ప్రజా గొంతు మూగబోయింది. వేల గొంతులను తన పాటలతో నిద్రలేపిన గొంతు ఇకపై వినిపించదు. ప్రతి క్షణం ప్రజల కోసమే పాటలు పాడిన ఆ స్వరం కనుమరుగైంది. దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల గొంతుకై వినిపించి.. ప్రజా గాయకుడిగా పేరొందిన గద్దర్ ఇక లేరు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు కాగా.. 1949లో జూన్ 5న మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో జన్మించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఓసారి గద్దర్ నటించిన సినిమాల గురించి తెలుసుకుందాం.
(ఇది చదవండి: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత )
1983లోనే రంగుల కల సినిమాలో గద్దర్ ప్రధాన పాత్రలో నటించారు. జగపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జై బోలో తెలంగాణ. ఈ చిత్రంలో గద్దర్ కీలక పాత్రలో కనిపించారు. జైబోలో తెలంగాణ 2011నలో విడుదలైంది.
2016లో ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన దండకారణ్యం చిత్రంలో కనిపించారు. సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ సినిమాలో 2019 రిలీజ్ కాగా.. గద్దర్ కీలకపాత్ర పోషించారు. అంతే కాకుండా గతేడాది వచ్చిన మెగాస్టార్ చిత్రం గాడ్ ఫాదర్‌లోనూ గద్దర్ కీలక పాత్రలో నటించారు. . చిరంజీవి తండ్రికి స్నేహితుడిగా కనిపించారు. గద్దర్ చివరిసారిగా ఉక్కు సత్యాగ్రాహం చిత్రంలో నటించారు. ఆగస్టు 6 2023న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
(ఇది చదవండి: గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?)
Comments
Please login to add a commentAdd a comment