Gaddar Banisala Lendi Song Out From Bommaku Creations New Film | MM Keeravani - Sakshi
Sakshi News home page

Gaddar Banisala Lendi Song: ‘బానిసలారా లెండిరా’ అంటూ గళమెత్తి కదం తొక్కిన గద్దర్

Published Tue, Aug 9 2022 5:24 PM | Last Updated on Tue, Aug 9 2022 7:08 PM

Gaddar Banisala Lendi Song Out From Bommaku Creations New Film - Sakshi

రాజకీయ నేత ‘అద్దంకి దయాకర్‌’ ప్రధాన పాత్రలో బహుముఖ ప్రతిభాశాలి డా.మురళి బొమ్మ  ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.  ‘బొమ్మకు క్రియేషన్స్‌’పతాకంపై ప్రొడక్షన్ నంబర్ - 6గా  డా.మురళి బొమ్మకు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఇంకా పేరు ప్రకటించని చిత్రం నుంచి ‘బానిసలారా లెండిరా’అనే పాటను విడుదల చేశారు. ఎమ్.ఎమ్.కీరవాణి సంగీత సారథ్యంలో రూపొందిన ఈ గీతానికి ‘ప్రజాయుద్ధనౌక’ గద్దర్ సాహిత్యాన్ని సమకూర్చి గాత్రాన్ని అందించారు.

ఈ చిత్రంలో గద్దర్ ఓ ముఖ్య పాత్ర సైతం పోషించడం విశేషం. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఆడియో వేడుకలో విప్లవ గళం గద్దర్, చిత్ర కథానాయకుడు అద్దంకి దయాకర్, దర్శకనిర్మాత-స్టూడియో అధినేత డా.మురళి బొమ్మకు, రాజకీయ ప్రముఖులు జె.బి.రాజు, మల్లు రవి, మన్వతా రాయ్, బెల్లయ్య నాయక్, చరణ్ కౌశిక్ యాదవ్, శివకుమార్, దుర్గం భాస్కర్, విజయ్ కుమార్, భాస్కర్ రెడ్డి, రమేష్ రాథోడ్, కేతురి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్రంలో దయాకర్,గద్దర్‌లతో పాటు సుమన్‌, ఇంద్రజ, సితార, శుభలేక సుధాకర్‌ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్‌ని త్వరలోనే ప్రకటిస్తామని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement