Moist Party
-
Gaddar: గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ లేఖ
హైదరాబాద్: గద్దర్ మృతిపై మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసింది. గద్దర్ మరణం రాష్ట్ర ప్రజలందరికీ ఆవేదన కల్గించిందని తెలంగాణ రాష్ట్ర మావోయిస్టు కమిటీ లేఖలో పేర్కొంది. ‘గద్దర్ మరణం రాష్ట్ర ప్రజలందరినీ ఆవేదనలోకి నెట్టింది. గద్దర్ అంటే దేశంలో, రాష్ట్రంలో తెలియని వారు వుండరు. గదర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. గదర్ కు మా ప్రగాఢ సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము. నగ్జల్బరి, శ్రీకాకులం పోరాటాల ప్రేరణతో తెలంగాణలో భూస్వాము వ్యతిరేకంగా పోరాటం చేశారు. పాటలు, నాటికలు, బుర్ర కథలు, ఒగ్గు కథల ద్వారా పీడిత ప్రజలను చైతన్య పరిచారు గద్దర్. జన నాట్య మండలి ఏర్పాటులో గద్దర్ కృషి వుంది. 1972 నుండి గద్దర్ విప్లవ ప్రస్థానం మొదలై 2012 వరకు కొనసాగింది. 4 దశబ్దాలు పీడిత ప్రజల ప్రక్షాన నిలబడ్డాడు. 1972 నుండి 2012 మావోయిస్టు పార్టీ సభ్యుడిగా కొనసాగాడు. మలి దశ ఉద్యమంలో తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడిగా పని చేశాడు. దోపిడి పాలకులు ఎన్ కౌంటర్ లలో, బూటకపు ఎన్ కౌంటర్లలో మరణించిన విప్లవ కారుల శవాలను తమ కుటుంబాలకు చేరకుండా. చేసిన సందర్భంలో శవాల స్వాధీన ఉద్యమానికి నాయకత్వం వహించాడు. సాంస్కృతి రంగం యొక్క అవసరాన్ని పార్టీ గుర్తించి తనను బయటకు పంపి జన నాట్య మండలిని అభివృద్ధి చేసింది. 1997లో గదర్ పై కూడా నల్లదండు ముఠా, పోలీసులు కలిసి గద్దర్ పై కాల్పులు చేశారు. ఐదు తూటాలు శారీరంలో దూసుకెళ్ళి ప్రాణ ప్రాయ స్థితి నుండి బయట పడినాడు. గదర్ చివరి కాలంలో పార్టీ నింబంధనవళికి విరుద్ధంగా పాలక పార్టీలతో కలవడంతో మా పార్టీ సోకాజ్ నోటీస్ ఇచ్చింది. దీనితో 2012లో పార్టీ సభ్యత్వానికి రాజీనామ చేశాడు. దాన్ని మా పార్టీ ఆమోదించింది. 2012 వరకు పీడిత ప్రజల పక్షాన నిలిచిన గదర్ ఆతరువాత బూర్జువా పార్లమెంట్ మార్గాన్ని ఎంచుకున్నాడు’ అని మావోయిస్టు పార్టీ పేర్కొంది. 'గద్దర్.. ఇది పేరు కాదు ఒక బ్రాండ్'.. ఆసక్తిరేపుతోన్న సీనియర్ IPS ఆఫీసర్ ట్వీట్ -
మావోల హిట్‌లిస్టులో ఎమ్మెల్యేలు.. టీఆర్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్..!
సాక్షి , కరీంనగర్: ఒకప్పుడు మావోయిస్టు పార్టీకి కంచుకోటగా ఉన్న ఉమ్మడి కరీంనగర్లో రెండువారాలుగా కలకలం రేగుతోంది. మావో యిస్టు రాష్ట్ర కార్యదర్శి మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్, యాక్షన్ కమిటీ సభ్యుడు పాండు అలియాస్ మంగులు దళాలు ప్రవేశించాయని పోలీసులు అప్రమత్తమయ్యారు. గోదావరి నది దాటి వీరు పెద్దపల్లి జిల్లాలోనూ ప్రవేశించే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో సోమవారం సీఎం పెద్దపల్లి పర్యటనలో ఆఖరు నిమిషాన రోడ్డు మార్గం వద్దని పోలీసులు కేసీఆర్‌ను ఆకాశమార్గం (హెలీక్యాప్టర్) ద్వారా రప్పించారు. 2005 తరువాత మావోయిస్టు పార్టీ పాత కరీంనగర్ జిల్లాలో దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. 