టైటిల్: ఉక్కు సత్యాగ్రహం
నటీనటులు: గద్దర్, సత్యారెడ్డి, ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం : పి. సత్యా రెడ్డి
సంగీతం: శ్రీకోటి
ఎడిటర్: మేనగ శ్రీను
విడుదల తేది: నవంబర్ 29, 2024
సత్యా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు సత్యారెడ్డి. ప్రజా నౌక గద్దర్ నటించిన చివరి చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(నవంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
కథేంటంటే..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటన నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. అప్పుడు చాలా మంది నాయకులు, ఉద్యమకారులు ఆ ప్రైవేటీకరణ ఆపేందుకు కృషి చేశారు. ఆ సన్నివేశాలన్నీ ప్రజలకు తెలిసేలా చేయడానికి సత్యా రెడ్డి గారు ఓ సినిమా రూపంలో చిత్రీకరించడం జరిగింది. అప్పుడు వైజాగ్ లో జరిగిన సన్నివేశాలు, దానికి ఉద్యమకారులు ఎటువంటి సపోర్టు చేశారు? మల్టీ నేషనల్ కంపెనీలు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశారు? దీనిలోకి గద్దర్ ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? చివరకు ఎవరి ప్రయత్నం ఫలించింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. చాలావరకు విశాఖపట్నంలో చాలా న్యాచురల్ లొకేషషన్లలో చేయడంవల్ల సినిమాకు ఒక ఒరిజినాలిటీ కనిపించింది. అంతేకాక ఈ సినిమాలో డైలాగులు విప్లవత్మకంగా ఉండటం సినిమాకు కలిసొచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమయంలో అక్కడ జరిగిన విప్లవాలను తెరపై చక్కగా చూపించారు. డబ్బింగ్ అలాగే కొన్నిచోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండ అనిపించింది. కెమెరా అక్కడక్కడ స్థిరంగా లేనట్లు అనిపించినప్పటికీ సన్నివేశాలకు తగ్గట్లు నిజంగా విప్లవాలు జరుగుతున్నప్పుడు ఎలా అయితే మోసంతో ఉంటాయో ఈ చిత్ర సన్నివేశాలు కూడా అలాగే చాలా న్యాచురల్ గా అనిపించాయి. పల్సర్ ఝాన్సీ ఓ పోలీస్ ఆఫీసర్ గా అలాగే ఉద్యమకారునిగా తన పాత్రకు తన న్యాయం చేయడం జరిగింది. అలాగే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ తన పాత్ర మేరకు మంచి స్క్రీన్ తో ప్రేక్షకులను అలరించారు. అదేవిధంగా చిత్రంలో తదితర పాత్రలు పోషించిన నటీనటులు అంతా చాలా బాగా నటించారు.
ఎవరెలా చేశారంటే..
ఉద్యమకారుడి పాత్రలో సత్యారెడ్డి చక్కగా నటించాడు. తెరపై ఆయన నటన చూస్తే దాసరి నారాయణ గుర్తుకు వస్తాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అలాగే చిత్రానికి ప్రజానౌక గద్దర్ పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచారు. కొన్ని సన్నివేశాలలో సత్య రెడ్డితో కలిసి నటిస్తూ, అలాగే కొన్ని ఉద్యమ సన్నివేశాలలో పాల్గొంటూ చిత్రానికి వెన్నుముకగా నిలవడం జరిగింది. గద్దర్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. సినిమాకు ఆ సీన్స్ ప్లస్ అయ్యాయి. సాంకేతికంగా సినిమా పర్వాలేదు.
Comments
Please login to add a commentAdd a comment