ఓటుపై చైతన్య యాత్ర | Chaitanya Yatra on vote | Sakshi
Sakshi News home page

ఓటుపై చైతన్య యాత్ర

Published Tue, Oct 9 2018 1:24 AM | Last Updated on Tue, Oct 9 2018 1:24 AM

Chaitanya Yatra on vote - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘మీరు ఓటు నమోదు చేసుకున్నారు. ఇక నుంచి మీరు భారతీయులే’ అని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) రజత్‌కుమార్‌ తనను ఉద్దేశించి వ్యాఖ్యానించారని ప్రజాయుద్ధ నౌక గద్దర్‌ పేర్కొన్నారు. 70 ఏళ్లు నిండిన తరువాత ఈ సారే తొలిసారిగా ఓటరు గా నమోదు చేసుకున్నానని తెలిపారు. సోమవారం సచివాలయంలో సీఈఓను కలిసిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఓటరు గా నమోదవడం తన జీవితంలో గొప్ప మార్పు గా భావిస్తున్నానని, అందుకే ఓటు పట్ల ప్రజల ను చైతన్యపరచాలని నిర్ణయించానని తెలిపారు. ‘నోటుకు ఓటులా ఉండొద్దు.. నోటుకు ఓటు అమ్ముడుపోవద్దు’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజా చైతన్య యాత్రను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ యాత్రకు అనుమతి కోరేందుకు సీఈఓను కలిసినట్లు తెలిపారు.  ప్రజలు కోరుకుంటే గజ్వేల్‌ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నానని, విపక్ష పార్టీలతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement