రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన వినియోగదారులను ఆశ్చర్యపరచడానికి హాలిడే హంగామా ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఆఫర్ కింద తన పాపులర్ ప్లాన్ 399 రూపాయలపై డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో ఈ ప్లాన్ 299 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. జియో రూ.399 ప్లాన్ అత్యధిక యూజర్లు రీఛార్జ్ చేసుకునే ప్లాన్. జియో ప్రస్తుతం ప్రకటించిన వంద రూపాయల డిస్కౌంట్ 15 రోజులు మాత్రమే అందుబాటులో ఉండనుంది. అంటే జూన్ 1 నుంచి జూన్ 15 వరకే ఈ డిస్కౌంట్ యూజర్లకు లభిస్తుంది.
అయితే ఫోన్‌పే వాలెంట్ ద్వారా రీఛార్జ్ చేసుకున్న కొనుగోలుదారులకు మాత్రమే ఈ డిస్కౌంట్ లభ్యమవుతుంది. రీఛార్జ్ చేసుకున్న వెంటనే 50 రూపాయల డిస్కౌంట్‌ను పొందనున్నారు. ఆ అనంతరం రూ.50ను ఓచర్ల రూపంలో కస్టమర్లకు లభిస్తుంది. మైజియో యాప్‌లో ఉన్న ఫోన్‌పే ద్వారా ఈ రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్లాన్ కింద 84 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ చొప్పున నెలకు 126 జీబీ డేటాతోపాటు, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజులకు 100 ఎస్‌ఎంఎస్‌లను జియో అందిస్తోంది. రోజుకు 1.5 జీబీ డేటా అయిపోయిన తర్వాత కూడా నెట్ వాడుకోవచ్చు. కానీ స్పీడ్ 64కేబీపీఎస్‌కు పడిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment