Unlimited Calling
-
అదిరిపోయేలా జియో న్యూ ఇయర్ రీఛార్జ్ ప్లాన్స్..బెనిఫిట్స్ ఎక్కువే!
ప్రముఖ టెలికం దిగ్గజం రిలయన్స్ జియో న్యూఇయర్ సందర్భంగా కొత్త కొత్త ఆఫర్లను అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా న్యూ హ్యాపీ న్యూ ఇయర్-2023 పేరుతో రూ.2023 రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. జియో ప్రతి ఏడాది ప్రకటించినట్లుగానే ఈ ఏడాది సైతం కొత్త ప్లాన్లను యూజర్లకు పరిచయం చేసింది. 252 రోజుల వ్యాలిడిటీతో రూ.2023 రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లు 9 నెలల పాటు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు ఉచితంగా 100 ఎస్ఎంఎస్లు, ప్రతి రోజూ 2.5 జీబీ డేటాతో 252 రోజుల వ్యాలిడిటీతో 630 జీబీ డేటాను వినియోగించుకునే అవకాశం కలగనుంది. దీంతో పాటు ప్రైమ్ మెంబర్ షిప్‌ను అందిస్తుంది. రూ.2999 ప్లాన్ రీఛార్జ్ చేసుకునే యూజర్లు 75జీబీ ఎక్స్ట్రా హై స్పీడ్ డేటా, 23 రోజుల అదనపు వ్యాలిడిటీ పొందవచ్చు. 365రోజుల వ్యాలిడిటీతో ఉన్న ఈ ఆఫర్ మొత్తం మీద 912.5జీబీ డేటా చొప్పున రోజుకు 2.5జీబీ హై స్పీడ్ డేటా సొంతం చేసుకోవచ్చు. వార్షిక ప్లాన్‌లో అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు, జియో యాప్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ప్రస్తుతం జియో రూ.2999, రూ.2874, రూ.2545 ఇలా మూడు వార్షిక ప్లాన్లను అందిస్తుంది. రూ.2999 ప్లాన్‌లో పైన పేర్కొన్న ఆఫర్లు ఉండగా..365రోజుల వ్యాలిడిటీ రూ.2874 రీఛార్జ్ ప్లాన్‌ను వినియోగించుకోవచ్చు. ఈ రీఛార్జ్ ప్లాన్‌తో అన్లిమిటెడ్ కాలింగ్ బెన్ఫిట్స్, వ్యాలిడిటీ సమయం మొత్తానికి 730 జీబీ డేటా అందిస్తుండగా రోజుకు 2 జీబీ డేటాను ఉపయోగించుకోవచ్చు. రూ.2545 ప్లాన్‌లో అన్లిమిటెడ్ కాలింగ్ బెన్ఫిట్స్ తోపాటు 336రోజుల వ్యాలిడిటీతో 504జీబీ డేటా..రోజుకు 1.5జీబీ వినియోగించుకోవచ్చు. రోజుకు 100ఎస్ఎంఎస్లు పుంపుకోవచ్చని జియో ప్రతినిధులు తెలిపారు. చదవండి👉 ఆకాష్ అంబానీ మాస్టర్ ప్లాన్ అదిరింది, జియో యూజర్లకు బంపరాఫర్ -
బీఎస్ఎన్ఎల్ కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను పరిచయం చేసింది. ఇటీవల కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తీసుకొచ్చిన బీఎస్ఎన్ఎల్ తాజాగా డేటా రోల్ఓవర్ సదుపాయంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లందించే కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ప్రకటించింది. డిసెంబర్ 1, 2020 నుంచి దేశవ్యాప్తంగా వీటిని లాంచ్ చేయనున్నామని తెలిపింది. రూ.199 రూ .798, 999 రూపాయల ధరతో మూడు కొత్త ప్లాన్లను బీఎస్ఎన్ఎల్ తీసుకురాబోతోంది. ఈ ప్లాన్లలో అపరిమిత కాలింగ్, డేటా, డేటా రోల్ ఓవర్, ఫ్యామిలీ యాడ్-ఆన్ లాంటి ప్రయోజనాలు అందించనుంది ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్లతో పాటు, బీఎస్ఎన్ఎల్ రెండు యాడ్-ఆన్ ప్లాన్లను రూ .150 రూ.250 లకు తీసుకొస్తోంది. ఇవి వరుసగా 40 జీబీ డేటా 70 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నాయి. రూ 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: 300 నిమిషాల ఉచిత ఆఫ్-నెట్ కాల్లతో అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 75 జీబీ వరకు రోల్ఓవర్ ప్రయోజనాలతో 25 జీబీ డేటాను కూడా ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్ కూడా ఇస్తుంది. యాడ్ ఆన్ ఫ్యామిలీ సదుపాయం లేదు. రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ సదుపాయం.150 జీబీ వరకు రోల్ఓవర్ ప్రయోజనాలతో 50 జీబీ డేటాను కూడా ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్ సదుపాయం.