జియోకి షాక్‌ : వోడాఫోన్‌​ న్యూ రూ. 99 ప్లాన్‌ | Vodafone Rs. 99 Recharge Offers Unlimited Calls to Compete with Jio, Airtel | Sakshi
Sakshi News home page

జియోకి షాక్‌ : వోడాఫోన్‌​ న్యూ రూ.99 ప్లాన్‌

Published Tue, Aug 14 2018 11:16 AM | Last Updated on Fri, Aug 17 2018 6:18 PM

Vodafone Rs. 99 Recharge Offers Unlimited Calls to Compete with Jio, Airtel - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన ప్రత్యర్థులనుంచి ఎదురవుతున్నసవాళ్లను ఎదుర్కొనేందుకు మరో టెలికాం సంస్థ వొడాఫోన్ సరికొత్త ప్లాన్‌ను లాంచ్‌ చేసింది.  రిలయన్స్‌ జియో 98, ఎయిర్‌టెల్‌ 99రూపాయల రీచార్జ్‌ ప్లాన​ తరహాలో కొత్త ప్లాన్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం రూ.99కే ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్ లభిస్తాయి. అయితే ఎయిర్‌టెల్‌, జియో తరహాలో డేటా, ఎస్‌ఎంఎస్ బెనిఫిట్స్‌ను ఈ ప్లాన్‌లో అందించడం లేదు. ఇక ఈ ప్లాన్ వాలిడిటీని 28 రోజులు.  కస్టమర్లు రోజుకు 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాల కాల్స్  ఈ ప్లాన్‌ స్పెషాలిటీగా చెప్పాలి.  వొడాఫోన్ వెబ్‌సైట్‌, యాప్‌లో  ఈ ప్లాన్‌ను రీ ఛార్జి చేసుకునే ఆఫర్‌ కల్పించింది.

మరోవైపు  99 రూపాయలకు ఎయిర్‌టెల్‌ 1 జీబీ డేటా,  రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే ఈ ప్లాన్‌ వాలిడిటీ 10 రోజులు మాత్రమే. 
ఇక జియో  రూ. 98 ప్లాన్‌లో 1 జీబీ డేటా,  రోజుకు 300ఎస్‌ఎంఎస్‌లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే ఈ ప్లాన్‌ వాలిడిటీ 28 రోజులు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement