సాక్షి, ముంబై: గ్లోబల్ ఇ-కామర్స్ లీడర్ అమెజాన్ ఇండియా శాంసంగ్ హ్యాపీ అవర్స్ సేల్ నిర్వహిస్తోంది. ఈ విక్రయంలో భాగంగా, శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ రేంజ్ స్మార్ట్‌ఫోన్లపై డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్, నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ అందిస్తోంది. ఇటీవల లాంచ్ చేసిన ఈ సేల్‌ను మరోసారి ప్రారంభించింది.
ముఖ్యంగా ఇటీవలే ప్రారంభించిన గెలాక్సీ ఎ8 + పై 2వేల రూపాయలు ఎక్స్ఛేంజ్ ఆఫర్ లభ్యం. దీనికి తోడు ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లకు 1,500 రూపాయల క్యాష్ బ్యాక్ కూడా. అయితే ఈఎంఐ ఆఫర్ ఎంచుకున్న వినియోగదారులకు ఈ ఆఫర్ చెల్లదు. అలాగే బజాజ్ ఫిన్ ఇఎమ్ఐ కార్డుతోపాటు అన్ని ప్రధాన క్రెడిట్ కార్డులు (యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, సిటిబాంక్, ఎస్‌బీఐ, ఇండస్ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, కొటక్ బ్యాంక్, ఆర్‌బీఎఎల్, హెచ్ఎస్‌బీ, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్) పై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్‌ను అందిస్తోంది. ఇదే ఆఫర్లతో గెలాక్సీ ఆన్7 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్ రూ.12,990కే అందుబాటులో ఉంది.
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లపై
బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు శాంసంగ్ గెలాక్సీ ఆన్ 5 ప్రో , ఆన్ 7 ప్రో వరుసగా వెయ్యి, 2వేల రూపాయల ఫ్లాట్ డిస్కౌంట్. ఈ డిస్కౌంట్ తరువాత, ఆన్ 5 ప్రో రూ .6,990, ఆన్ 7 ప్రో రూ .7,490 వద్ద అందుబాటులో ఉంది.
ఎయిర్‌టెల్ కస్టమర్లకోసం
ఇక చివరగా హ్యాపీ అవర్స్ సేల్‌లో ఎయిర్‌టెల్ కస్టమర్లకు కూడా ఆఫర్లు ఉన్నాయి. గెలాక్సీ జె2, గెలాక్సీ జె7 ప్రో, గెలాక్సీ జె7 ప్రైమ్, గెలాక్సీ జె5 ప్రైమ్ లాంటి గెలాక్సీ జెసిరీస్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లపై రూ. 1500 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఈ క్యాష్‌బ్యాక్ తరువాత వీటి ధరలు వరుసగా రూ. 5,490, రూ.18,400, రూ. 12,400, రూ.10,490లకే లభ్యం కానున్నాయి
Comments
Please login to add a commentAdd a comment