Ukku Satyagraham Movie
-
‘ఉక్కు సత్యాగ్రహం’ మూవీ రివ్యూ
టైటిల్: ఉక్కు సత్యాగ్రహంనటీనటులు: గద్దర్, సత్యారెడ్డి, ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎం వి వి సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల తదితరులుకథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, దర్శకత్వం : పి. సత్యా రెడ్డిసంగీతం: శ్రీకోటిఎడిటర్: మేనగ శ్రీనువిడుదల తేది: నవంబర్ 29, 2024సత్యా రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించి, నటించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటనను ఆధారంగా తీసుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు సత్యారెడ్డి. ప్రజా నౌక గద్దర్ నటించిన చివరి చిత్రం ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నేడు(నవంబర్ 29) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.కథేంటంటే..వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సంఘటన నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగుతుంది. ఆంధ్ర ప్రదేశ్‌లోని వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడానికి అప్పట్లో ప్రయత్నాలు జరిగిన విషయం అందరికి తెలిసిందే. అప్పుడు చాలా మంది నాయకులు, ఉద్యమకారులు ఆ ప్రైవేటీకరణ ఆపేందుకు కృషి చేశారు. ఆ సన్నివేశాలన్నీ ప్రజలకు తెలిసేలా చేయడానికి సత్యా రెడ్డి గారు ఓ సినిమా రూపంలో చిత్రీకరించడం జరిగింది. అప్పుడు వైజాగ్ లో జరిగిన సన్నివేశాలు, దానికి ఉద్యమకారులు ఎటువంటి సపోర్టు చేశారు? మల్టీ నేషనల్ కంపెనీలు ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కావడం కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశారు? దీనిలోకి గద్దర్ ఎలా వచ్చారు? ఎందుకు వచ్చారు? చివరకు ఎవరి ప్రయత్నం ఫలించింది అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.విశ్లేషణయదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన చిత్రమిది. చాలావరకు విశాఖపట్నంలో చాలా న్యాచురల్ లొకేషషన్లలో చేయడంవల్ల సినిమాకు ఒక ఒరిజినాలిటీ కనిపించింది. అంతేకాక ఈ సినిమాలో డైలాగులు విప్లవత్మకంగా ఉండటం సినిమాకు కలిసొచ్చింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ సమయంలో అక్కడ జరిగిన విప్లవాలను తెరపై చక్కగా చూపించారు. డబ్బింగ్ అలాగే కొన్నిచోట్ల బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే బాగుండ అనిపించింది. కెమెరా అక్కడక్కడ స్థిరంగా లేనట్లు అనిపించినప్పటికీ సన్నివేశాలకు తగ్గట్లు నిజంగా విప్లవాలు జరుగుతున్నప్పుడు ఎలా అయితే మోసంతో ఉంటాయో ఈ చిత్ర సన్నివేశాలు కూడా అలాగే చాలా న్యాచురల్ గా అనిపించాయి. పల్సర్ ఝాన్సీ ఓ పోలీస్ ఆఫీసర్ గా అలాగే ఉద్యమకారునిగా తన పాత్రకు తన న్యాయం చేయడం జరిగింది. అలాగే ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ తన పాత్ర మేరకు మంచి స్క్రీన్ తో ప్రేక్షకులను అలరించారు. అదేవిధంగా చిత్రంలో తదితర పాత్రలు పోషించిన నటీనటులు అంతా చాలా బాగా నటించారు.ఎవరెలా చేశారంటే..ఉద్యమకారుడి పాత్రలో సత్యారెడ్డి చక్కగా నటించాడు. తెరపై ఆయన నటన చూస్తే దాసరి నారాయణ గుర్తుకు వస్తాడు. డైలాగ్ డెలివరీ బాగుంది. అలాగే చిత్రానికి ప్రజానౌక గద్దర్ పెద్ద ప్లస్ పాయింట్ గా నిలిచారు. కొన్ని సన్నివేశాలలో సత్య రెడ్డితో కలిసి నటిస్తూ, అలాగే కొన్ని ఉద్యమ సన్నివేశాలలో పాల్గొంటూ చిత్రానికి వెన్నుముకగా నిలవడం జరిగింది. గద్దర్ పాత్ర నిడివి తక్కువే అయినప్పటికీ.. సినిమాకు ఆ సీన్స్ ప్లస్ అయ్యాయి. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. -
‘ఉక్కు సత్యాగ్రహం’ లో భాగం చేయడం సంతోషంగా ఉంది: ఎమ్మెల్యే కరణం
పి.సత్యారెడ్డి లీడ్ రోల్లో నటించి, జనం ఎంటర్టైన్మెంట్స్పై స్వీయ దర్శకత్వంలో నిర్మిం చిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. శుక్రవారం సత్యారెడ్డి పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ సినిమా ట్రైలర్, పాటల విడుదల వేడుక హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకలో పాల్గొన్న చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ–‘‘విశాఖపట్నం ఉక్కు నేపథ్యంలో సత్యారెడ్డి ‘ఉక్కు సత్యాగ్రహం’ సినిమా తీసుకురావడం చాలా మంచి విషయం. ఈ చిత్రంలో నన్ను కూడా ఓ భాగం చేయడం సంతోషంగా ఉంది’ అన్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ–‘‘నేనొక కమర్షియల్ డైరెక్టర్ అయినా నాకు ఉద్యమంతో కూడిన, ప్రజా సమస్యలతో కూడిన ఉద్యమాలు చేసే సినిమాలంటే చాలా ఇష్టం. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అన్నారు. ‘‘విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధించిన సమస్యలతో ఈ సినిమా తీశాం’’ అన్నారు పి.సత్యారెడ్డి. నిర్మాత దాసరి కిరణ్, దివంగత గాయకులు గద్దర్ కుమార్తె వెన్నెల, నటి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు. -
గద్దర్ నటించిన చివరి సినిమా ఇదే
ప్రజా గాయకుడు గద్దర్ తుదిశ్వాస విడిచారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన.. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆదివారం కన్నుమూశారు. ఎన్నో అద్భుతమైన పాటలతో అలరిస్తున్న గద్దర్.. కొన్ని సినిమాల్లోనూ నటించారు. ఈ మధ్య ఓ మూవీలో నటించారు. ఇప్పుడది ఆయనకు చివర సినిమా అయింది. ఇలా అకస్మాత్తుగా గద్దర్ చనిపోవడంతో ఆ సినిమా ఏంటి? దాని డీటైల్స్ చర్చనీయాంశంగా మారింది. (ఇదీ చదవండి: గద్దర్ పాటలు ఎందుకంత స్పెషల్?) సత్యారెడ్డి నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తీస్తున్న సినిమా 'ఉక్కు సత్యాగ్రహం'. విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో తీస్తున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుంది.ఈ మధ్యే షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఇందులో గద్దర్ కీలకపాత్ర పోషించారు. ఈయనతో పాటు గోరేటి వెంకన్న, సుద్దాల అకోశ్ తేజ తదితరులు ఈ చిత్రం కోసం పాటలు రాశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకల్ని త్వరలో వైజాగ్‌లోని ఆర్కే బీచ్ లో నిర్వహిస్తామని చిత్రబృందం ప్రకటించింది. ఓ ప్రముఖ వ్యక్తి ఈ వేడుకకు హాజరవుతారని అన్నారు. ఇలా అందరూ సినిమా హడావుడిలో ఉన్నారు. ఇప్పుడు సడన్‌గా గద్దర్ మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నారు. ఏదేమైనా సరే గద్దర్ లాంటి వ్యక్తి ఇలా మనకు దూరమవడం బాధకరమైన విషయం. (ఇదీ చదవండి: గద్దర్ ఏ సినిమాల్లో నటించారో తెలుసా?) -
గద్దర్ ప్రధాన పాత్రలో వస్తోన్న 'ఉక్కు సత్యాగ్రహం'
సత్యారెడ్డి లీడ్ రోల్లో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో పల్సర్ బైక్ పాటతో ఫేమస్ అయిన గాజువాక కండక్టర్ ఝాన్సీ హీరోయిన్గా పరిచయమవుతున్నారు. జనం ఎంటర్టైన్మెంట్పై రూపొందించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. (ఇది చదవండి: కాబోయే మెగా కోడలు.. అప్పుడే ఫోన్ వాల్పిక్ మార్చేసిందిగా!) ఈ సందర్భంగా సత్యారెడ్డి మాట్లాడుతూ..'విశాఖ స్టీల్‌ప్లాంట్ సాధన కోసం గతంలో జరిగిన పోరాటం, ప్రస్తుతం పరిరక్షణ కోసం జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఈ చిత్రం రూపొందించాం. వాస్తవానికి దగ్గరగా యువతరాన్ని ఆలోచింపజేసేలా సినిమా ఉంటుంది. త్వరలో వైజాగ్ ఆర్కే బీచ్‌లో ఉక్కు సత్యాగ్రహం ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తాం.' అని అన్నారు. వైజాగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. కాగా.. ఈ చిత్రానికి శ్రీ కోటి సంగీతమందించారు. (ఇది చదవండి: ‘ఆది పురుష్’ హనుమంతుని కండల రహస్యం ఇదేనట!) -
స్టీల్‌ప్లాంట్ పోరాటాల ఇతివృత్తంతో ‘ఉక్కు సత్యాగ్రహం’
సత్యారెడ్డి కథానాయకుడిగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఉక్కు సత్యాగ్రహం’. విశాఖ స్టీల్ ప్లాంట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనం ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఇటీవల చివర షెడ్యూల్ పూర్తయింది. ప్రజాగాయకుడు గద్దర్ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంతో పల్సర్ బైక్ ఝాన్సీ కథానాయికగా పరిచయమవుతున్నారు. ప్రసన్నకుమార్, వైజాగ్ ఎంపీ ఎం.వి.వి.సత్యానారాయణ, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించి హీరో- దర్శకనిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ ‘స్టీల్‌ప్లాంట్ సాధణ కోసం జరిగిన పోరాటం, పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటాల ఇతివృత్తంతో ఈ చిత్రం రూపొందుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాట కమిటీ జేఎసీ ఛైర్మన్ అయెధ్య రామ్, మర్రి రాజశేఖర్, ఆదినారాయణ, కెఎస్ఎన్ రావుతోపాటు యూనియన్ లీడర్లు, ఉద్యోగులు, భూనిర్వాసితులు స్వచ్ఛందంగా ఈ చిత్రంలో నటించారు. (చదవండి: ప్రియురాలితో నటుడి సహజీవనం, రెండోసారి గర్భం దాల్చిన మోడల్) రియాలిటీకి దగ్గరగా ఉంటుంది. గద్దర్, గోరటి వెంకన్న, సుద్దాల అశోక్ తేజ, మజ్జి దేవిశ్రీ అద్భుతమైన పాటలు రాశారు. సంగీతం హైలైట్‌గా ఉంటుంది. అతి త్వరలో ఆర్కె బీచ్‌లో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహచించనున్నాం. రాష్టంలో అత్యంత కీలకమైన వ్యక్తి ఈ వేడుకకు అతిథిగా హాజరవుతారు’ అని అన్నారు.