
సత్యారెడ్డి లీడ్ రోల్‌లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో పల్సర్ బైక్ పాటతో ఫేమస్ అయిన గాజువాక కండక్టర్ ఝాన్సీ హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. జనం ఎంటర్‌టైన్‌మెంట్‌పై రూపొందించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
(ఇది చదవండి: కాబోయే మెగా కోడలు.. అప్పుడే ఫోన్ వాల్‌పిక్ మార్చేసిందిగా!)
ఈ సందర్భంగా సత్యారెడ్డి మాట్లాడుతూ..'విశాఖ స్టీల్‌ప్లాంట్ సాధన కోసం గతంలో జరిగిన పోరాటం, ప్రస్తుతం పరిరక్షణ కోసం జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించాం. వాస్తవానికి దగ్గరగా యువతరాన్ని ఆలోచింపజేసేలా సినిమా ఉంటుంది. త్వరలో వైజాగ్ ఆర్‌కే బీచ్‌లో ఉక్కు సత్యాగ్రహం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం.' అని అన్నారు. వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ చిత్రానికి శ్రీ కోటి సంగీతమందించారు.
(ఇది చదవండి: ‘ఆది పురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట!)
Comments
Please login to add a commentAdd a comment