recharge cards
-
అదిరిపోయేలా జియో న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్స్..బెనిఫిట్స్ ఎక్కువే!
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో న్యూఇయర్ సందర్భంగా కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా న్యూ హ్యాపీ న్యూ ఇయర్-2023 పేరుతో రూ.2023 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. జియో ప్రతి ఏడాది ప్రకటించినట్లుగానే ఈ ఏడాది సైతం కొత్త ప్లాన్లను యూజర్లకు పరిచయం చేసింది. 252 రోజుల వ్యాలిడిటీతో రూ.2023 రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు 9 నెలల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు ఉచితంగా 100 ఎస్ఎంఎస్లు, ప్రతి రోజూ 2.5 జీబీ డేటాతో 252 రోజుల వ్యాలిడిటీతో 630 జీబీ డేటాను వినియోగించుకునే అవకాశం కలగనుంది. దీంతో పాటు ప్రైమ్ మెంబర్ షిప్‌ను అందిస్తుంది. రూ.2999 ప్లాన్ రీఛార్జ్ చేసుకునే యూజర్లు 75జీబీ ఎక్స్ట్రా హై స్పీడ్ డేటా, 23 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందవచ్చు. 365రోజుల వ్యాలిడిటీతో ఉన్న ఈ ఆఫర్ మొత్తం మీద 912.5జీబీ డేటా చొప్పున రోజుకు 2.5జీబీ హై స్పీడ్ డేటా సొంతం చేసుకోవచ్చు. వార్షిక ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం జియో రూ.2999, రూ.2874, రూ.2545 ఇలా మూడు వార్షిక ప్లాన్లను అందిస్తుంది. రూ.2999 ప్లాన్‌లో పైన పేర్కొన్న ఆఫర్లు ఉండగా..365రోజుల వ్యాలిడిటీ రూ.2874 రీఛార్జ్ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో అన్లిమిటెడ్ కాలింగ్ బెన్ఫిట్స్, వ్యాలిడిటీ సమయం మొత్తానికి 730 జీబీ డేటా అందిస్తుండగా రోజుకు 2 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రూ.2545 ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్ బెన్ఫిట్స్ తోపాటు 336రోజుల వ్యాలిడిటీతో 504జీబీ డేటా..రోజుకు 1.5జీబీ వినియోగించుకోవచ్చు. రోజుకు 100ఎస్ఎంఎస్లు పుంపుకోవచ్చని జియో ప్రతినిధులు తెలిపారు. చదవండి👉 ఆకాష్ అంబానీ మాస్టర్ ప్లాన్ అదిరింది, జియో యూజర్లకు బంపరాఫర్ -
టిక్కెట్ల నుంచి రీఛార్జి దాకా..
- అన్నీ రకాల సేవలకు ఒకే వే దిక అవర్‌ట్రిప్.ఇన్ - రూ.3 కోట్ల నిధుల సమీకరణకు రెడీ - రెండు నెలల్లో విజయవాడ, విశాఖలకూ విస్తరణ - సాక్షి స్టార్టప్ డైరీతో ఫౌండర్ బి.మోహన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇంటర్నెట్ పుణ్యమా అని కాలంతో పరుగెత్తే రోజుల నుంచి కాలం కంటే వేగంగా పరుగెత్తే రోజులొచ్చేశాయి. ఆన్లైన్లో అర క్షణం సమయం వృథా అయినా ఒప్పుకోవట్లేదు నేటి యువత. అందుకే వంటింటి సామగ్రి నుంచి విమాన టికెట్లు వరకూ ప్రతీదీ క్లిక్ దూరంలోనే కానిచ్చేస్తున్నారు. ప్రతి దానికీ ప్రత్యేకంగా వెబ్సైట్లు , మొబైల్ యాప్‌లూ పుట్టుకొచ్చేశాయి కూడా. ఒక్కో దానికీ ఒకో సైట్‌కెళ్లి కొనుగోలు చేయడం కూడా సమయాన్ని వృథా చేయటమే కదా!! అనుకున్నాడు బి.మోహన్. అన్ని సేవలనూ ఒకే వేదికపై అందించ లేమా అని ప్రశ్నించుకున్నాడు. అంతే.. చేస్తున్న ఉద్యోగానిక్కూడా గుడ్‌బై చెప్పేసి... రూ.4 లక్షల పెట్టుబడులతో 2014 ఆగ స్టులో అవర్‌ట్రిప్.ఇన్ను ప్రారంభించాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే... మాది ప్రకాశం జిల్లా. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశా. ఐసీఐసీఐ లాంబార్డ్‌లో మేనేజర్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఆన్లైన్ వేదికగా వ్యాపారం చేయాలనుకున్నా. కాకపోతే అందరిలా కాకుండా సింగిల్ పాస్వర్డ్లోనే అన్ని సేవలనూ వినియోగించుకునేలా ఉండాలనుకున్నా. ఆ ప్రయత్నంలోనే ‘‘అవర్‌ట్రిప్.ఇన్’’ను ఆరంభించా. విమానం, బస్సు టికెట్లతో పాటు హోటల్ గదుల బుకింగ్, మొబైల్, డీటీహెచ్ రీచార్జ్, డేటా కార్డ్స్, పోస్ట్‌పెయిడ్ బిల్ పేమెంట్స్, మనీ ట్రాన్స్ఫర్ సేవలన్నిటినీ ఒకే వేదికగా అందించడమే అవర్‌ట్రిప్.ఇన్ ప్రత్యేకత. విశాఖ, విజయవాడలకూ.. అవర్‌ట్రిప్ ప్రత్యేకత ఏంటంటే.. ప్రతీ సేవల వినియోగానికి గాను ఆయా సంస్థలకు ప్రత్యేకంగా సొంతంగా ఒక్కో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిస్తాం. దీన్ని అటు సంస్థలు, ఇటు అవర్‌ట్రిప్ రెండూ వినియోగించుకునే వీలుంటుంది. దీంతో సంబంధిత వ్యాపార సంస్థలకు పని మరింత సులువవుతుంది. నిర్వహణ బాధ్యత కూడా అవర్ట్రిప్దే. ప్రస్తుతం అవర్‌ట్రిప్.ఇన్ సేవలు గోవా, హైదరాబాద్‌లో ఉన్నాయి. మరో రెండు నెలల్లో విజయవాడ, విశాఖపట్నాలకూ విస్తరించనున్నాం. ప్రస్తుతం మా వెబ్సైట్లో సుమారు 2,500 మంది బస్సు ఆపరేటర్లు, 36 వేలకు పైగా హోటళ్లు రిజిస్టరై ఉన్నాయి. నెలకు రూ.3 కోట్లు.. రోజుకు 10-12 వేల మంది కస్టమర్లు మా సేవలను వినియోగించుకుంటున్నారు. నెలకు రూ.3 కోట్ల వ్యాపారాన్ని చేరుకుంటున్నాం. మరో రెండు నెలల్లో సినిమా టికెట్లు, రైల్వే టికెట్లు, ఎలక్ట్రిసిటీ బిల్లుల చెల్లింపులు, హాలిడే ప్యాకేజీలు, కార్ రెంటల్స్ సర్వీసులను అందిస్తాం. క్లియర్‌ట్రిప్, మేక్‌మై ట్రిప్ వంటి పోటీ సంస్థలతో పోల్చుకుంటే అవర్ట్రిప్లో ధరలు రూ.30-40 వరకు తక్కువగా ఉంటాయి. లాభాలను తగ్గించుకోవటమే ఇందుకు కారణం. మనీ ట్రాన్స్‌ఫర్‌కు రూ.100కు గాను 45 పైసలు చార్జీ చేస్తాం. దేశీయంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా... ఏ బ్యాంకుకైనా నగదును బదిలీ చేయవచ్చు. మా కంపెనీలో సాయి టూర్స్ అండ్ ట్రావెల్స్ రూ.2-3 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడిస్తాం అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి... -
మహా మాయగాడు
కదిరి : ‘నేను అశోక్.. 2 ఏళ్ల క్రితం బొరుగులు అమ్ముకుని జీవనం సాగించేవాణ్ణి. ఇప్పుడు రూ కోట్లు సంపాదించాను. అదికూడా గదిలో కూర్చునే. అందరిలాగా ఎండలో తిరగలేదు.. వానలో తడవలేదు.. చమటోడ్చి కష్టపడలేదు.. కేవలం సిమ్ కార్డులతోనే రూ కోట్లు సంపాదించాను’ అని చెప్పిన 2 రోజులకే కదిరి పోలీసుల వలలో చిక్కాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తలుపుల మండలం పెన్నబడివాండ్లపల్లికి చెందిన అశోక్ 2 ఏళ్ల క్రితం ఆ మండల కేంద్రంలో బొరుగులు అమ్ముకొని జీవనం సాగించేవాడు. ఆ తర్వాత చిన్న బంకు పెట్టుకుని వివిధ కంపెనీలకు సంబంధించిన సిమ్ కార్డులు, రీచార్జి కార్డులు అమ్మడం మొదలెట్టాడు. తర్వాత ఆ మండలానికి ఎయిర్టెల్, వొడాఫోన్ ఏజెన్సీ తీసుకున్నాడు. సిమ్‌కార్డులు అధికంగా అమ్మిన వారిని ప్రోత్సహించేందుకు ఆయా కంపెనీలు విదేశీ పర్యటనకు పంపడం, కార్లు లాంటి బహుమతులు ఇవ్వడం అశోక్ దృష్టిని ఆకర్షించింది. ఎలాగైనా తాను విదేశీ పర్యటనతో పాటు ఓ కారును బహుమతిగా కొట్టేయాలని ఫిక్స్ అయిపోయాడు. ఇందుకు సక్రమబాటలో వెళ్తే సాధ్యం కాదని.. అక్రమ బాట ఎంచుకున్నాడు. విదేశీ పర్యటనకు వెళ్లిరావడంతో పాటు కారును కూడా గిఫ్ట్‌గా అందుకున్నాడు. తలుపుల లాంటి చిన్న మండల ఏజెంట్ ఈ స్థాయికి ఎదగడం పలువురు సిమ్ కార్డుల ఏజెంట్లు, డీలర్లను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఆయా కంపెనీలు సైతం అతన్ని ప్రశంశలతో ముంచెత్తాయి. అశోక్ ఎదుగుదల ఇలా: ఎయిర్టెల్, వొడాఫోన్ కంపెనీలు కష్టమర్లను ఆకర్షించేందుకు పలు ఆఫర్లు ఇవ్వడం మొదలెట్టాయి. ఇందులో బాగంగా ట్రాయ్ ఆదేశాలతో ఆయా కంపెనీలు మొబైల్ నెంబర్ పోర్టబిలిటీని తీసుకొచ్చాయి. అదే అశోక్ పాలిట వరంగా మారింది. 6 నెలల క్రితం తలుపుల నుండి కదిరికి తన మకాంను మార్చేసి మున్సిపల్ పరిధిలోని సైదాపురంలో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. తనకు తోడుగా మరికొందరు యువకులను సాయంగా తీసుకుని వారికి ఆకర్షణీయమైన వేతనాన్ని ఇస్తూ తన చీకటి వ్యాపారాన్ని మొదలెట్టాడు. ఉదాహరణకు ఒక కష్టమర్ మొదట ఎయిర్టెల్ సిమ్ తీసుకుంటే ఆ కంపెనీ ఏజెంట్ అశోక్ రూ 50 కంపెనీ అందజేస్తుంది. ఇదే కష్టమర్ 3 నెలల తర్వాత ఎంఎన్‌పీ (మొబైల్ నెంబర్ పోర్టబిలిటీ)ద్వారా వొడాఫోన్ నెట్‌వర్క్‌లోకి మారితే అశోక్‌కు రూ 150 కంపెనీ నుంచి వస్తుంది. ఇదే కష్టమర్ మరో 3 నెలల తర్వాత ఇంకో నెట్‌వర్క్‌లోకి మారితే అశోక్‌కు మరో రూ 300 వస్తుంది. ఇలా 100 మంది లోపు అయితే ఓ రేటు.. 100 నుండి 200 మధ్య మరో రేటు 1000 దాటితే ఇంకో రేటు ఆయా కంపెనీల నుండి అశోక్ ఖాతాలో పడుతోంది. ఇంతకీ అశోక్ అంతమంది కష్టమర్లను పోర్టబిలిటీ ద్వారా మార్చాడా అంటే మీరు పప్పులో సిమ్ వేసినట్లే. నకిలీ ధ్రువీకరణ పత్రాలను తీసుకొని ఈ వ్యవహారమంతా ఆ అద్దె గదిలో కూర్చునే రాత్రింబవళ్లు నడిపాడు. దీనికోసం భారీ సంఖ్యలో ఫోన్లు, కంప్యూటర్, జిరాక్స్ మిషన్ కొనుగోలు చేశాడు. తాను ఎలాగో ఎయిర్టెల్, వొడాఫోన్ ఏజెంటు కాబట్టి తానే కష్టమర్ పాత్ర కూడా పోషించాడు. 100 సెల్‌పోన్లకు ఒక కంపెనీ సిమ్‌లు వే యడం.. 3 నెలల తర్వాత ఆ కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినట్లు చేయడం.. మరో 3 నెలల తర్వాత ఇంకో కంపెనీకి మారడం.. ఎవరికీ అనుమానం రాకుండా పాత సిమ్ కార్డులను నిప్పు పెట్టి కాల్చివేస్తూ ఇలా తన చీకటి సిమ్ల వ్యాపారంతో ఇప్పటికే రూ కోట్లు సంపాదించాడు. ఇదే వ్యాపారాన్ని జిల్లాలో పలు పట్టణాలకు వ్యాపింపజేశాడు. ఆయా కంపెనీలు కూడా పసిగట్టలేని వ్యవహారాన్ని కదిరి పోలీసులు డేగకన్నుతో పసిగట్టి ‘అశోక్’ ‘సిమ్’హాన్ని బందించారు. దీనిపై తమదైన శైలిలో విచారిస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు మరికొంద రు ఉన్నట్లు సమాచారం రాబట్టి వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు కదిరి, తలుపుల, ముదిగుబ్బ, నల్లమాడ, కొత్తచెరువు, పుట్టపర్తి, హిందూపురం ఇంకా పలు పట్టణాల్లో ఉన్న అశోక్ ముఠా సభ్యులు సుమారు 20 మందిని అదుపులోకి తీసుకుని వేల సంఖ్యలో వివిధ కంపెనీలకు సంబంధించిన సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై వివరాలు వెల్లడించడానికి కదిరి పోలీసులు నిరాకరించారు. నేడో రేపో నిందితులను మీడియా ముందు ప్రవేశపెడతారని తెలిసింది.