈ ప్యాక్ ధరను రూ.449కు తగ్గించింది. -
జియో హాలిడే హంగామా : బంపర్ ఆఫర్
రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన వినియోగదారులను ఆశ్చర్యపరచడానికి హాలిడే హంగామా ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ కింద తన పాపులర్ ప్లాన్ 399 రూపాయలపై డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ ప్లాన్ 299 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. జియో రూ.399 ప్లాన్ అత్యధిక యూజర్లు రీఛార్జ్ చేసుకునే ప్లాన్. జియో ప్రస్తుతం ప్రకటించిన వంద రూపాయల డిస్కౌంట్ 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అంటే జూన్ 1 నుంచి జూన్ 15 వరకే ఈ డిస్కౌంట్ యూజర్లకు లభిస్తుంది. అయితే ఫోన్‌పే వాలెంట్ ద్వారా రీఛార్జ్ చేసుకున్న కొనుగోలుదారులకు మాత్రమే ఈ డిస్కౌంట్ లభ్యమవుతుంది. రీఛార్జ్ చేసుకున్న వెంటనే 50 రూపాయల డిస్కౌంట్‌ను పొందనున్నారు. ఆ అనంతరం రూ.50ను ఓచర్ల రూపంలో కస్టమర్లకు లభిస్తుంది. మైజియో యాప్‌లో ఉన్న ఫోన్‌పే ద్వారా ఈ రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ కింద 84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ చొప్పున నెలకు 126 జీబీ డేటాతోపాటు, అన్లిమిటెడ్ కాల్స్, రోజులకు 100 ఎస్ఎంఎస్లను జియో అందిస్తోంది. రోజుకు 1.5 జీబీ డేటా అయిపోయిన తర్వాత కూడా నెట్ వాడుకోవచ్చు. కానీ స్పీడ్ 64కేబీపీఎస్‌కు పడిపోతుంది. -
జియోకి పోటీ : రూ.49కే 3జీబీ డేటా
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, మరోసారి రిలయన్స్ జియోకి కౌంటర్ ఇచ్చింది. ఒక్కరోజు వాలిడిటీతో 49 రూపాయలతో కొత్తగా ప్రీపెయిడ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. దీని కింద 3జీబీ 3జీ లేదా 4జీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు పేర్కొంది. ఇది కేవలం ఎంపిక చేసిన సబ్స్క్రైబర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్‌కు ఇప్పటికే రూ.49 ప్రీపెయిడ్ ప్యాక్ ఉంది. కానీ ఆ ప్యాక్‌లో కేవలం 1జీబీ 3జీ/4జీ డేటాను మాత్రమే ఆఫర్ చేస్తోంది. దీన్ని తన కస్టమర్లందరకూ అందిస్తోంది. ఎయిర్టెల్ ప్రస్తుతం తీసుకొచ్చిన ఈ ప్యాక్, రిలయన్స్ జియో రూ.49 ప్యాక్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. జియో ప్యాక్ వాలిడిటీ 28 రోజులు. కొత్తగా తీసుకొచ్చిన ఈ ప్యాక్‌ను పొందడానికి ఎయిర్టెల్ ప్రీపెయిడ్ యూజర్లు మై ఎయిర్టెల్ యాప్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది లేదా కంపెనీ వెబ్సైట్లోకి లాగిన్ అవ్వాలి. డేటా సెక్షన్ కింద ఈ ప్యాక్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌కు యూజర్లు అర్హులో కాదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అర్హులు కాకపోతే, కేవలం 1జీబీ 4జీ డేటాను మాత్రమే పొందాల్సి ఉంటుంది. ఎయిర్టెల్ అందించే ఇతర ఆఫర్ల విషయానికొస్తే, ఇటీవలే కంపెనీ రూ.249 రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్ చేసింది. రూ.349 ప్యాక్‌ను అప్డేట్ చేసింది. రూ.249 ప్యాక్ కింద రోజుకు 2జీబీ డేటాను ఆఫర్‌చేస్తుండగా.. అప్డేట్ చేసిన ప్యాక్‌లో రోజుకు 3జీబీ డేటాను ఆఫర్ చేస్తోంది. -
