వోడాఫోన్‌ బంపర్‌ ఆఫర్‌ | Vodafone Offers 100 Percent Cashback on Unlimited Recharge Packs | Sakshi
Sakshi News home page

వోడాఫోన్‌ బంపర్‌ ఆఫర్‌

Published Mon, Nov 19 2018 4:39 PM | Last Updated on Mon, Nov 19 2018 4:50 PM

Vodafone Offers 100 Percent Cashback on Unlimited Recharge Packs - Sakshi

టెలికాంసంస్థ వొడాఫోన్ తన ప్రధాన ప్రత్యర్థులు ఎయిర్‌టెల్‌,  జియోలకు దీటుగా  ఆఫర్లతో ముందుకొచ్చింది. వోడాఫోన్‌  ప్రీపెయిడ్‌ వినియోగదారులకు 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ప్యాక్‌లను మై వొడాఫోన్ యాప్ ద్వారా రీచార్జి చేసుకున్న వారికి  నిర్దేశిత వోచర్లు వస్తాయి. అంటే రీచార్జ్‌ చేసుకున్న ప్లాన్‌ఆధారంగా ఈ వోచర్లు లభిస్తాయి. ఒక్కో  వోచర్ విలువ రూ.50 ఉంటుంది.  వీటిని తదుపరి చేసుకునే రీచార్జిలకు ఉపయోగించుకుని ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు.

రూ.399, రూ.458, రూ.509 ప్యాక్‌లను రీచార్జి చేసుకున్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.  రూ.399 రీచార్జికు 8 వోచర్లు,  రూ.458కు 9, రూ.509 రీచార్జికి 10 వోచర్లను వోడాఫోన్‌ అందిస్తోంది. వీటిద్వారా  తదుపరి రీచార్జ్‌ సమయంలో 100 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement