
హైదరాబాద్: గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. గద్దర్ మరణం రాష్ట్ర ప్రజలందరికీ ఆవేదన కల్గించిందని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ లేఖలో పేర్కొంది. ‘గద్దర్ మరణం రాష్ట్ర ప్రజలందరినీ ఆవేదనలోకి నెట్టింది. గద్దర్ అంటే దేశంలో, రాష్ట్రంలో తెలియని వారు వుండరు. గదర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. గదర్ కు మా ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము. నగ్జల్బరి, శ్రీకాకులం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వాము వ్యతిరేకంగా పోరాటం చేశారు.
పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్య పరిచారు గద్దర్. జన నాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి వుంది. 1972 నుండి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకు కొనసాగింది. 4 దశబ్దాలు పీడిత ప్రజల ప్రక్షాన నిలబడ్డాడు. 1972 నుండి 2012 మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగాడు. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా పని చేశాడు. దోపిడి పాలకులు ఎన్ కౌంటర్ లలో, బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవ కారుల శవాలను తమ కుటుంబాలకు చేరకుండా. చేసిన సందర్భంలో శవాల స్వాధీన ఉద్యమానికి నాయకత్వం వహించాడు.
సాంస్కృతి రంగం యొక్క అవసరాన్ని పార్టీ గుర్తించి తనను బయటకు పంపి జన నాట్య మండలిని అభివృద్ధి చేసింది. 1997లో గదర్ పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కలిసి గద్దర్ పై కాల్పులు చేశారు. ఐదు తూటాలు శారీరంలో దూసుకెళ్ళి ప్రాణ ప్రాయ స్థితి నుండి బయట పడినాడు. గదర్ చివరి కాలంలో పార్టీ నింబంధనవళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలవడంతో మా పార్టీ సోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీనితో 2012లో పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశాడు. దాన్ని మా పార్టీ ఆమోదించింది. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన నిలిచిన గదర్ ఆతరువాత బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నాడు’ అని మావోయిస్టు పార్టీ పేర్కొంది.
'గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్'.. ఆసక్తిరేపుతోన్న సీనియర్ IPS ఆఫీసర్ ట్వీట్