ఎయిర్టెల్ సూపర్ ఆఫర్
సాక్షి, ముంబై : జియో రాకతో మార్కెట్లో నిలబడటానికి టెలికం కంపెనీలు రోజుకో కొత్త ప్లాన్లను ప్రవేశపెడుతున్నాయి. వినియోగదారులను ఆకర్శించడానికి సరికొత్త ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగా ఎయిర్టెల్ జియో రూ.98 ఆఫర్‌కు పోటీగా రూ.93కే కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. పదిరోజుల కాలపరిమితితో ఈ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. రీచార్జ్: రూ.93 కాల్స్: అన్‌లిమిటెట్ డేటా: 1జీబీ 3జీ/4జీ డేటా కాలపరిమితి: పది రోజులు -
వొడాఫోన్ చోటా ఛాంపియన్ ప్లాన్
దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటైన వొడాఫోన్, నేడు(సోమవారం) ఓ స్పెషల్ వాయిస్, డేటా ప్యాక్‌ను లాంచ్ చేసింది. మధ్య ప్రదేశ్, చత్తీష్‌ఘర్, బిహార్, జార్ఖాండ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంత ప్రీపెయిడ్ కస్టమర్లకు వొడాఫోన్ చోటా ఛాంపియన్ ప్లాన్‌ను లాంచ్ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్ కింద 38 రూపాయలకే 100 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యాన్ని, 100ఎంబీ 3జీ, 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది. వొడాఫోన్ తన కస్టమర్లకు ఎల్లప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలు అందిస్తూ ఉంటుందని వొడాఫోన్ ఇండియా కన్జ్యూమర్ బిజినెస్ అసోసియేట్ డైరెక్టర్ అవ్నీష్ కోస్లా తెలిపారు. ఈ విధంగా అందిస్తున్న ఆవిష్కరణలో భాగమే వొడాఫోన్ చోటా ఛాంపియన్ ప్యాక్ అని, తక్కువ ధరలో నెలంతా ప్రయోజనాలను అందించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. అదనంగా కస్టమర్లకు 100ఎంబీ డేటాను అందిస్తున్నామని, ఇక ఎంతో విశ్వాసంతో కస్టమర్లు తమకు కనెక్ట్ అయి ఉంటారన్నారు. ఇటీవలే వొడాఫోన్ తన కొత్త ఫస్ట్ రీఛార్జ్ కూపన్(ఎఫ్ఆర్సీ)ని రూ.496కు లాంచ్చేసింది. ఢిల్లీ, ఎన్సీఆర్ పరిధిలోని కొత్త వొడాఫోన్ ప్రీపెయిడ్ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వొడాఫోన్ తీసుకొచ్చిన రూ.496 ప్లాన్, రిలయన్స్ జియో రూ.459 ప్లాన్‌కి గట్టి పోటీగా ఉంది. దీంతో పాటు వొడాఫోన్ ఎఫ్ఆర్సీ 177 ప్లాన్‌ను లాంచ్చేసింది. దీని కింద 28 రోజలు పాటు 28జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని అందిస్తోంది. -
ఐడియా ఆఫర్ అదుర్స్
