Satya Reddy
-
‘ఉక్కు సత్యాగ్రహం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉక్కు సత్యాగ్రహంనటీనటులు: గద్దర్, సత్యారెడ్డి, ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల తదితరులుకథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం : పి. సత్యా రెడ్డిసంగీతం: శ్రీకోటిఎడిటర్: మేనగ శ్రీనువిడుదల తేది: నవంబర్ 29, 2024సత్యా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు సత్యారెడ్డి. ప్రజా నౌక గద్దర్ నటించిన చివరి చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(నవంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటన నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. అప్పుడు చాలా మంది నాయకులు, ఉద్యమకారులు ఆ ప్రైవేటీకరణ ఆపేందుకు కృషి చేశారు. ఆ సన్నివేశాలన్నీ ప్రజలకు తెలిసేలా చేయడానికి సత్యా రెడ్డి గారు ఓ సినిమా రూపంలో చిత్రీకరించడం జరిగింది. అప్పుడు వైజాగ్ లో జరిగిన సన్నివేశాలు, దానికి ఉద్యమకారులు ఎటువంటి సపోర్టు చేశారు? మల్టీ నేషనల్ కంపెనీలు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశారు? దీనిలోకి గద్దర్ ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? చివరకు ఎవరి ప్రయత్నం ఫలించింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.విశ్లేషణయదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. చాలావరకు విశాఖపట్నంలో చాలా న్యాచురల్ లొకేషషన్లలో చేయడంవల్ల సినిమాకు ఒక ఒరిజినాలిటీ కనిపించింది. అంతేకాక ఈ సినిమాలో డైలాగులు విప్లవత్మకంగా ఉండటం సినిమాకు కలిసొచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమయంలో అక్కడ జరిగిన విప్లవాలను తెరపై చక్కగా చూపించారు. డబ్బింగ్ అలాగే కొన్నిచోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండ అనిపించింది. కెమెరా అక్కడక్కడ స్థిరంగా లేనట్లు అనిపించినప్పటికీ సన్నివేశాలకు తగ్గట్లు నిజంగా విప్లవాలు జరుగుతున్నప్పుడు ఎలా అయితే మోసంతో ఉంటాయో ఈ చిత్ర సన్నివేశాలు కూడా అలాగే చాలా న్యాచురల్ గా అనిపించాయి. పల్సర్ ఝాన్సీ ఓ పోలీస్ ఆఫీసర్ గా అలాగే ఉద్యమకారునిగా తన పాత్రకు తన న్యాయం చేయడం జరిగింది. అలాగే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ తన పాత్ర మేరకు మంచి స్క్రీన్ తో ప్రేక్షకులను అలరించారు. అదేవిధంగా చిత్రంలో తదితర పాత్రలు పోషించిన నటీనటులు అంతా చాలా బాగా నటించారు.ఎవరెలా చేశారంటే..ఉద్యమకారుడి పాత్రలో సత్యారెడ్డి చక్కగా నటించాడు. తెరపై ఆయన నటన చూస్తే దాసరి నారాయణ గుర్తుకు వస్తాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అలాగే చిత్రానికి ప్రజానౌక గద్దర్ పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచారు. కొన్ని సన్నివేశాలలో సత్య రెడ్డితో కలిసి నటిస్తూ, అలాగే కొన్ని ఉద్యమ సన్నివేశాలలో పాల్గొంటూ చిత్రానికి వెన్నుముకగా నిలవడం జరిగింది. గద్దర్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. సినిమాకు ఆ సీన్స్ ప్లస్ అయ్యాయి. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. -
స్టీల్‌ప్లాంట్ పోరాటాల ఇతివృత్తంతో ‘ఉక్కు సత్యాగ్రహం’
సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల చివర షెడ్యూల్ పూర్తయింది. ప్రజాగాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో పల్సర్ బైక్ ఝాన్సీ కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రసన్నకుమార్, వైజాగ్ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించి హీరో- దర్శకనిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ ‘స్టీల్‌ప్లాంట్ సాధణ కోసం జరిగిన పోరాటం, పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాల ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ జేఎసీ ఛైర్మన్ అయెధ్య రామ్, మర్రి రాజశేఖర్, ఆదినారాయణ, కెఎస్ఎన్ రావుతోపాటు యూనియన్ లీడర్లు, ఉద్యోగులు, భూనిర్వాసితులు స్వచ్ఛందంగా ఈ చిత్రంలో నటించారు. (చదవండి: ప్రియురాలితో నటుడి సహజీవనం, రెండోసారి గర్భం దాల్చిన మోడల్) రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. గద్దర్, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, మజ్జి దేవిశ్రీ అద్భుతమైన పాటలు రాశారు. సంగీతం హైలైట్‌గా ఉంటుంది. అతి త్వరలో ఆర్కె బీచ్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహచించనున్నాం. రాష్టంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఈ వేడుకకు అతిథిగా హాజరవుతారు’ అని అన్నారు. -
‘మిమ్మల్ని పెయిడ్ ఆర్టిస్టులని పిలవలేం.. కానీ’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం సరైందని సినీ నిర్మాతల సంఘం మాజీ చైర్మన్ సత్యారెడ్డి అన్నారు. ఆయన శనివారం ఫిల్మ్ చాంబర్లో మీడియాతో మాట్లాడారు. కొందరు రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా చేస్తున్నారని తెలిపారు. వారి నిరసన కార్యక్రమానికి మద్దతునివ్వాలని ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. రాజకీయాల్లోకి సినీ ప్రముఖులను ఎందుకు లాగుతున్నారని సత్యారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎవరికీ తాము మద్దతు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ‘ఫిల్మ్ చాంబర్ ముందు ధర్నా చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులని పిలవలేం కానీ, మీరు మాత్రం కచ్చితంగా అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులే’ అని ఆయన పేర్కొన్నారు. -
ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్‌గా సత్యారెడ్డి
తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌లో కొత్త పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ఉన్న నిర్మాతల సెక్టార్ కార్యవర్గాన్ని అవిశ్వాసంతో తొలగించి, కొత్త కార్య వర్గాన్ని ఎన్నుకున్నారు. ఇప్పటి దాకా నిర్మాతల సెక్టార్‌కు చైర్మన్ అయిన ప్రతాని రామకృష్ణగౌడ్ పైన, ఆఫీస్ బేరర్లపైన పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో పాత కమిటీని రద్దు చేసి, కొత్త కమిటీ కోసం హైదరాబాద్‌లో ఎన్నికలు నిర్వహించారు. బసిరెడ్డి, విజయేందర్‌రెడ్డి ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరించారు. తాజా ఎన్నికలతో నిర్మాత పి. సత్యారెడ్డి ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా శంకర్ గౌడ్, వల్లూరిపల్లి రమేశ్, సెక్రటరీలుగా పద్మిని, పూసల కిషోర్ ఎన్నికయ్యారు. -
కిన్నో ఆరెంజ్, మాల్టా జఫ్ఫా ప్రత్యేకతలేమిటి?
‘కొత్త బత్తాయి లోకం..!’ శీర్షికన గత వారం సాగుబడిలో ప్రచురించిన ప్రకృతి వ్యవసాయదారుడు సత్యారెడ్డి విజయగాథకు విశేష స్పందన లభించింది. ఇప్పటికి దాదాపు 2 వేల ఫోన్ కాల్స్‌కు సమాధానం చెప్పారు. బత్తాయి, కిన్నో ఆరెంజ్, మాల్టా జఫ్ఫా పండ్ల జాతుల మధ్య తేడాలపై రైతులు ప్రశ్నలు అడుగుతున్నారని సత్యారెడ్డి తెలిపారు. మరికొన్ని అంశాలు ఆయన మాటల్లోనే: కినో ఆరెంజ్ పండ్లు చెట్టుకు మధ్య, కింద భాగాల్లో గుత్తులు గుత్తులుగా కాయలు కాస్తాయి. కూలీల ఖర్చు, జీవామృతం తయారీకి బెల్లం, శనగపిండి ఖర్చు తప్ప మరే ఖర్చూ లేదు. బత్తాయికి, కిన్నో ఆరెంజ్‌కి మధ్య తేడా ఏమిటి? బత్తాయిల నుంచి తీసిన రసం రెండు, మూడు గంటల్లో రుచి తేడా వస్తుంది. సహజ పద్ధతిలో సాగైన బత్తాయిల రసమైతే మరికొన్ని గంటలపాటు రుచిలో మార్పు లేకుండా ఉంటుంది. రసాయన పద్ధతిలో పండించిన కిన్నో ఆరెంజ్ పండ్ల రసం 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. అదే సహజ పద్ధతిలో పండించిన కినో ఆరెంజ్ పండ్ల రసం దాదాపు నెల వరకు రుచిలో మార్పుండదు.బత్తాయిపై తోలు గట్టిగా ఉంటుంది. కిన్నో తోలు మెత్తగా ఉంటుంది. బత్తాయి పులుపు, తీపి కలిపిన రుచితో ఉంటే, ఇది పూర్తి తియ్యగా ఉంటుంది.కిన్నో ఆరెంజ్ సాగుకు ఎర్రనేలలు అనుకూలం. దీనికి రాత్రి ఉష్ణోగ్రత తక్కువగా ఉండాలి. దీన్ని పంజాబ్‌లో విరివిగా సాగుచేస్తున్నారు. కిన్నో ఆరెంజ్‌కి, మాల్టా జఫ్ఫాకి మధ్య తేడా? మాల్టా జఫ్ఫాలో గుజ్జు ఎక్కువగా ఉంటుంది. కినో ఆరెంజ్ కంటే ఎక్కువ తియ్యగా ఉంటుంది. కిన్నో ఆరెంజ్ చెట్టు ఏడాదికి ఒకసారి కాపుకు వస్తే జఫ్ఫా ఏడాదికి 2, 3 సార్లు కాపుకు వస్తుంది. కిన్నో ఆరెంజ్‌లో 12 నుంచి 25 వరకు విత్తనాలుంటాయి. జఫ్ఫాలో విత్తనాలు తక్కువగా ఉంటాయి. రసం ఎక్కువగా ఉంటుంది. మాల్టా బ్లడ్రెడ్ పండు పైకి బత్తాయిలా పచ్చగా ఉండి, లోపల బాగా ఎర్రగా ఉంటుంది. ‘పొలంలో గడ్డిని తగలబెడితే నీ తల్లి చీరను తగలబెట్టినట్టే’ అంటారు పాలేకర్. అది నిజం. పంజాబ్, హర్యానా, రాజస్థాన్‌లో గడ్డిని క్రాస్ కట్టర్ ద్వారా కత్తిరిస్తారు. దాంతో గడ్డి భూమిలో కలిసిపోయి సేంద్రియ ఎరువుగా మారుతుంది. పశువులను తోటలోకి వదిలి గడ్డి మేపుతున్నాను. దీని వల్ల గడ్డి కత్తిరించిన తోట కన్నా నా తోట అందంగా కనిపిస్తోంది.