సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం సరైందని సినీ నిర్మాతల సంఘం మాజీ చైర్మన్ సత్యారెడ్డి అన్నారు. ఆయన శనివారం ఫిల్మ్ చాంబర్‌లో మీడియాతో మాట్లాడారు. కొందరు రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా చేస్తున్నారని తెలిపారు. వారి నిరసన కార్యక్రమానికి మద్దతునివ్వాలని ఒత్తిడి తెస్తున్నారని అన్నారు. రాజకీయాల్లోకి సినీ ప్రముఖులను ఎందుకు లాగుతున్నారని సత్యారెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎవరికీ తాము మద్దతు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు. ‘ఫిల్మ్ చాంబర్ ముందు ధర్నా చేస్తున్న వారిని పెయిడ్ ఆర్టిస్టులని పిలవలేం కానీ, మీరు మాత్రం కచ్చితంగా అభివృద్ధిని అడ్డుకునే వ్యక్తులే’ అని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment