వొడాఫోన్‌ చోటా ఛాంపియన్‌ ప్లాన్‌ | Vodafone launches Chhota Champion plan at Rs 38 | Sakshi

వొడాఫోన్‌ స్పెషల్‌ వాయిస్‌, డేటా ప్యాక్‌

Nov 13 2017 7:24 PM | Updated on Nov 13 2017 7:24 PM

Vodafone launches Chhota Champion plan at Rs 38 - Sakshi

దేశీయ అతిపెద్ద టెలికాం ఆపరేటర్లలో ఒకటైన వొడాఫోన్‌, నేడు(సోమవారం) ఓ స్పెషల్‌ వాయిస్‌, డేటా ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. మధ్య ప్రదేశ్‌, చత్తీష్‌ఘర్‌, బిహార్‌, జార్ఖాండ్‌, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంత ప్రీపెయిడ్‌ కస్టమర్లకు వొడాఫోన్‌ చోటా ఛాంపియన్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ ప్లాన్‌ కింద 38 రూపాయలకే 100 నిమిషాల లోకల్‌, ఎస్టీడీ కాలింగ్ సౌకర్యాన్ని, 100ఎంబీ 3జీ, 4జీ డేటాను 28 రోజుల పాటు అందించనున్నట్టు పేర్కొంది. వొడాఫోన్‌ తన కస్టమర్లకు ఎల్లప్పుడూ కొత్త కొత్త ఆవిష్కరణలు అందిస్తూ ఉంటుందని వొడాఫోన్‌ ఇండియా కన్జ్యూమర్‌ బిజినెస్‌ అసోసియేట్‌ డైరెక్టర్‌ అవ్‌నీష్‌ కోస్లా తెలిపారు. 

ఈ విధంగా అందిస్తున్న ఆవిష్కరణలో భాగమే వొడాఫోన్‌ చోటా ఛాంపియన్‌ ప్యాక్‌ అని, తక్కువ ధరలో నెలంతా ప్రయోజనాలను అందించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. అదనంగా కస్టమర్లకు 100ఎంబీ డేటాను అందిస్తున్నామని, ఇక ఎంతో విశ్వాసంతో కస్టమర్లు తమకు కనెక్ట్‌ అయి ఉంటారన్నారు. ఇటీవలే వొడాఫోన్‌ తన కొత్త ఫస్ట్‌ రీఛార్జ్‌ కూపన్‌(ఎఫ్‌ఆర్‌సీ)ని రూ.496కు లాంచ్‌చేసింది. ఢిల్లీ, ఎన్‌సీఆర్‌ పరిధిలోని కొత్త వొడాఫోన్‌ ప్రీపెయిడ్‌ యూజర్లందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. వొడాఫోన్‌ తీసుకొచ్చిన రూ.496 ప్లాన్‌, రిలయన్స్‌ జియో రూ.459 ప్లాన్‌కి గట్టి పోటీగా ఉంది. దీంతో పాటు వొడాఫోన్‌ ఎఫ్‌ఆర్‌సీ 177 ప్లాన్‌ను లాంచ్‌చేసింది. దీని కింద 28 రోజలు పాటు 28జీబీ డేటాతో పాటు అపరిమిత కాలింగ్‌ సౌకర్యాన్ని అందిస్తోంది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement