Mobile shop owner
-
డివైడర్‌ను ఢీకొన్న బుల్లెట్ బైక్
పటాన్చెరు టౌన్: బుల్లెట్ బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన పటాన్చెరు పోలీసుస్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ ప్రవీణ్ కుమార్‌రెడ్డి కథనం ప్రకారం... పటాన్చెరు మండలం ఇస్నాపూర్ గ్రామానికి చెందిన పోచారం నవీన్ కుమార్(21) ఓ మొబైల్ షాప్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతని స్నేహితుడు సంగారెడ్డి శివాజీనగర్‌కు చెందిన పెరుమాండ్ల సాయి రాఘవకుమార్(23) కిరణా షాపు నిర్వహిస్తున్నాడు. ఈక్రమంలో గురువారం రాఘవకుమార్ తన స్నేహితుడు నవీన్‌కుమార్ వద్దకు ఇస్నాపూర్ వచ్చాడు. గురువారం రాత్రి సాయి రాఘవకుమార్‌ను సంగారెడ్డి వద్ద వదలి రావటానికి నవీన్‌కుమార్ తన బుల్లెట్‌పై సంగారెడ్డికి బయలుదేరారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామ శివారులో డివైడర్‌ను ఢీకొనడంతో రోడ్డు అవుతలివైపు సంగారెడ్డి నుంచి పటాన్చెరు వచ్చే దారివైపు ఇద్దరూ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం నవీన్‌కుమార్‌ను బీరంగూడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవీన్‌కుమార్ రాత్రి మృతి చెందాడు. సాయి రాఘవకుమార్‌ను గాంధీకి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అడిగినంత ఇవ్వలేదని హిజ్రాల దాడి
కేసు నమోదు చేసిన పోలీసులు అడ్డగుట్ట: అడిగినంత చందా ఇవ్వలేదని మొబైల్ షాపు యజమానిపై ిహ జ్రాలు దాడి చేసి, రూ. 30 వేలు విలువ చేసే బంగారు గొలుసు లాక్కొన్నారు. బాధితుడు వారి బారి నుంచి తప్పించుకొని పారిపోగా.. హిజ్రాలు షాపులోని కుర్చీలను విరగ్గొట్టడంతో పాటు వస్తువులను ధ్వంసం చేశారు. తుకారాంగేట్ పోలీస్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం... అడ్డగుట్ట డివిజన్‌కు చెందిన శ్రీనివాస్ తుకారాంగేట్ మీనా హాస్పటల్ ఎదురుగా తిరుమల కమ్యునికేషన్స్ అండ్ మొబైల్ దుకాణం నడుపుతున్నాడు. అయితే, బుధవారం రాత్రి కొందరు హిజ్రాలు దుకాణానికి వచ్చారు. హోళీ సందర్భంగా తమకు చందా ఇవ్వాలని యజమాని శ్రీనివాస్‌ను అడిగారు. అతను రూ. 50 ఇవ్వగా.. తమకు రూ. 500 కావాలని పట్టబట్టారు. అంత ఇవ్వలేనని శ్రీనివాస్ అనడంతో హిజ్రాలందరూ కలిసి అతని పై దాడి చేసి మెడలోని గొలుసు లాక్కున్నారు. బాధితుడు వారి బారి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అనంతరం హిజ్రాలు దుకాణంలోని వస్తువులన్నీ ధ్వంసం చేసి, కుర్చీలు విరగ్గొట్టి, స్టిక్కర్లను చింపేశారు. కౌంటర్లో ఉన్న డబ్బును కూడా హిజ్రాలు ఎత్తుకెళ్లారని బాధితుడు తెలిపారు. గురువారం ఉదయాన్నే బాధితుడు తుకారాంగేట్ పోలీస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.