హైదరాబాద్: హైదరాబాద్‌లోని ఎల్బీస్టేడియంలో ప్రజా గాయకుడు గద్దర్ గారి పార్థివ దేహానికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(సంస్థ) ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ గారు నివాళులు అర్పించారు. గద్దర్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారిని ఓదార్చారు.
ఈ సందర్భంగా గద్దర్ గారితో తనకున్న అనుబంధాన్ని సజ్జనర్ గారు జ్ఞాపకం చేసుకున్నారు. నెల రోజుల క్రితం ఆయన నన్ను వ్యక్తిగతంగా కలిసినప్పుడు ప్రజా రవాణా వ్యవస్థ ప్రాముఖ్యతతో పాటు బస్‌తో తనకున్న అనుబంధాన్ని వివరించారని చెప్పారు. టీఎస్‌ఆర్టీసీ ఉద్యోగుల కష్టాల గురించి ఒక పాటను రాసి, సంస్థకు అంకితం చేస్తానని చెప్పారు. అంతలోనే గద్దర్ మరణవార్త వినడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఒక లెజండరీ కవి, యాక్టివిస్ట్‌ను కొల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన పాటలతో ప్రజలను చైతన్యం కలిగించి.. ప్రజా యుద్ద నౌకగా ప్రజల హృదయాల్లో గద్దర్ గారు నిలిచిపోయారని కొనియాడారు.
గద్దర్ గారితో నాకు దశాబ్ద కాలంగా పరిచయం ఉంది. అనేక సార్లు వ్యక్తిగతంగా నన్ను కలిశారు. ఎన్నో విషయాలను నాతో పంచుకున్నారు. తను చెప్పవలసిన విషయాన్ని ఎంతో ధైర్యంగా, మృదువుగా చెప్పేవారు. ఉద్యమం అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం కాదని, ప్రజల హక్కులను కాపాడుకోవడమని చెప్పేవారు. పాటను గద్దర్ వ్యాపారంగా చూడలేదు. పాట ద్వారా ప్రజా సమస్యలను బయటకు తెచ్చారని సజ్జనర్ గుర్తుచేసుకున్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని కలిసికట్టుగా నడిపిన నాయకులు ఎందరు ఉన్నా, తెలంగాణ సాధించిన ఘనత పాటల తల్లిదని చెప్పి సంతోషించే వారు. ఈ మధ్య కాలంలో గద్దర్ గారి ఆరోగ్యం క్షీణించిందని తెలిసింది. సమయాభావం వల్ల కలువలేకపోయాను. పాట నిలిచి ఉన్నంత కాలం గద్దర్ బ్రతికే ఉంటారు. ఉద్యమకారులు ఎవ్వరు చనిపోయినా ఆయన అక్కడికి చేరుకొని తన పాటలతో నివాళులు అర్పించేవారు. ఈ రోజు ఆయనకు నివాళులు అర్పించడం అనేది బాధాకరం. గద్దర్ గారి కుటుంబ సభ్యులకు మరియు ఆయన అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాన్నారు.
గద్దర్ గారి పార్ధివ దేహానికి టీఎస్‌ఆర్టీసీ కుటుంబం తరపున నివాళులు అర్పిస్తున్నామని, ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు సజ్జనర్, ఐపీఎస్ ప్రకటించారు.
కన్నీటి సిరాను కలంలో నింపి హృదయ పలకం మీద రాస్తున్న చరాక్షర నివాళి!
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 6, 2023
గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్. విప్లవ ప్రయాణానికి రథ సారథి ఆయన. పేదల పక్షాన జరిగే పోరాటాలకు వెన్నెముక. ఎన్నో ప్రభుత్వాలను ప్రజల పక్షాన అడిగిన ప్రశ్న.
పాట అంటే చెవులతో కాదు వినేది.. పాటంటే గుండెలతో విని… pic.twitter.com/TwtYTnzoCW
Comments
Please login to add a commentAdd a comment