ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో న్యూఇయర్ సందర్భంగా కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా న్యూ హ్యాపీ న్యూ ఇయర్-2023 పేరుతో రూ.2023 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది.
జియో ప్రతి ఏడాది ప్రకటించినట్లుగానే ఈ ఏడాది సైతం కొత్త ప్లాన్‌లను యూజర్లకు పరిచయం చేసింది. 252 రోజుల వ్యాలిడిటీతో రూ.2023 రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు 9 నెలల పాటు అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు ఉచితంగా 100 ఎస్‌ఎంఎస్‌లు, ప్రతి రోజూ 2.5 జీబీ డేటాతో 252 రోజుల వ్యాలిడిటీతో 630 జీబీ డేటాను వినియోగించుకునే అవకాశం కలగనుంది. దీంతో పాటు ప్రైమ్ మెంబర్ షిప్‌ను అందిస్తుంది.
రూ.2999 ప్లాన్ రీఛార్జ్ చేసుకునే యూజర్లు 75జీబీ ఎక్స్‌ట్రా హై స్పీడ్ డేటా, 23 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందవచ్చు. 365రోజుల వ్యాలిడిటీతో ఉన్న ఈ ఆఫర్ మొత్తం మీద 912.5జీబీ డేటా చొప్పున రోజుకు 2.5జీబీ హై స్పీడ్ డేటా సొంతం చేసుకోవచ్చు. వార్షిక ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు, జియో యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు.
ప్రస్తుతం జియో రూ.2999, రూ.2874, రూ.2545 ఇలా మూడు వార్షిక ప్లాన్‌లను అందిస్తుంది. రూ.2999 ప్లాన్‌లో పైన పేర్కొన్న ఆఫర్లు ఉండగా..365రోజుల వ్యాలిడిటీ రూ.2874 రీఛార్జ్ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్ బెన్ఫిట్స్, వ్యాలిడిటీ సమయం మొత్తానికి 730 జీబీ డేటా అందిస్తుండగా రోజుకు 2 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు.
రూ.2545 ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాలింగ్ బెన్ఫిట్స్ తోపాటు 336రోజుల వ్యాలిడిటీతో 504జీబీ డేటా..రోజుకు 1.5జీబీ వినియోగించుకోవచ్చు. రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు పుంపుకోవచ్చని జియో ప్రతినిధులు తెలిపారు.
చదవండి👉 ఆకాష్ అంబానీ మాస్టర్ ప్లాన్ అదిరింది, జియో యూజర్లకు బంపరాఫర్
Comments
Please login to add a commentAdd a comment