న్యూఢిల్లీ : టెలికాం సెక్టార్ లో సంచలనానికి సిద్ధమవుతున్న రిలయన్స్ జియో పోటీని తట్టుకునేందుకు మిగతా టెలికాం సంస్థలు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. మొన్న హ్యాపీ అవర్స్ డేటాతో అతిపెద్ద టెలికాం కంపెనీ ఎయిర్ టెల్ వినియోగదారుల ముందుకు రాగా.. ఇపుడు ఆ కోవలోకి మరో టెలికాం దిగ్గజం ఐడియా కూడా చేరిపోయింది. డేటా ప్యాక్ రేట్లలో 45శాతం కోత విధిస్తున్నట్టు ఐడియా సెల్యులార్ శుక్రవారం ప్రకటించింది. దేశంలోనే మూడో అతిపెద్ద టెలికాం ఆపరేటర్ గా ఉన్న ఐడియా తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఈ ఆఫర్ ను అందిస్తున్నట్టు తెలిపింది. జీయో దీటుగా....తమ ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు, కొత్త వారిని ఆకర్షించేందుకు ఐడియా ఈ సేవలను ఆవిష్కరించింది. 175 మిలియన్ యూజర్లు కలిగి ఉన్న ఐడియా సెల్యులార్, తన 4జీ, 3జీ, 2జీ యూజర్లకు 1జీబీ డేటాలో 45 శాతం డేటా రాయితీని అందించనుంది. ఇప్పటివరకూ మూడు రోజుల 75ఎంబీ డేటాకు రూ.19 లు చార్జ్ చేసేవారు. అయితే ఈ 45శాతం ఆఫర్ కింద అదే చార్జ్ మీద 110ఎంబీ డేటాను ఇకనుంచి కస్టమర్లు పొందుతారు. అదేవిధంగా 4జీ/3జీ డేటా ప్యాక్ లో రూ.22లకు 65ఎంబీ డేటాను మూడు రోజుల పాటు వినియోగదారులు పొందేవారు. ప్రస్తుతం ..90ఎంబీ డేటాను వినియోగదారులు వాడుకోవచ్చు. దీంతో 38శాతం ఎక్కువ డేటా సౌకర్యాన్ని కస్టమర్లకు అందుతాయి. రూ.8 నుంచి రూ.225 ల మధ్య విస్తృతమైన సాచెట్ డేటా ప్యాక్స్ ను కూడా ఐడియా ప్రకటించింది. ఈ డేటా ప్యాక్ ఆఫర్లు అన్ని సర్కిల్స్ లో శుక్రవారం నుంచి అందుబాటులో ఉంటాయని ఐడియా తెలిపింది. గురువారమే ఎయిర్ టెల్ కూడా తన ప్రీ పెయిడ్ కస్టమర్లకు ఉదయం 3 గం.ల నుంచి 5 గంటలకు వరకు వినియెగించే డేటాలో 50 శాతం తిరిగి ఆఫర్ చేస్తోంది. ఈ సమయంలో చేసుకున్న కంటెంట్ డౌన్ లోడ్ పై 50 డేటా బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్టు ఎయిర్ టెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ఎయిర్ టెల్ హ్యాపీ అవర్స్ డేటా
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ డాటా వినియోగదారులను ఆకట్టుకొనేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మరో ఆఫర్ ను తీసుకొచ్చింది. రిలయన్స్ జియో సిమ్ కార్డులు ఆగష్టులో కమర్షియల్ గా విడుదల కానున్న నేపథ్యలో తమ ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు, కొత్తవారిని ఆకర్షించేందుకు సునీల్ భారతీ మిట్టల్ నేతృత్వంలోని భారతి ఎయిర్ టెల్ వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా ప్రీ పెయిడ్ యూజర్ల కోసం హ్యాపీ డేటా ను ప్రకటించింది. ఉదయం 3 గం.