బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇండిపెండెన్స్‌ డే ప్లాన్స్‌ | BSNL to offer special benefits plans even on roaming from Independence Day | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇండిపెండెన్స్‌ డే ప్లాన్స్‌

Published Thu, Aug 10 2017 7:59 PM | Last Updated on Sun, Sep 17 2017 5:23 PM

బీఎస్‌ఎన్‌ఎల్‌  ఇండిపెండెన్స్‌ డే ప్లాన్స్‌

బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇండిపెండెన్స్‌ డే ప్లాన్స్‌

 
న్యూఢిల్లీ:  ప్రభుత్వరంగ  టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదారులకు ఇండిపెండెన్స్‌ డే ఆఫర్లను అందిస్తోంది.  నేషనల్‌ రోమింగ్‌ సేవల్లో  ప్రత్యేక రాయితీలను ప్రకటించింది.  ఆగష్టు 15 నుంచి ప్రత్యేక రీఛార్జిల ద్వారా లభించే రాయితీ రేట్లలో  ఈ సేవలను  అందించనుంది.
 
భారత 71వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కస్టమర్లకు అదనపు ప్రయోజనాలను అందించేందుకు నిర్ణయించామని బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది.  దేశవ్యాప్తంగా  ఆగష్టు 15, 2017 నుంచి జాతీయ రోమింగ్‌పై వాయిస్‌ , ఎస్‌ఎంఎస్‌ లేదా స్పెషల్ టారిఫ్ వోచర్స్‌ (ఎస్.టి.వి) ,  కాంబో వోచర్ల ద్వారా అదనపు  ప్రయోజనాలను వినియోగదారులకు అందించనున్నట్టు పేర్కొంది.  ప్రధానంగా సాయుధ దళ సిబ్బంది, నిపుణులు, వ్యాపారస్తులు ,విద్యార్ధులు ఈ పథకం ద్వారా ఎక్కువ ప్రయోజనం పొందుతారని బీఎస్ఎన్ఎల్ బోర్డు కన్స్యూమర్ మొబిలిటీ డైరెక్టర్  ఆర్.కె. మిట్టల్ చెప్పారు.  ఇతర  దేశాలు లేదా వేరొక టెలికాం సర్కిల్‌కు ప్రయాణిస్తున్నప్పుడు వినియోగదారుడు ఈ లాభాలను పొందలేరని  బీఎస్‌ఎన్‌ఎల్‌ స్పష్టం చేసింది. 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement