Do You Know Telangana Folk Singer Balladeer Gaddar Last Movie - Sakshi
Sakshi News home page

Gaddar Last Movie: త్వరలో రిలీజ్.. ఇంతలోనే ఇలా!

Published Sun, Aug 6 2023 4:30 PM | Last Updated on Sun, Aug 6 2023 5:01 PM

Gaddar Last Movie Ukku Satyagraham Details - Sakshi

ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూశారు. ఎన్నో అద్భుతమైన పాటలతో అలరిస్తున్న గద్దర్..  కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఈ మధ్య ఓ మూవీలో నటించారు. ఇప్పుడది ఆయనకు చివర సినిమా అయింది. ఇలా అకస్మాత్తుగా గద్దర్ చనిపోవడంతో ఆ సినిమా ఏంటి? దాని డీటైల్స్ చర్చనీయాంశంగా మారింది.

(ఇదీ చదవండి: గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?)

సత్యారెడ్డి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఉక్కు సత్యాగ్రహం'. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నేపథ్యంలో తీస్తున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తుంది.ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇందులో గద్దర్ కీలకపాత్ర పోషించారు. ఈయనతో పాటు గోరేటి వెంకన్న, సుద్దాల అకోశ్ తేజ తదితరులు ఈ చిత్రం కోసం పాటలు రాశారు. 

ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్ని త్వరలో వైజాగ్‌లోని ఆర‍్కే బీచ్ లో నిర్వహిస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఓ ప్రముఖ వ్యక్తి ఈ వేడుకకు హాజరవుతారని అన్నారు. ఇలా అందరూ సినిమా హడావుడిలో ఉన్నారు. ఇప్పుడు సడన్‌గా గద్దర్ మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ‍్యంలో ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఏదేమైనా సరే గద్దర్ లాంటి వ్యక్తి ఇలా మనకు దూరమవడం బాధకరమైన విషయం.

(ఇదీ చదవండి: గద్దర్ ఏ సినిమాల్లో నటించారో తెలుసా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement