Gaddar songs
-
కాంగ్రెస్ పాలనపై గద్దర్ పాట పడిన హరీష్ రావు..
-
గద్దర్ మృతి చాలా బాధాకరం
-
గద్దర్ ను తలుచుకొని ఎమ్మెల్యే సీతక్క ఎమోషనల్
-
గద్దర్ నాతో సన్నిహితంగా ఉండేవారు
-
'గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్'.. సీనియర్ IPS ఆఫీసర్ ట్వీట్
హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ గారి పార్థివ దేహానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(సంస్థ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు నివాళులు అర్పించారు. గద్దర్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా గద్దర్ గారితో తనకున్న అనుబంధాన్ని సజ్జనర్ గారు జ్ఞాపకం చేసుకున్నారు. నెల రోజుల క్రితం ఆయన నన్ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతతో పాటు బస్తో తనకున్న అనుబంధాన్ని వివరించారని చెప్పారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి ఒక పాటను రాసి, సంస్థకు అంకితం చేస్తానని చెప్పారు. అంతలోనే గద్దర్ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఒక లెజండరీ కవి, యాక్టివిస్ట్‌ను కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యం కలిగించి.. ప్రజా యుద్ద నౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్ గారు నిలిచిపోయారని కొనియాడారు. గద్దర్ గారితో నాకు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. అనేక సార్లు వ్యక్తిగతంగా నన్ను కలిశారు. ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడమని చెప్పేవారు. పాటను గద్దర్ వ్యాపారంగా చూడలేదు. పాట ద్వారా ప్రజా సమస్యలను బయటకు తెచ్చారని సజ్జనర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఉద్యమాన్ని కలిసికట్టుగా నడిపిన నాయకులు ఎందరు ఉన్నా, తెలంగాణ సాధించిన ఘనత పాటల తల్లిదని చెప్పి సంతోషించే వారు. ఈ మధ్య కాలంలో గద్దర్ గారి ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. సమయాభావం వల్ల కలువలేకపోయాను. పాట నిలిచి ఉన్నంత కాలం గద్దర్ బ్రతికే ఉంటారు. ఉద్యమకారులు ఎవ్వరు చనిపోయినా ఆయన అక్కడికి చేరుకొని తన పాటలతో నివాళులు అర్పించేవారు. ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం అనేది బాధాకరం. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాన్నారు. గద్దర్ గారి పార్ధివ దేహానికి టీఎస్ఆర్టీసీ కుటుంబం తరపున నివాళులు అర్పిస్తున్నామని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సజ్జనర్, ఐపీఎస్ ప్రకటించారు. కన్నీటి సిరాను కలంలో నింపి హృదయ పలకం మీద రాస్తున్న చరాక్షర నివాళి! గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న. పాట అంటే చెవులతో కాదు వినేది.. పాటంటే గుండెలతో విని… pic.twitter.com/TwtYTnzoCW — V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 6, 2023 -
వచ్చినవాడు గద్దర్.. ఆ హెడింగ్ చూసి ఆశ్చర్యపోయాం!
వచ్చినవాడు గద్దర్.. ఇది 1982లో ఒక పత్రికలో వచ్చిన శీర్షిక.. అప్పటికే జర్నలిస్టుగా ఉన్నప్పటికీ నాకు అంతవరకు అసలు గద్దర్ అంటే ఎవరో తెలియదు. కానీ ఆ వార్త చూశాక ఆయన గొప్పదనం ఏమిటో చూడాలని తిరుపతిలో జరిగిన సభకు వెళ్లాను. అక్కడ వేలాది మంది జనం ఉన్నారు. గద్దర్ వేదిక ఎక్కి గజ్జె కట్టి పాటలు పాడుతుంటే మైమరచిపోయామంటే అతిశయోక్తి కాదు. నిజానికి అవన్నీ విప్లవ ఉద్యమానికి సంబంధించిన గేయాలు. వాటిలో అత్యధికం ఆయన స్వయంగా రాసి పాడిన పాటలు. పై చొక్కా తీసివేసి ఒక నల్ల దుప్పటి భుజాన వేసుకుని పాట పాడడం, దానికి అనుగుణంగా డాన్స్ చేయడం సరికొత్త బాణిగా కనిపిస్తుంది. బ్యాంక్ ఉద్యోగం చేస్తూ విప్లవోద్యమంలోకి వెళ్లడం, తిరిగి ఆయన బయటకు వచ్చి పాటకు అంకితం అవడం గొప్ప విషయం. ఆయన ఒక స్కూల్ కూడా నడిపారు. నక్సలిజం నుంచి బయటకు వచ్చినా ఆ బాటను ఆయన పూర్తిగా విడిచిపెట్టలేదు. వారి తరపున ఒక సాంస్కృతిక వారధిగా ఆయన పనిచేశారు. రాష్ట్రంలో ఎక్కడ ఎన్కౌంటర్లు జరిగినా అక్కడకు వెళ్లి వారి కుటుంబాలకు అండగా నిలబడేవారు. ఒక మాటలో చెప్పాలంటే జానపద, విప్లవ గేయాల రచనలో, వాటిని ప్రజలలోకి తీసుకువెళ్లిన తీరు గద్దర్‌కు ముందు, గద్దర్‌కు తర్వాత అన్న చందం అని చెప్పడంలో ఎలాంటి సంశయం అక్కర్లేదు. ఆయన పాటలలో ఎల్లప్పుడూ అట్టడుగు, అణగారిన ప్రజల వాయిస్ వినిపిస్తుంటుంది. ‘మా భూమి’ సినిమాలో బండెనక బండి కట్టి ఏ బండ్లో వస్తవు కొడకా.. నైజాం సర్కరోడా అంటూ ఆయన చేసిన అలాపన ఎప్పటికీ ప్రజల చెవుల్లో రింగురింగుమంటూనే ఉంటుంది. అదేకాదు. ఎన్నియలో.. ఎర్రెర్రని జెండా ఎన్నియలో.. యంత్రమెట్ల తిరుగుతుందంటే.. నీ పాదం మీద పుట్టుమచ్చనై.. ఇలా ఒకటేమిటి అనేకం ఉన్నాయి. వాటిలో భావం, భాష అద్బుతంగా ఉంటాయి. చిన్నచిన్న పదాలతో ప్రజలందరికి అర్ధం అయ్యేరీతిలో ఆయన పాడే వైనం అపురూపం అని చెప్పాలి. గద్దర్ వేదిక ఎక్కితే ఒక సింహం మాదిరిగా ఉంటుంది. ఆయన పల్లవి ఎత్తుకుంటే అందరిని కదలించివేస్తుంది. అంతా మమేకం చెందవలసిందే. సాహిత్యం, సంగీతం కలిపి ఆయన సరికొత్త పాటను సృష్టించారు. ఆ రోజుల్లో గద్దర్ పాటల క్యాసెట్లకు విపరీతమైన డిమాండ్ ఉండేది. అందులోని సాహిత్యం విప్లవానికి సంబంధించింది అయినా, అందులోని భావజాలంతో ఏకీభవించినా, ఏకీభవించకపోయినా, ఆ పాటలలోని స్పూర్తి అందరిని ఆకట్టుకునేది. చాలాకాలం విప్లవోద్యమానికి బహిరంగ ప్రజాస్వరం మాదిరి వ్యవహరించారు. చదవండి: గద్దర్‌కు ఎన్నో ఆహ్వానాలు.. అయినా విమానం ఎక్కలేదు, విదేశాలకు పోలేదు తర్వాత కాలంలో ఆయన దానికి పూర్తిగా దూరం అయినా, విప్లవ భావజాలం, పేదలు, బలహీనవర్గాల కష్ట, సుఖాలపై తన అనురక్తిని మాత్రం వీడలేదు. చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో 1997లో ఆయనపై కాల్పులు జరిగాయి. అది పోలీసుల పనే అని, ఆనాటి ప్రభుత్వమే ఆయనపై హత్యకు కుట్ర పన్నిందని పలువురు ఆరోపించేవారు. ఆ కాల్పులలో బులెట్ ఆయన వెన్నులో దిగింది. అయినా అదృష్టవశాత్తు ఆయన బతికి బయటపడ్డారు. ఆయన ఆ బుల్లెట్‌తోనే జీవితం గడిపారు. దానివల్ల ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలకు గురి అయినా తన వాణిని మాత్రం జనంలో వినిపించడానికి వెనక్కి తగ్గలేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒకటి, రెండుసార్లు గద్దర్ కలవడం పెద్ద వార్త అయ్యేది. వైఎస్ చేపట్టిన ఆరోగ్యశ్రీ వంటివాటిని ఆయన మెచ్చుకునేవారు. అలాగే వైఎస్ పీపుల్స్ వార్ తీవ్రవాదులతో శాంతి చర్చలు జరపడం ఒక చరిత్ర. వాటన్నిటిలో ఆయనకు ఒక పాత్ర ఉండేది. ఆ క్రమంలోనే వైఎస్సార్ ఆనాటి మంత్రి కోనేరు రంగారావు ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసి వారి డిమాండ్లపై అధ్యయనం చేయించేవారు. వాటిలో ఆచరణసాధ్యమైనవాటిని ఆయన అమలు చేసేందుకు యత్నించారు. గద్దర్‌కు వేలాది మంది ఏకలవ్య శిష్యులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఆయన మాదిరి పాడాలని, ఆయన మాదిరి ఎగెరెగిరి డాన్స్ చేయాలని, ఉచ్చస్వరంతో పలకాలని చాలామంది కోరుకునేవారు. రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక నిరసన కార్యక్రమాలలో కాని, రాజకీయ పార్టీల సభలలోకాని, పండగలు, పబ్బాలు జరిగినప్పుడు కాని, ఇలా ఏ సందర్భం అయినా గద్దర్ తరహా పాటలు పాడడం ఒక సంస్కృతిగా మారిందంటే ఆశ్చర్యం కాదు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అంకితం అయి పనిచేశారు. పోరు తెలంగాణమా.. అంటూ ఆయన రాసిన పలు గీతాలు ఉర్రూతలూగించాయి. చదవండి: ‘బండెనుక బండి కట్టి... పదహారు బండ్లు కట్టి’ ఈ ఉద్యమంలో గద్దర్ బాణినే అన్ని చోట్ల మారుమోగుతుండేది. తెలంగాణ ఉద్యమకారులు ఈ పాటలు విని ఉర్రూతలు ఊగేవారు. కాగా తెలంగాణ వచ్చిన తర్వాత ఆయనకు రావల్సినంత గుర్తింపు రాలేదనిపిస్తుంది. కారణం ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన పలు కార్యక్రమాలు చేపట్టారు. వివిధ రాజకీయ పార్టీలతో కలిసి పనిచేయడానికి సిద్దపడ్డారు. సొంతంగా పార్టీ పెట్టడానికి ఈ మధ్య డిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా వెళ్లి వచ్చారు. ఆయన రాజకీయాల సంగతి ఎలా ఉన్నా , గద్దర్ పాట ఎప్పటికి చిరస్మరణీయంగానే ఉంటుంది. గద్దర్ కేవలం తెలంగాణ ఆస్తి మాత్రమే కాదు. తెలుగు ప్రజలందరి సొత్తు అని చెప్పాలి. అందుకే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన సంతాప సందేశంలో గద్దర్‌ను ఒక సామాజిక న్యాయ ప్రవక్తగా అభివర్ణించారు. గద్దర్ పాటకు మరణం లేదు. గద్దర్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన పాట రూపంలో ఎప్పటికీ మన మధ్యే జీవించే ఉంటారు. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఆగిన కోట్లాది గానం..! మూగబోయిన విప్లవ గొంతుక..!!
వరంగల్: ఎక్కడ అన్యాయం జరిగినా.. తనకే జరుగుతున్నట్లు అన్వయించుకుని.. అందుకు తగ్గట్టుగా పాటలు అల్లి.. తన దరువుతో ఉర్రూతలూగించిన ప్రజా వాగ్గేయకారుడు గద్దర్. ఆయన ఇక లేరనే వార్త విన్న ఉమ్మడి వరంగల్ కళాకారులు, కవులు, రచయితలు, ప్రజలు, అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. తన ఆటపాటలతో ఉద్యమాలను రగిల్చిన ప్రజా యుద్ధనౌక గద్దర్‌కు.. ఓరుగల్లుతో విడదీయరాని అనుబంధం ఉంది. తన గళంతో మేధావులు, భూస్వాముల బిడ్డలను సైతం సాయుధ పోరాటం వైపు ఆకర్షితులను చేశారు. అనేక మందిని పీపుల్స్ ఆర్మీగా తయారుచేశారు. ఇప్పుడా పాట మూగబోయింది. పీపుల్స్‌వార్(మావోయిస్టు) పార్టీ కీలక ఘట్టాలకు వేదికై న ఓరుగల్లులో.. గద్దర్ ఉద్యమ ప్రస్థానం ఇలా.. కారంచేడు దళితులపై జరిగిన దాడిని నిరసిస్తూ గద్దర్ చేపట్టిన ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ నుంచి ఉద్యమకారులు, ప్రజాసంఘాలు పాల్గొన్నాయి. ► 1979 నుంచి 1983 వరకు చాపకింద నీరులా కొండపల్లి సీతారామయ్య నేతృత్వంలో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ వ్యాప్తి క్రమంలో జనగామ జిల్లాలో మేథావి, విద్యార్థి, ప్రజాకవులతో ప్రజాగాయకుడిగా సంబంధాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే జన నాట్యమండలి రాష్ట్ర సారధిగా గద్దర్ వ్యవహరించడంతో జిల్లా నుంచే అత్యధిక కళాకారుల చేరారు. ► 1989 : పీపుల్స్‌వార్ పార్టీకీ అప్పటి సీఎం చెన్నారెడ్డి లీగల్ పీరియడ్ ఇచ్చారు. దీంతో తొలుత జనగామలోనే గద్దర్ బహిరంగ సభ నిర్వహించి ప్రజాసమస్యల సాధనతోపాటు సమసమాజ స్థాపన లక్ష్యంగా పెద్దఎత్తున యువత చేరేలా తన ఆటాపాటలతో చైతన్యం కలిగించారు. ► 1997 : సెప్టెంబర్‌లో వరంగల్ డిక్లరేషన్ సదస్సుకు హాజరయ్యారు. ► 1999 : కరీంనగర్ కొయ్యూరు ఎన్కౌంటర్లో అశువులు బాసిన జనగామ జి ల్లా కడవెండికి చెందిన మావోయిస్టు ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి అలియాస్ మహేష్ అంత్యక్రియలకు ప్రభుత్వం నిర్భందాలను అధిగమించి వేలాది మంది నివాళురి్పంచేలా తన ఆటపాటలతో చైతన్య పరిచారు. మైదనా ప్రాంతంలో నక్సల్ పార్టీ ప్రభావం తగ్గిన క్రమంలో దొడ్డి కొమురయ్య స్వగ్రామం కడవెండిలో పలు సామాజిక ఉద్యమ పోరా టాల్లో పాల్గొనడం అనివార్యంగా మారింది. ► 2007 : మలివిడద తెలంగాణ సాధన ఉద్యమంలో జనగామ డివిజన్ పరిధి బైరాన్‌పల్లి నుంచి కడవెండి మీదుగా తెలంగాణ అమరుల దీపయాత్ర ప్రారంభించారు. మణుగూరు వద్ద గోదావరి నుంచి ప్రారంభమైన కళాకారుల శాంతియాత్ర అన్ని జిల్లాల్లో 24 రోజులపాటు సాగింది. ► 2008 మే 25, 2009 : హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఆడిటోరియంలో జరిగిన తెలంగాణ సాంస్కృతిక కళాకారుల సమావేశంలో పాల్గొన్నారు. ► 2009 : వరంగల్ ప్రజాసంఘాలతో కలిసి తెలంగాణ ప్రజాఫ్రంట్, ఐక్యకార్యాచరణ కమిటీ ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జిల్లా ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, కళాకారులతో కలిసి తెలంగాణ ఉద్యమంపై ధూంధాం నిర్వహించారు. ► 2010 : ప్రత్యేక తెలంగాణ బిల్లు పార్లమెంట్లో పెట్టాలని ఐదు రోజులు జిల్లాకు చెందిన ఉద్యమకారులు, ప్రజాసంఘాలు, కళాకారులతో కాజీపేట, హనుమకొండ, వరంగల్‌లో పాదయాత్ర చేశారు. చివరిరోజు ఆజంజాహి మైదానంలో జరిగిన సభలో గద్దర్ తన పాట, ప్రసంగంతో ప్రజల్లో ఉద్యమస్ఫూర్తిని నింపారు. ► 2010 అక్టోబర్ 6 : హనుమకొండ టీఎన్జీఓ భవన్లో జరిగిన వరంగల్ జిల్లా జేఏసీ స్టీరింగ్ సమావేశంలో గద్దర్ పాల్గొన్నారు. 2011 : బచ్చన్నపేట మండలం కేశిరెడ్డిపల్లిలో అంబేడ్కర్ విగ్రహాన్ని గద్దర్ ఆవిష్కరించారు. రాష్ట్ర సాధనలో గద్దర్ తనదైన శైలిలో దీపారాధన, గీతారాధనతో కార్యక్రమం చేపట్టారు. ► 2012 : ‘ఓపెన్ కాస్ట్ హఠావో సింగరేణి బచావో’ నినాదంతో చేపట్టిన బొగ్గు గనుల సంరక్షణ ఉద్యమం సందర్భంగా ములుగులో తెలంగాణ ప్రజాఫ్రంట్ ఏర్పాటు చేసిన బహిరంగ సభాస్థలి వరకు ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ► 2022 జూన్ : గద్దర్ వరంగల్‌లో జరిగిన తెలంగాణ అమరవీరుల సంతాపసభలో పాల్గొన్నారు. -
గద్దర్ నటించిన చివరి సినిమా ఇదే
ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూశారు. ఎన్నో అద్భుతమైన పాటలతో అలరిస్తున్న గద్దర్.. కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఈ మధ్య ఓ మూవీలో నటించారు. ఇప్పుడది ఆయనకు చివర సినిమా అయింది. ఇలా అకస్మాత్తుగా గద్దర్ చనిపోవడంతో ఆ సినిమా ఏంటి? దాని డీటైల్స్ చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?) సత్యారెడ్డి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఉక్కు సత్యాగ్రహం'. విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తీస్తున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇందులో గద్దర్ కీలకపాత్ర పోషించారు. ఈయనతో పాటు గోరేటి వెంకన్న, సుద్దాల అకోశ్ తేజ తదితరులు ఈ చిత్రం కోసం పాటలు రాశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్ని త్వరలో వైజాగ్‌లోని ఆర్కే బీచ్ లో నిర్వహిస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఓ ప్రముఖ వ్యక్తి ఈ వేడుకకు హాజరవుతారని అన్నారు. ఇలా అందరూ సినిమా హడావుడిలో ఉన్నారు. ఇప్పుడు సడన్‌గా గద్దర్ మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఏదేమైనా సరే గద్దర్ లాంటి వ్యక్తి ఇలా మనకు దూరమవడం బాధకరమైన విషయం. (ఇదీ చదవండి: గద్దర్ ఏ సినిమాల్లో నటించారో తెలుసా?) -
Gaddar Movies List: గద్దర్ ఏ సినిమాల్లో నటించారో తెలుసా?
ప్రజా గొంతు మూగబోయింది. వేల గొంతులను తన పాటలతో నిద్రలేపిన గొంతు ఇకపై వినిపించదు. ప్రతి క్షణం ప్రజల కోసమే పాటలు పాడిన ఆ స్వరం కనుమరుగైంది. దశాబ్దాల పాటు తెలంగాణ ప్రజల గొంతుకై వినిపించి.. ప్రజా గాయకుడిగా పేరొందిన గద్దర్ ఇక లేరు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు కాగా.. 1949లో జూన్ 5న మెదక్ జిల్లాలోని తూప్రాన్‌లో జన్మించారు. ఈ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఓసారి గద్దర్ నటించిన సినిమాల గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత ) 1983లోనే రంగుల కల సినిమాలో గద్దర్ ప్రధాన పాత్రలో నటించారు. జగపతి బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం జై బోలో తెలంగాణ. ఈ చిత్రంలో గద్దర్ కీలక పాత్రలో కనిపించారు. జైబోలో తెలంగాణ 2011నలో విడుదలైంది. 2016లో ఆర్ నారాయణమూర్తి తెరకెక్కించిన దండకారణ్యం చిత్రంలో కనిపించారు. సుడిగాలి సుధీర్, ధన్య బాలకృష్ణ జంటగా నటించిన చిత్రం సాఫ్ట్ వేర్ సుధీర్. ఈ సినిమాలో 2019 రిలీజ్ కాగా.. గద్దర్ కీలకపాత్ర పోషించారు. అంతే కాకుండా గతేడాది వచ్చిన మెగాస్టార్ చిత్రం గాడ్ ఫాదర్‌లోనూ గద్దర్ కీలక పాత్రలో నటించారు. . చిరంజీవి తండ్రికి స్నేహితుడిగా కనిపించారు. గద్దర్ చివరిసారిగా ఉక్కు సత్యాగ్రాహం చిత్రంలో నటించారు. ఆగస్టు 6 2023న హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. (ఇది చదవండి: గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?) -
గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?
ప్రజా గాయకుడు గద్దర్(74) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. మాజీ నక్సలైట్, రాజకీయ నాయకుడు అయిన గద్దర్.. ఇప్పటి జనరేషన్‌కు తెల్లని జుట్టు, భుజంపై కండువాతో కనిపించే ఓ వ్యక్తిగా మాత్రమే తెలుసు. ఈవెంట్ ఏదైనా గానీ దాదాపు ఇదే గెటప్‌లో కనిపించేవారు. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు తన పాటలతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన సాంగ్స్ ఎందుకంత స్పెషల్? గద్దర్ పాటల్లో 'బండెనక బండి కట్టి', 'మల్లె తీగకు', 'పొడుస్తున్న పొద్దుమీద' గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎందుకంటే ఇవన్నీ సూపర్‌హిట్స్. వీటితోపాటు గద్దర్ చాలా పాటలు ఆలపించారు. ఈ సాంగ్స్ ప్రతిదానిలోనూ ఉండే సాహిత్యం.. సామాన్యుడికి అర్థమవుతూనే, మంచి ఊపు తీసుకొచ్చేలా ఉంటుంది. అందుకే ఎన్నేళ్లయినా సరే గద్దర్ పాటలు బోర్ కొట్టవు. అవి మన నుంచి దూరం కావు. (ఇదీ చదవండి: వీళ్లది అలాంటి ఫ్రెండ్షిప్.. స్టార్ హీరోలు అయినా సరే!) గద్దర్ పాడిన వాటిలో 'బండెనక బండి కట్టి..' అనే పాట చాలా స్పెషల్. ఎందుకంటే 1979లో అంటే దాదాపు అండర్ గ్రౌండ్ కి వెళ్లడానికి కొన్నాళ్లు ఉందనగా ఈ పాట పాడారు. 'మా భూమి' సినిమలోని ఈ సాంగ్.. అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. జనాలు ఈ గీతాన్ని, టేప్ రికార్డుల్లో మళ్లీ మళ్లీ వినేలా చేసింది. ఇక 1995లో స్వయంగా రాసిన 'మల్లె తీగకు..' సాంగ్ అయితే ఏకంగా లిరిక్ రైటర్ కేటగిరీలో నంది అవార్డుని తెచ్చిపెట్టింది. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాట పాడారు. ఆర్. నారాయణ మూర్తి నటించిన 'ఒరేయ్ రిక్షా' సినిమాలోనిది ఈ పాట. (ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా) ఇక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన 'పొడుస్తున్న పొద్దుమీద..' అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి కూడా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా ఈయన నంది అవార్డ్ అందుకోవడం విశేషం. 'జై బోలో తెలంగాణ' అనే సినిమాలోనిది ఈ సాంగ్. గద్దర్ పాటల్లో ఈ మూడు చాలా స్పెషల్. వీటితో పాటు 'అడవి తల్లికి వందనం', 'పొద్దు తిరుగుడు పువ్వా', 'భద్రం కొడుకో', 'జం జమలబరి', 'మేలుకో రైతన్న' లాంటి గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. గద్దర్ ఇలా చనిపోవడం అందరినీ బాధపెట్టినా సరే ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయనేది మాత్రమే నిజం. (ఇదీ చదవండి: హీరోయిన్గా మారిన ‘రాజన్న’ చైల్డ్ ఆర్టిస్ట్) -
లోక్‌సభ ఎన్నికల్లో ప్రజాగాయకుడు పోటీ? భట్టి ఆఫర్‌కు గద్దర్ సై అంటారా?
సాక్షి, హైదరాబాద్: ఉద్యమ పాటలతో ప్రజాగాయకుడిగా గుర్తింపు పొందిన సామాజిక విప్లవకారుడు గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్‌రావు పార్లమెంట్ బాట పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వామపక్ష, విప్లవ రాజకీయాల్లో కొనసాగిన ఆయన ఆలోచనా ధోరణి ఇటీవలికాలంలో మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఆసక్తికర పరిణామం జరిగింది. పార్లమెంట్ కొత్త భవనానికి అంబేడ్కర్ పేరు పెట్టేలా అసెంబ్లీలో తీర్మానం చేయించాలని కోరుతూ గద్దర్ బుధవారం సాయంత్రం అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కలిశారు. గద్దర్ మాట్లాడుతూ.. రాహుల్ పాదయాత్ర తెలంగాణకు వచ్చినప్పుడు సమాచారమిస్తే తాను పాల్గొంటానని చెప్పారు. మరి యాత్రలో పాల్గొనాలంటే కాంగ్రెస్ పార్టీలో చేరాలా? అని ప్రశ్నించారు. వెంటనే స్పందించిన భట్టి.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని గద్దర్‌ను ఆహ్వానించారు. పార్టీలోకి రావడమే కాదని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేయాలని కూడా కోరారు. భట్టి ఆహ్వానానికి గద్దర్ తల ఊపుతూ సానుకూలంగా స్పందించారు. అక్కడే ఉన్న ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు పెద్దపల్లి స్థానం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలని గద్దర్‌ను కోరారు. అంబేడ్కర్ పేరు పెట్టడంపై కేసీఆర్‌ను కలిసి వినతిపత్రం ఇవ్వాలని గద్దర్‌కు భట్టి సూచించగా.. సీఎంను కలిసే అవకాశం లేదని ఆయన పేర్కొన్నారు. అందుకే ప్రతిపక్షనేతగా అసెంబ్లీలో తీర్మానం చేయించాలని భట్టిని కోరుతున్నట్టు చెప్పారు. ఇదీ చదవండి: ఇకపై వార్ వన్ సైడ్ కాదు.. 2024లో అంతా మారుతుంది -
కీరవాణి సంగీత సారథ్యంలో గద్దర్ పాట
రాజకీయ నేత ‘అద్దంకి దయాకర్’ ప్రధాన పాత్రలో బహుముఖ ప్రతిభాశాలి డా.మురళి బొమ్మ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ‘బొమ్మకు క్రియేషన్స్’పతాకంపై ప్రొడక్షన్ నంబర్ - 6గా డా.మురళి బొమ్మకు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంకా పేరు ప్రకటించని చిత్రం నుంచి ‘బానిసలారా లెండిరా’అనే పాటను విడుదల చేశారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ గీతానికి ‘ప్రజాయుద్ధనౌక’ గద్దర్ సాహిత్యాన్ని సమకూర్చి గాత్రాన్ని అందించారు. ఈ చిత్రంలో గద్దర్ ఓ ముఖ్య పాత్ర సైతం పోషించడం విశేషం. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఆడియో వేడుకలో విప్లవ గళం గద్దర్, చిత్ర కథానాయకుడు అద్దంకి దయాకర్, దర్శకనిర్మాత-స్టూడియో అధినేత డా.మురళి బొమ్మకు, రాజకీయ ప్రముఖులు జె.బి.రాజు, మల్లు రవి, మన్వతా రాయ్, బెల్లయ్య నాయక్, చరణ్ కౌశిక్ యాదవ్, శివకుమార్, దుర్గం భాస్కర్, విజయ్ కుమార్, భాస్కర్ రెడ్డి, రమేష్ రాథోడ్, కేతురి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రంలో దయాకర్,గద్దర్‌లతో పాటు సుమన్, ఇంద్రజ, సితార, శుభలేక సుధాకర్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. -
వాన పడతాది జాన... ఎట్ట బొమ్మందునో...
జ్ఞాపకం ‘‘నేను హనుమకొండకు వచ్చిన తర్వాత వెలువడిన ‘సృజన’ సంచిక జూలై 1973. అప్పటికే ఎన్.కె, జనసేన, కానూరి వెంకటేశ్వరరావుల పాటలు విని, వాటిలో కవిత్వం కొంతైనా అనుభవించి ఉన్నానుగాని ఆ సంచికలోనే మొదటిసారిగా వి.బి. గద్దర్ పాటలు చూశాను. అప్పటికే లయ ఉన్న కవిత్వం, గొంతెత్తి చదువుకునే కవిత్వం రుచి దొరికి ఉన్న నాకు ఆ సంచికలో అచ్చయిన నాలుగు గద్దర్ పాటలు కొత్త కవిత్వాన్ని పరిచయం చేశాయి. ‘నీవు నిజం దెలుసుకోవరో కూలన్న నీవు నడుం గట్టి నడవాలి రైతన్నా’... ‘రిక్షాదొక్కేరహీమన్న రాళ్లుగొట్టే రామన్న డ్రైవర్ మల్లన్న హమాలి కొమ్రన్న’... ‘వాన పడతాది జాన ఎట్టబొమ్మందునో’ ‘కల్లుముంతో మాయమ్మ నిన్ను మరువజాలనే’... అనే పాటలు చదువుతుంటే ఒళ్లు పులకించింది. ఇంత మామూలు మాటలతో ఇంతగా ఉద్రేకపరిచే కవిత్వం ఉంటుందా అని ఆశ్చర్యం వేసింది. ఆ తర్వాత మూడు నెలలకు ఆ పాటలు గద్దర్ నోటి వెంట విన్నప్పుడు కలిగిన ఉత్తేజం నిజంగా చెప్పడం అసాధ్యం. నిజానికి గద్దర్ పాటలు అచ్చుకెక్కడం అదే మొదటిసారి. అందుకే అవి అచ్చవుతున్నప్పుడు సృజన సంపాదకీయ వ్యాఖ్య కూడా రాసింది. ‘ఈ సంచికలోనూ రాగల వొకటి రెండు సంచికల్లోనూ ఎక్కువ సంఖ్యలో వేయనున్న వి.బి.గద్దర్ పాటలు త్వరలో పుస్తకరూపంలో కూడా వస్తాయి. హైదరాబాద్ జిల్లా మాండలికాలు, అక్కడి ప్రజాజీవితం మాత్రమే కాదు- ఈ పాటలన్నీ ఆ చుట్టుపట్ల పల్లెల్లో ప్రజలు పాడుకునే బాణీల్లో వచ్చినవే. కొన్ని పాటల మకుటాలు చరణాలు కూడా ప్రజలు పడుకునే పాటల నుంచే తీసుకుని విప్లవభావాలకు అనుగుణంగా మలచినవి. ఈనాడివి హైదరాబాద్ చుట్టూ దాదాపు ఇరవై గ్రామాల్లో విరివిగా పాడుకోబడుతున్నాయి’ అని సృజన రాసింది. అప్పటికి ఎంత అర్థమయ్యాయో చెప్పలేనుగాని ఆ తర్వాత నాలుగు నెలలు నిజంగా జీవితం మారిపోయిన రోజులు. ఆ తర్వాత వెలువడిన ఆగస్ట్ 1973 సంచికలో ‘వీడేనమ్మో డబ్బున్న బాడుకావు’, ‘పోదామురో జనసేనలో కలిసి’, సెప్టెంబర్ 1973 సంచికలో ‘రెక్కబొక్క వొయ్యకుండ సుక్కసెమ్ట వొడ్వకుండ బొర్ర బాగా బెంచావురో దొరోడో’, ‘పిల్లో నేనెల్లిపోతా’, ‘నిజం తెలుసుకోవరో కూలన్న’... గద్దర్ పాటల ప్రభంజనం. - ఎన్. వేణుగోపాల్ ఫేస్బుక్ గ్రూప్ ‘కవి సంగమం’లో ‘కవిత్వంతో ములాకాత్’ పేరిట వస్తున్న వ్యాస పరంపర నుంచి