కేసు నమోదు చేసిన పోలీసులు
అడ్డగుట్ట: అడిగినంత చందా ఇవ్వలేదని మొబైల్ షాపు యజమానిపై ిహ జ్రాలు దాడి చేసి, రూ. 30 వేలు విలువ చేసే బంగారు గొలుసు లాక్కొన్నారు. బాధితుడు వారి బారి నుంచి తప్పించుకొని పారిపోగా.. హిజ్రాలు షాపులోని కుర్చీలను విరగ్గొట్టడంతో పాటు వస్తువులను ధ్వంసం చేశారు. తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం... అడ్డగుట్ట డివిజన్‌కు చెందిన శ్రీనివాస్ తుకారాంగేట్ మీనా హాస్పటల్ ఎదురుగా తిరుమల కమ్యునికేషన్స్ అండ్ మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. అయితే, బుధవారం రాత్రి కొందరు హిజ్రాలు దుకాణానికి వచ్చారు.
హోళీ సందర్భంగా తమకు చందా ఇవ్వాలని యజమాని శ్రీనివాస్‌ను అడిగారు. అతను రూ. 50 ఇవ్వగా.. తమకు రూ. 500 కావాలని పట్టబట్టారు. అంత ఇవ్వలేనని శ్రీనివాస్ అనడంతో హిజ్రాలందరూ కలిసి అతని పై దాడి చేసి మెడలోని గొలుసు లాక్కున్నారు. బాధితుడు వారి బారి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం హిజ్రాలు దుకాణంలోని వస్తువులన్నీ ధ్వంసం చేసి, కుర్చీలు విరగ్గొట్టి, స్టిక్కర్లను చింపేశారు. కౌంటర్‌లో ఉన్న డబ్బును కూడా హిజ్రాలు ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. గురువారం ఉదయాన్నే బాధితుడు తుకారాంగేట్ పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అడిగినంత ఇవ్వలేదని హిజ్రాల దాడి
Published Fri, Mar 6 2015 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:21 PM
Advertisement