ఎయిర్ టెల్ హ్యాపీ అవర్స్ డేటా
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ డాటా వినియోగదారులను ఆకట్టుకొనేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మరో ఆఫర్ ను తీసుకొచ్చింది. రిలయన్స్ జియో సిమ్ కార్డులు ఆగష్టులో కమర్షియల్ గా విడుదల కానున్న నేపథ్యలో తమ ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు, కొత్తవారిని ఆకర్షించేందుకు సునీల్ భారతీ మిట్టల్ నేతృత్వంలోని భారతి ఎయిర్ టెల్ వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా ప్రీ పెయిడ్ యూజర్ల కోసం హ్యాపీ డేటా ను ప్రకటించింది.
ఉదయం 3 గం.ల నుంచి 5 గంటలకు వరకు వినియెగించే డాటా లో 50 శాతం తిరిగి ఆఫర్ చేస్తోంది. ఈ సమయంలో చేసుకున్న కంటెంట్ డౌన్ లోడ్ పై 50 డాటా బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్టు ఎయిర్ టెల్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.
తమ ఈ తాజా ఆఫర్ ద్వారా , ఖతాదారులు హ్యాపీ అవర్స్ లో పాటలు, వీడియోలు డోన్ లోడ్ చేసుకోవడం ద్వారా యాప్ డెవలపర్లకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అజయ్ పూరీ డైరెక్టర్ - ఆపరేషన్స్ ( భారతదేశం మరియు దక్షిణ ఆసియా) చెప్పారు. అత్యవసరంకాని వీడియోలు, ఫోటో ఆల్బములు , సంగీతం లాంటి భారీ డౌన్లోడ్లు షెడ్యూల్ టైంలో చేసుకోవడం ద్వారా 50 శాతం డేటా సేవ్ చేసుకోవచ్చన్నారు. మరోవైపు వినియోగదారులకు కొన్ని ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వారి వెబ్సైట్ల అభివృద్ధి , యాప్ డెవలపర్లను ఫెసిలిటేట్ చేయాలని ట్రోయ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ట్రాయ్ కోరింది.
కాగా ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ వచ్చే నెలలోనే వాణిజ్యపరంగా జియో 4జీ సేవలను లాంచ్ చేసేందుకు సిద్ధమతోంది. ఈ నేపథ్యంలోనే రద్దీ గంటల్లో ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకు వస్తోంది. ఎయిర్ టెల్ కు 35 మిలియన్ల బ్రాడ్ బ్యాండ్ యూజర్లు ఉన్నారు. అటు రిలయన్స్ జియో కూడా ఆకర్షణీయమైన ఆఫర్లతో యూజర్లను ఊరిస్తోంది. మరి 4జీ సేవలను చేరవేయడంలో వినియోగదారుల మనసు గెలుచుకునేదెవరో తేలాలంటే..వెయిట్ చేయాల్సిందే..