అలాగే ఇద్దరుకుటుంబ సభ్యులకు ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లను కూడా ఇస్తుంది. ఈ యాడ్-ఆన్‌లో అపరిమిత వాయిస్ సౌకర్యం, 50 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఉచితం. రూ .999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్: భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రోల్ఓవర్ ప్రయోజనాలతో 75 జీబీ డేటాను 225 జీబీ వరకు ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్లు, 3 ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లను కూడా ఇస్తుంది. ఇందులో రోజుకు అపరిమిత వాయిస్ సౌకర్యం, 75 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు లభ్యం. -
వోడాఫోన్ ఐడియా కొత్త ప్లాన్లు, అన్లిమిటెడ్ కాల్స్
సాక్షి, ముంబై: వొడాఫోన్ ఐడియా కొత్త ప్రీపెయిడ్‌ప్లాన్లను లాంచ్ చేసింది. రూ. 218, రూ. 248 ల ప్లాన్లను భారతదేశంలో ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌లు 28 రోజుల చెల్లుబాటులో ఈ ప్లాన్‌పై అపరిమిత కాల్స్ తోపాటు 8జీబీ దాకా డేటాను అందిస్తుంది. దీంతోపాటు వొడాఫోన్ డబుల్ డేటా ఆఫర్‌తో రూ. 299, రూ. 399, రూ. 599 ప్రీపెయిడ్ ప్లాన్లనుకూడా తీసుకొచ్చింది. కంపెనీ వెబ్సైట్లో లేదా మై వోడాఫోన్ యాప్ ద్వారా రీఛార్జ్‌కు అందుబాటులో ఉన్నాయి. కొత్త వోడాఫోన్ రూ. 218 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఇందులో అపరిమిత కాల్స్ (ఏదైనా నెట్‌వర్క్‌కు స్థానిక, జాతీయ), 6జీబీ డేటా, 100 స్థానిక, జాతీయ ఎస్ఎంస్ లు ఉచితం. దీనితోపాటు వొడాఫోన్ ప్లే (రూ. 499 ధర) జీ 5 (రూ. 999) కాంప్లిమెంటరీ చందా లభిస్తుంది. రూ. 248 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటులో వుంటుంది. అపరిమిత కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కు అయినా లోకల్ + నేషనల్), మొత్తం 8 జీబీ డేటా, 100 లోకల్, నేషనల్ ఎస్ఎంఎస్ సందేశాలు ఉచితం. ఈ ప్లాన్ కాంప్లిమెంటరీ జీ 5 , వొడాఫోన్ ప్లే చందాలను కూడా అందిస్తుంది. అయితే ఈ రీచార్జ్ ప్లాన్లు, ప్రస్తుతానికి ఢిల్లీ, హర్యానాలో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి. దీనిపై మిగతా ప్రదేశాల్లో అందుబాటులోకి వచ్చే అంశంపై వోడాఫోన్ ఐడియా అధికారికంగా స్పందించాల్సి వుంది. -
బీఎస్ఎన్ఎల్ కొత్త వార్షికప్లాన్
సాక్షి, ముంబై: ప్రభుత్వ రంగ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్‌ను ప్రారంభించింది. ప్రధానంగా రిలయన్స్ జియోకు కౌంటర్‌గా కొత్త వార్షిక ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1097ల విలువైన వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్‌లో మొత్తం 25జీబీ డేటాను, అన్లిమిటెడ్ కాల్స్‌ను ఆఫర్ చేస్తోంది. వాలిడిటీ 365 రోజులు. ప్రస్తుతానికి కోలకతా సర్కిల్లో ఈ ప్లాన్ అందుబాటులో ఉంది. జనవరి 6, 2019వరకు ఈ వార్షికప్లాన్ లభ్యం కానుందని బీఎస్ఎన్ఎల్ తెలిపింది. జియో రూ.1699 ప్లాన్‌లో రోజుకు 1.5జీబీ డేటా చొప్పున సంవత్సరమంతా డేటా ఉచితం. అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్,రోజుకు 100 ఎస్ఎంఎస్లు ఆఫర్ చేస్తోంది. -
