happy hours
-
శాంసంగ్ హ్యాపీ అవర్స్ సేల్
సాక్షి, ముంబై: గ్లోబల్ ఇ-కామర్స్ లీడర్ అమెజాన్ ఇండియా శాంసంగ్ హ్యాపీ అవర్స్ సేల్ నిర్వహిస్తోంది. ఈ విక్రయంలో భాగంగా, శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ రేంజ్ స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్, నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందిస్తోంది. ఇటీవల లాంచ్ చేసిన ఈ సేల్‌ను మరోసారి ప్రారంభించింది. ముఖ్యంగా ఇటీవలే ప్రారంభించిన గెలాక్సీ ఎ8 + పై 2వేల రూపాయలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభ్యం. దీనికి తోడు ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లకు 1,500 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా. అయితే ఈఎంఐ ఆఫర్ ఎంచుకున్న వినియోగదారులకు ఈ ఆఫర్ చెల్లదు. అలాగే బజాజ్ ఫిన్ ఇఎమ్ఐ కార్డుతోపాటు అన్ని ప్రధాన క్రెడిట్ కార్డులు (యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, సిటిబాంక్, ఎస్బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఆర్బీఎఎల్, హెచ్ఎస్బీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్) పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను అందిస్తోంది. ఇదే ఆఫర్లతో గెలాక్సీ ఆన్7 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ రూ.12,990కే అందుబాటులో ఉంది. బడ్జెట్ స్మార్ట్ఫోన్లపై బడ్జెట్ స్మార్ట్ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ ఆన్ 5 ప్రో , ఆన్ 7 ప్రో వరుసగా వెయ్యి, 2వేల రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ తరువాత, ఆన్ 5 ప్రో రూ .6,990, ఆన్ 7 ప్రో రూ .7,490 వద్ద అందుబాటులో ఉంది. ఎయిర్టెల్ కస్టమర్లకోసం ఇక చివరగా హ్యాపీ అవర్స్ సేల్‌లో ఎయిర్టెల్ కస్టమర్లకు కూడా ఆఫర్లు ఉన్నాయి. గెలాక్సీ జె2, గెలాక్సీ జె7 ప్రో, గెలాక్సీ జె7 ప్రైమ్, గెలాక్సీ జె5 ప్రైమ్ లాంటి గెలాక్సీ జెసిరీస్ స్మార్ట్ఫోన్ల కొనుగోళ్లపై రూ. 1500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ తరువాత వీటి ధరలు వరుసగా రూ. 5,490, రూ.18,400, రూ. 12,400, రూ.10,490లకే లభ్యం కానున్నాయి -
ఎయిర్ టెల్ హ్యాపీ అవర్స్ డేటా
న్యూఢిల్లీ: ఇంటర్నెట్ డాటా వినియోగదారులను ఆకట్టుకొనేందుకు టెలికాం దిగ్గజం ఎయిర్ టెల్ మరో ఆఫర్ ను తీసుకొచ్చింది. రిలయన్స్ జియో సిమ్ కార్డులు ఆగష్టులో కమర్షియల్ గా విడుదల కానున్న నేపథ్యలో తమ ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు, కొత్తవారిని ఆకర్షించేందుకు సునీల్ భారతీ మిట్టల్ నేతృత్వంలోని భారతి ఎయిర్ టెల్ వ్యూహాలు పన్నుతోంది. ఇందులో భాగంగా ప్రీ పెయిడ్ యూజర్ల కోసం హ్యాపీ డేటా ను ప్రకటించింది. ఉదయం 3 గం.ల నుంచి 5 గంటలకు వరకు వినియెగించే డాటా లో 50 శాతం తిరిగి ఆఫర్ చేస్తోంది. ఈ సమయంలో చేసుకున్న కంటెంట్ డౌన్ లోడ్ పై 50 డాటా బ్యాక్ ఆఫర్ చేస్తున్నట్టు ఎయిర్ టెల్ గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. తమ ఈ తాజా ఆఫర్ ద్వారా , ఖతాదారులు హ్యాపీ అవర్స్ లో పాటలు, వీడియోలు డోన్ లోడ్ చేసుకోవడం ద్వారా యాప్ డెవలపర్లకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని అజయ్ పూరీ డైరెక్టర్ - ఆపరేషన్స్ ( భారతదేశం మరియు దక్షిణ ఆసియా) చెప్పారు. అత్యవసరంకాని వీడియోలు, ఫోటో ఆల్బములు , సంగీతం లాంటి భారీ డౌన్లోడ్లు షెడ్యూల్ టైంలో చేసుకోవడం ద్వారా 50 శాతం డేటా సేవ్ చేసుకోవచ్చన్నారు. మరోవైపు వినియోగదారులకు కొన్ని ప్రోత్సాహకాలను అందించడం ద్వారా వారి వెబ్సైట్ల అభివృద్ధి , యాప్ డెవలపర్లను ఫెసిలిటేట్ చేయాలని ట్రోయ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లను ట్రాయ్ కోరింది. కాగా ముఖేష్ అంబానీ యాజమాన్యంలోని రిలయన్స్ వచ్చే నెలలోనే వాణిజ్యపరంగా జియో 4జీ సేవలను లాంచ్ చేసేందుకు సిద్ధమతోంది. ఈ నేపథ్యంలోనే రద్దీ గంటల్లో ఖాతాదారులను నిలబెట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్లతో ముందుకు వస్తోంది. ఎయిర్ టెల్ కు 35 మిలియన్ల బ్రాడ్ బ్యాండ్ యూజర్లు ఉన్నారు. అటు రిలయన్స్ జియో కూడా ఆకర్షణీయమైన ఆఫర్లతో యూజర్లను ఊరిస్తోంది. మరి 4జీ సేవలను చేరవేయడంలో వినియోగదారుల మనసు గెలుచుకునేదెవరో తేలాలంటే..వెయిట్ చేయాల్సిందే..