బీఎస్‌ఎన్‌ఎల్ మరో కొత్త ఆఫర్
బీఎస్‌ఎన్‌ఎల్ మరో కొత్త ఆఫర్
Published Thu, Jun 29 2017 1:03 PM | Last Updated on Tue, Sep 5 2017 2:46 PM
న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ మొబైల్ సర్వీసులపై కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. ఈ కొత్త ప్లాన్ ''బీఎస్‌ఎన్‌ఎల్ సిక్సర్-666'' కింద అపరిమిత కాలింగ్, రోజుకు 2జీబీ డేటాను ఆఫర్ చేయనున్నట్టు బీఎస్‌ఎన్‌ఎల్ పేర్కొంది. డేటా, వాయిస్ రెండు అవసరమున్న కస్టమర్ల కోసం ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చామని, ఈ ప్లాన్ కింద ఏ నెట్‌వర్క్‌కైనా 60 రోజుల పాటు వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాక డేటాను కూడా వాడుకోవచ్చని చెప్పింది. ఈ 60 రోజుల తర్వాత ఇప్పటికే ఎంతో ఆకర్షణీయంగా వినియోగంలో ఉన్న ''దిల్ కోల్ కే బోల్-349'', ''ట్రిపుల్ ఏస్-333'', బీఎస్‌ఎన్‌ఎల్ చౌకా-444'' వంటి డేటా ప్లాన్స్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని తెలిపింది.
ఇండస్ట్రీలో బీఎస్‌ఎన్‌ఎల్ మంచి ధరల్లో ప్లాన్లను మొబైల్ కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొస్తుందని ఆర్‌కే మిట్టల్ చెప్పారు. అన్ని సెగ్మంట్ల మొబైల్ కస్టమర్లకు నాణ్యమైన సర్వీసులను, సరసమైన ధరల్లో అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్ చౌకా-444 కింద ఇప్పటికే ఈ టెలికాం రోజుకు 4జీబీ డేటాను 90 రోజుల పాటు అందిస్తోంది. కొత్త ప్రమోషనల్ ఆఫర్ ట్రిపుల్ ఏస్-333 కింద రోజుకు 3జీబీ డేటాను 90 రోజుల పాటు వినియోగించుకోవచ్చు. రిలయన్స్ జియోకు కౌంటర్‌గా బీఎస్‌ఎన్‌ఎల్ ఈ కొత్త కొత్త ఆఫర్లను ప్రకటిస్తోంది. ప్రస్తుతం తీసుకొచ్చిన ఆఫర్ మార్కెట్లో ఉన్న ఇతర టెల్కోలకు, జియోకు కౌంటర్‌గా తీసుకొచ్చినట్టు తెలిసింది.
Advertisement
Advertisement