ఓన్లీ కాలింగ్ : ఎయిర్టెల్ కొత్త ప్లాన్
న్యూఢిల్లీ : రిలయన్స్ జియో, వొడాఫోన్ల నుంచి వస్తున్న గట్టి పోటీతో టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఎప్పడికప్పుడు సరికొత్త ప్లాన్లను ఆవిష్కరిస్తూ ఉంది. ఇన్ని రోజులు డేటా టారిఫ్ ప్లాన్లతో పోటీ పడ్డ కంపెనీలు, తాజాగా కాలింగ్ ప్రయోజనాలతో కూడా పోటీపడుతున్నాయి. ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. అదే 299 రూపాయల ప్లాన్. ఈ ప్లాన్ కింద 45 రోజుల పాటు అపరిమితంగా వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను అందించనున్నట్టు ఎయిర్టెల్ పేర్కొంది. టెలికాం టాక్ రిపోర్టు ప్రకారం.. ఎయిర్టెల్ తన సబ్స్క్రైబర్లకు రూ.299 ప్లాన్ కింద అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలను, రోజుకు 100 ఎస్ఎంఎస్లను అందజేయనున్నట్టు తెలిసింది. ఇప్పటి వరకు కాలింగ్‌లో రోజువారీ పరిమితులతో ఇబ్బంది పడ్డ వారికి, ఇది ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితులను విధించడం లేదు. అయితే ఈ ప్లాన్‌లో మేజర్ విషయం కస్టమర్లకు ఎలాంటి డేటాను అందించకపోవడం. ఎలాంటి డేటా ప్రయోజనాలు లేకుండా.. కేవలం అపరిమిత కాలింగ్ ప్లాన్‌గానే దీన్ని తీసుకొచ్చింది. ఈ టెలికాం ఆపరేటర్ ఇప్పటికే రూ.249, రూ.349 ప్లాన్లను కూడా ఆఫర్ చేస్తోంది. ఈ రెండు ప్లాన్లపై అపరిమిత వాయిస్ కాలింగ్, డేటా ప్రయోజనాలను కేవలం 28 రోజుల పాటు అందిస్తోంది. ఇటీవల రూ.1,199 పోస్టు పెయిడ్ ప్లాన్‌ను కూడా ఎయిర్టెల్ సమీక్షించింది. ఈ అప్‌గ్రేడేషన్‌తో అంతకముందు అందించే 90 జీబీ డేటా పరిమితిని, 120 జీబీకి ఎయిర్టెల్ పెంచింది. -
వొడాఫోన్ రంజాన్ ఆఫర్, ఓన్లీ వారికే..
న్యూఢిల్లీ : పండుగొచ్చిదంటే చాలు.. టెలికాం కంపెనీలు కూడా కొత్త కొత్త ఆఫర్లతో వినియోగదారులను హోర్రెత్తిస్తుంటాయి. తాజాగా రంజాన్ పవిత్ర మాసాన్ని పురష్కరించుకుని టెలికాం దిగ్గజం వొడాఫోన్ తన కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. 509 రూపాయలతో ‘రంజాన్ సే ఈద్ ఉల్ జుహా తక్’ అనే రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కింద రోజుకు 1.4జీబీ డేటాను, అపరిమిత కాలింగ్‌ను 90 రోజుల పాటు ఆఫర్ చేస్తున్నట్టు తెలిపింది. అయితే ఈ ఆఫర్ కేవలం కర్ణాటకకు మాత్రమే అందుబాటులో ఉంది. రంజాన్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి అంటే 2018 మే 16 నుంచి ఆగస్టులో ఈద్ ఉల్ జుహా వరకు కర్ణాటకలోని వొడాఫోన్ కస్టమర్లు అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.4జీబీ డేటాను పొందవచ్చని వొడాఫోన్ ఓ ప్రకటనలో పేర్కొంది. అదేవిధంగా కస్టమర్లు వొడాఫోన్ ప్లే యాప్ డౌన్లోడ్ చేసుకుని, మక్కా అండ్ మదీనా లైవ్‌లను వీక్షించవచ్చని తెలిపింది. 509 రూపాయల ప్లాన్‌తో పాటు, వొడాఫోన్ 569 రూపాయలతో, 511 రూపాయలతో మరో రెండు ప్లాన్లను కూడా లాంచ్ చేసింది. 569 రూపాయల ప్లాన్ కింద రోజుకు 3జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ను 84 రోజుల పాటు పొందవచ్చని వొడాఫోన్ పేర్కొంది. అదేవిధంగా 511 రూపాయల ప్లాన్ కింద రోజుకు 2జీబీ డేటా, అపరిమిత కాలింగ్‌ను 84 రోజుల పాటు అందించనున్నామని చెప్పింది. -
