వోడాఫోన్‌ ఐడియా కొత్త ప్లాన్లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ | Vodafone Idea new plans With Up to 8GB Data  and Unlimited Calls Launched | Sakshi
Sakshi News home page

వోడాఫోన్‌ ఐడియా కొత్త ప్లాన్లు, అన్‌లిమిటెడ్‌ కాల్స్‌

Published Sat, Mar 14 2020 7:45 PM | Last Updated on Sat, Mar 14 2020 7:46 PM

Vodafone Idea new plans With Up to 8GB Data  and Unlimited Calls Launched - Sakshi

సాక్షి, ముంబై:  వొడాఫోన్‌ ఐడియా కొత్త  ప్రీపెయిడ్‌ప్లాన్లను లాంచ్‌ చేసింది. రూ. 218, రూ. 248 ల  ప్లాన్లను భారతదేశంలో ఎంపిక చేసిన సర్కిల్స్‌లో ప్రవేశపెట్టింది. ఈ ప్యాక్‌లు 28 రోజుల చెల్లుబాటులో  ఈ ప్లాన్‌పై అపరిమిత కాల్స్‌ తోపాటు 8జీబీ దాకా డేటాను అందిస్తుంది.  దీంతోపాటు వొడాఫోన్ డబుల్ డేటా ఆఫర్‌తో రూ. 299, రూ. 399,  రూ. 599 ప్రీపెయిడ్‌ ప్లాన్లనుకూడా తీసుకొచ్చింది. కంపెనీ వెబ్‌సైట్‌లో లేదా మై వోడాఫోన్‌ యాప్‌ ద్వారా రీఛార్జ్‌కు అందుబాటులో ఉన్నాయి.

కొత్త వోడాఫోన్ రూ. 218 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఇందులో అపరిమిత కాల్స్ (ఏదైనా నెట్‌వర్క్‌కు స్థానిక, జాతీయ),  6జీబీ డేటా, 100 స్థానిక, జాతీయ ఎస్‌ఎంస్‌ లు ఉచితం.  దీనితోపాటు  వొడాఫోన్ ప్లే (రూ. 499 ధర)  జీ 5 (రూ. 999)  కాంప్లిమెంటరీ చందా లభిస్తుంది.   

రూ. 248 ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటులో వుంటుంది.  అపరిమిత కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కు అయినా లోకల్ + నేషనల్), మొత్తం 8 జీబీ డేటా,  100 లోకల్,  నేషనల్ ఎస్ఎంఎస్ సందేశాలు ఉచితం. ఈ ప్లాన్ కాంప్లిమెంటరీ జీ 5 ,  వొడాఫోన్ ప్లే చందాలను కూడా అందిస్తుంది.
అయితే ఈ రీచార్జ్‌ ప్లాన్లు, ప్రస్తుతానికి  ఢిల్లీ,  హర్యానాలో మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయి.  దీనిపై మిగతా ప్రదేశాల్లో  అందుబాటులోకి వచ్చే అంశంపై  వోడాఫోన్‌ ఐడియా అధికారికంగా స్పందించాల్సి వుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement