ప్రజా గాయకుడు గద్దర్(74) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. మాజీ నక్సలైట్, రాజకీయ నాయకుడు అయిన గద్దర్.. ఇప్పటి జనరేషన్‌కు తెల్లని జుట్టు, భుజంపై కండువాతో కనిపించే ఓ వ్యక్తిగా మాత్రమే తెలుసు. ఈవెంట్ ఏదైనా గానీ దాదాపు ఇదే గెటప్‌లో కనిపించేవారు. పిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ల వరకు తన పాటలతో ఆకట్టుకున్నారు. అయితే ఆయన సాంగ్స్ ఎందుకంత స్పెషల్?
గద్దర్ పాటల్లో 'బండెనక బండి కట్టి', 'మల్లె తీగకు', 'పొడుస్తున్న పొద్దుమీద' గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. ఎందుకంటే ఇవన్నీ సూపర్‌హిట్స్. వీటితోపాటు గద్దర్ చాలా పాటలు ఆలపించారు. ఈ సాంగ్స్ ప్రతిదానిలోనూ ఉండే సాహిత్యం.. సామాన్యుడికి అర్థమవుతూనే, మంచి ఊపు తీసుకొచ్చేలా ఉంటుంది. అందుకే ఎన్నేళ్లయినా సరే గద్దర్ పాటలు బోర్ కొట్టవు. అవి మన నుంచి దూరం కావు.
(ఇదీ చదవండి: వీళ్లది అలాంటి ఫ్రెండ్‌షిప్.. స్టార్ హీరోలు అయినా సరే!)
గద్దర్ పాడిన వాటిలో 'బండెనక బండి కట్టి..' అనే పాట చాలా స్పెషల్. ఎందుకంటే 1979లో అంటే దాదాపు అండర్ గ్రౌండ్ కి వెళ్లడానికి కొన్నాళ్లు ఉందనగా ఈ పాట పాడారు. 'మా భూమి' సినిమలోని ఈ సాంగ్.. అప్పట్లో ఓ ఊపు ఊపేసింది. జనాలు ఈ గీతాన్ని, టేప్ రికార్డుల్లో మళ్లీ మళ్లీ వినేలా చేసింది.
ఇక 1995లో స్వయంగా రాసిన 'మల్లె తీగకు..' సాంగ్ అయితే ఏకంగా లిరిక్ రైటర్ కేటగిరీలో నంది అవార్డుని తెచ్చిపెట్టింది. వందేమాతరం శ్రీనివాస్ ఈ పాట పాడారు. ఆర్. నారాయణ మూర్తి నటించిన 'ఒరేయ్ రిక్షా' సినిమాలోనిది ఈ పాట.
(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా)
ఇక తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన 'పొడుస్తున్న పొద్దుమీద..' అనే పాట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనికి కూడా బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్‌గా ఈయన నంది అవార్డ్ అందుకోవడం విశేషం. 'జై బోలో తెలంగాణ' అనే సినిమాలోనిది ఈ సాంగ్.
గద్దర్ పాటల్లో ఈ మూడు చాలా స్పెషల్. వీటితో పాటు 'అడవి తల్లికి వందనం', 'పొద్దు తిరుగుడు పువ్వా', 'భద్రం కొడుకో', 'జం జమలబరి', 'మేలుకో రైతన్న' లాంటి గీతాలు ఇప్పటికీ సంగీత ప్రియుల్ని అలరిస్తూనే ఉన్నాయి. గద్దర్ ఇలా చనిపోవడం అందరినీ బాధపెట్టినా సరే ఆయన పాటలు ఎప్పటికీ మనతోనే ఉంటాయనేది మాత్రమే నిజం.
(ఇదీ చదవండి: హీరోయిన్‌గా మారిన ‘రాజన్న’ చైల్డ్ ఆర్టిస్ట్)
Comments
Please login to add a commentAdd a comment