
పదోన్నతులు వెంటనే చేపట్టాలి
► ఎస్సీ, ఎస్టీ ఉఫాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న
జన్నారం(ఖానాపూర్): ఉమ్మడి సర్వీసు రూల్స్‌కు రాష్ట్రపతి ఆమోద ముద్రవేయడంతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమం అయిందని ఎస్సీ, ఎస్టీ ఉఫాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎంఈవో, డిప్యూటీఈవో, డైట్, బీఈడీ, జూనియర్ లెక్చరర్ పోస్టులను, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
పాఠశాలల్లో అమలవుతున్న మూల్యంకన విధానాన్ని తనిఖీకి శాశ్వత ప్రతిపాదినక అకాడమిక్ మానిటరింగ్ బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రాజలింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్య రాజన్న, జిల్లా కార్యదర్శి రమేశ్, మండల అధ్యక్షుడు తుంగూరి గోపాల్, ప్రధాన కార్యదర్శి సురేశ్ తదితరులు పాల్గొన్నారు.