ల నుంచి 5 గంటలకు వరకు వినియెగించే డాటా లో 50 శాతం తిరిగి ఆఫర్ చేస్తోంది. ఈ సమయంలో చేసుకున్న కంటెంట్ డౌన్ లోడ్ పై 50 డాటా బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్టు ఎయిర్ టెల్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఈ తాజా ఆఫర్ ద్వారా , ఖతాదారులు హ్యాపీ అవర్స్ లో పాటలు, వీడియోలు డోన్ లోడ్ చేసుకోవడం ద్వారా యాప్ డెవలపర్లకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అజయ్ పూరీ డైరెక్టర్ - ఆపరేషన్స్ ( భారతదేశం మరియు దక్షిణ ఆసియా) చెప్పారు. అత్యవసరంకాని వీడియోలు, ఫోటో ఆల్బములు , సంగీతం లాంటి భారీ డౌన్లోడ్లు షెడ్యూల్ టైంలో చేసుకోవడం ద్వారా 50 శాతం డేటా సేవ్ చేసుకోవచ్చన్నారు. మరోవైపు వినియోగదారులకు కొన్ని ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వారి వెబ్సైట్ల అభివృద్ధి , యాప్ డెవలపర్లను ఫెసిలిటేట్ చేయాలని ట్రోయ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ట్రాయ్ కోరింది. కాగా ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ వచ్చే నెలలోనే వాణిజ్యపరంగా జియో 4జీ సేవలను లాంచ్ చేసేందుకు సిద్ధమతోంది. ఈ నేపథ్యంలోనే రద్దీ గంటల్లో ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకు వస్తోంది. ఎయిర్ టెల్ కు 35 మిలియన్ల బ్రాడ్ బ్యాండ్ యూజర్లు ఉన్నారు. అటు రిలయన్స్ జియో కూడా ఆకర్షణీయమైన ఆఫర్లతో యూజర్లను ఊరిస్తోంది. మరి 4జీ సేవలను చేరవేయడంలో వినియోగదారుల మనసు గెలుచుకునేదెవరో తేలాలంటే..వెయిట్ చేయాల్సిందే.. -
ఐడియా, రిలయన్స్ డేటా యూజర్లకు న్యూ స్కీమ్స్
న్యూఢిల్లీ : కస్టమర్లకు మెరుగైన సర్వీసులను అందించే లక్ష్యంతో, రెండు అతిపెద్ద టెలికాం సర్వీసు ప్రొవైడర్లు కొత్త స్కీమ్ లను ప్రవేశపెట్టాయి. రిలయన్స్ కమ్యూనికేషన్ తన 3జీ, 2జీ నెట్ వర్క్ ప్రీ పెయిడ్ కస్టమర్ల కోసం డేటా లోన్ సర్వీసును ఆవిష్కరించగా... ఐడియా సెల్యులార్ రాత్రిపూట నెట్ వాడుకునే యూజర్లకు 4జీ, 3జీ డేటా ధరలను 50శాతం తగ్గించనుందని ప్రకటించింది. డేటా యూజర్లకు ఈ స్కీమ్ లు ఎంతో సహకరించనున్నట్టు ఆ కంపెనీలు పేర్కొన్నాయి. డేటా లోన్ సర్వీసు ద్వారా తక్కువ డేటా ఉన్న ప్రీఫైడ్ కస్టమర్లు టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేసి, వెంటనే 60ఎమ్ బీ వరకూ డేటా లోన్ పొందవచ్చని రిలయన్స్ కమ్యూనికేషన్ తెలిపింది. రిలయన్స్ ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా కస్టమర్లకు డేటా సర్వీసులు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, ఏ సమయంలో కూడా (రాత్రిపూట కూడా) డేటా సర్వీసులకు ఆటంకం వాటిల్లకుండా ఉంటుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గుర్ దీప్ సింగ్ తెలిపారు. ఐడియా ప్రకటించిన స్కీమ్ ద్వారా నెలకు రూ.125 కే 1జీబీ డేటాను రాత్రిపూట అందుబాటులోకి తేనున్నారు. దీనివల్ల మామూలు ధరల కంటే తక్కువగా 50శాతం పొదుపు చేసుకోవచ్చని ఐడియా సెల్యులార్ తెలిపింది. అదేవిధంగా డే అండ్ నైట్ ట్విన్ ప్యాక్ నూ ఐడియా ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్ ద్వారా నెలకు 500 ఎమ్ బీ డేటా నుంచి 40జీబీ డేటా రీఛార్జ్ వరకూ 30శాతం డిస్కౌంట్ పొందవచ్చని ప్రకటించింది.