బీఎస్ఎన్ఎల్ మరో కొత్త ఆఫర్
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ మొబైల్ సర్వీసులపై కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ ''బీఎస్ఎన్ఎల్ సిక్సర్-666'' కింద అపరిమిత కాలింగ్, రోజుకు 2జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. డేటా, వాయిస్ రెండు అవసరమున్న కస్టమర్ల కోసం ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చామని, ఈ ప్లాన్ కింద ఏ నెట్‌వర్క్‌కైనా 60 రోజుల పాటు వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాక డేటాను కూడా వాడుకోవచ్చని చెప్పింది. ఈ 60 రోజుల తర్వాత ఇప్పటికే ఎంతో ఆకర్షణీయంగా వినియోగంలో ఉన్న ''దిల్ కోల్ కే బోల్-349'', ''ట్రిపుల్ ఏస్-333'', బీఎస్ఎన్ఎల్ చౌకా-444'' వంటి డేటా ప్లాన్స్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఇండస్ట్రీలో బీఎస్ఎన్ఎల్ మంచి ధరల్లో ప్లాన్లను మొబైల్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తుందని ఆర్కే మిట్టల్ చెప్పారు. అన్ని సెగ్మంట్ల మొబైల్ కస్టమర్లకు నాణ్యమైన సర్వీసులను, సరసమైన ధరల్లో అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బీఎస్ఎన్ఎల్ చౌకా-444 కింద ఇప్పటికే ఈ టెలికాం రోజుకు 4జీబీ డేటాను 90 రోజుల పాటు అందిస్తోంది. కొత్త ప్రమోషనల్ ఆఫర్ ట్రిపుల్ ఏస్-333 కింద రోజుకు 3జీబీ డేటాను 90 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. రిలయన్స్ జియోకు కౌంటర్‌గా బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. ప్రస్తుతం తీసుకొచ్చిన ఆఫర్ మార్కెట్లో ఉన్న ఇతర టెల్కోలకు, జియోకు కౌంటర్‌గా తీసుకొచ్చినట్టు తెలిసింది. -
రూ.23 రీచార్జ్ తో అన్లిమిటెడ్ ఆఫర్
ముంబై: టెలికాం రంగంలో కొనసాగుతున్న ప్రైస్ వార్ లోకి తాజాగా మరో టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్ దూసుకువచ్చింది. వినియోగదారుల కోసం ప్రత్యేక రీఛార్జ్ పధకాలను బుధవారం లాంచ్ చేసింది. ఏ నెట్వర్క్ కైనా ఉచిత అపరిమిత కాల్స్ అందించే సరికొత్త ఆఫర్ ను అందిస్తోంది. రూ. 23లతో మొదలయ్యే రీచార్జ్ లపై బంపర్ ఆఫర్లు ప్రకటించింది. రూ23, రీఛార్జ్ పై వినియోగదారులు ఒక రోజు ఒక చెల్లుబాటుతో ఏ నెట్ వర్కుకైనా అపరిమిత స్థానిక , ఎస్టీడీ కాలింగ్ అవకాశాన్ని అందిస్తున్నట్టు ఎయిర్‌సెల్ ఒక ప్రకటనలో తెలిపారు. రూ . 348 రీఛార్జ్ (స్థానిక మరియు ఎస్టీడీ) అంతటా ఉచిత కాల్స్ అపరిమిత కాలింగ్ సౌకర్యంతో పాటూ 500 ఎంబీ 3జీ డేటా , 4జీ వినియోగదారులకు 1.5జీబీ 3జీ డేటా ఉచితంగా అందిస్తోంది.వాలిడిటీ 28 రోజులు. వినియోగదారులను సంతోషపెట్టేందుకు ఉచిత కాలింగ్, డాటా సదుపాయాలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామని ఎయిర్‌సెల్ లిమిటెడ్, చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్, అనుపమ్ వాసుదేవ్ తెలిపారు. వినియోగదారులకు ఆహ్లాదం, కాల్ మరియు డేటా ప్రయోజనాలు అందించేందుకు , అందుబాటుధరల్లో ఆన్ లైన్ సదుపాయాన్ని కల్పించేందుకు ఈ రెండు పథకాలను లాంచ్ చేసినట్టు పేర్కొన్నారు.