2020 లాక్డౌన్ సమయంలో జిల్లాలో కార్యకలాపాలు సాగించేందుకు తిరిగి యత్నాలు ప్రారంభించింది. సిరిసిల్లలో ఓ కాంట్రాక్టరు వద్ద డబ్బులు వసూలు చేయడం, జగిత్యాలలోనూ రిక్రూట్మెంట్ కోసం ప్రయత్నించడం వంటి ఘటనలు వెలుగుచూశాయి. ఎక్కడికక్కడ అణిచివేత..! మావోలతో సంబంధాలున్న ఏ నెట్‌వర్క్‌నైనా ఉమ్మడి జిల్లా పోలీసులు ఎక్కడికక్కడ భగ్నం చేశారు. కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమలలో పనిచేసే కొందరితో మావోలు కొంతకాలం రహస్య సంబంధాలు నెరిపారు. ఈ వ్యవహారంపై కన్నేసిన కరీంనగర్ సీపీ సత్యనారాయణ గంగాధర, చొప్పదండి, బావుపేట, హుస్నాబాద్‌లకు చెందిన పలువురిని అరెస్టు చేసి మావోల నెట్‌వర్క్‌ను తెంచారు. అలాగే.. జనశక్తి పేరిట కొందరు మాజీలు సిరిసిల్లలో కార్యకలాపాలకు పూనుకునేందుకు సిద్ధమైనా.. ఎస్పీ రాహుల్ హెగ్డే వీరిని ఆదిలోనే అణిచివేశారు. ఇదే జనశక్తికి చెందిన పలువురు ఆయుధాలతో జగిత్యాలలో సంచరిస్తుండగా.. ఎస్పీ సింధు శర్మ బృందం వీరిని అదుపులోకి తీసుకుంది. రామగుండం కమిషనరేట్ పరిధిలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఎలాంటి కదలికల్లేకుండా జాగ్రత్తపడుతున్నారు. సున్నిత ప్రాంతంగా పెద్దపల్లి జిల్లా.. తాజాగా పెద్దపల్లి జిల్లాలోని ఆర్ఎఫ్సీఎల్లో వెలుగుచూసిన కుంభకోణంలో మావోయిస్టు కార్యదర్శి వెంకటేశ్ పేరుతో విడుదలవుతున్న లేఖలపై పోలీసులు సీరియస్‌గా దృష్టి సారించారు. ఆ లేఖల్లో పలువురు నేతల పేర్లు ప్రస్తావించడంతో అవి ఎక్కడ నుంచి వచ్చాయన్న విషయంపై పోలీసులు కూపీ లాగుతున్నారు. అదే విధంగా మాజీ మావోలపైనా రహస్యంగా నిఘా కొనసాగిస్తున్నారు. ఈ లేఖలు తొలుత ఆగస్టు 25న, ఆ తరువాత 31న మావోయిస్టు పార్టీ జయశంకర్– మహబూబాబాద్– వరంగల్2– పెద్దపల్లి జిల్లాల డివిజన్ కమిటీ పేరుతో వచ్చాయి. తొలుత ఈ లేఖను కొందరు ఆకతాయిలు విడుదల చేశారని పోలీసులు భావించారు. కానీ.. వీటిని మావోయిస్టులే విడుదల చేశారని ఇటీవల పోలీసులు కూడా నిర్ధారించినట్లు సమాచారం. మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్ సరిహద్దులకు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతంలోని కొందరు నాయకులకు ముప్పు అధికంగా ఉందని, దీన్ని సున్నిత ప్రాంతంగా గుర్తించి ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. అనుమానితులు, కొత్త వ్యక్తుల సమాచారాన్ని నిరంతరం తెప్పించుకుంటున్నారు. జిల్లా సరిహద్దుల వద్ద సీసీ కెమెరాలు, ఇన్ఫార్మర్ల ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. చదవండి: Hyderabad: చూస్తుండగానే బాలుడిపైకి దూసుకెళ్లిన కారు.. భయానక దృశ్యాలు టీఆర్ఎస్, బీజేపీ నేతలే టార్గెట్..! విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, బీజేపీ నేతలను టార్గెట్‌గా చేసుకుని మావోలు దాడులకు పాల్పడతారన్న సమాచారం పోలీసుల వద్ద ఉంది. తద్వారా పాత జిల్లాలో తిరిగి ఉనికిని చాటుకోవాలన్నది మావోల వ్యూహమని పోలీసులు చెబుతున్నారు. దీంతో మావోల జాబితాలో ఉన్న సదరు నేతలను పోలీసులు ఇప్పటికే అప్రమత్తం చేశారు. తమకు సమాచారం ఇవ్వకుండా ఎక్కడా పర్యటించవద్దని స్పష్టంచేశారు. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా నేతలకు ముప్పు అధికంగా పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నెట్వర్క్ నాశనమైందన్న ఆందోళనలో ఉన్న మావోలు దాన్ని పునరుద్ధరించుకోవాలన్నా.. పార్టీకి నిధులు సమకూర్చుకోవాలన్నా.. వారి ముందున్న ఏకైక మార్గం హింస. అందుకే.. పోలీసులు వీఐపీ నేతల రక్షణకు సంబంధించిన ప్రతీ అంశాన్ని చాలా పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారు. భద్రత విషయంలో చిన్న లోపమున్నా.. మావోలు హింసకు పాల్పడతారన్న సమాచారంతో అనునిత్యం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
మావోయిస్టు పార్టీ సానుభూతిపరుల అరెస్ట్
సాక్షి, పర్ణశాల: మావోయిస్టు పార్టీకి పేలుడు పదార్థాలను సరఫరా చేస్తున్న సానుభూతిపరులైన ఏడుగురిని బుధవారం అరెస్ట్ చేసి, కోర్టుకు అప్పగించినట్టు ఎస్ఐ.బాలకృష్ణ తెలిపారు. ఆయన వెల్లడించిన వివరాలు... మండలంలోని చిన్ననల్లబల్లి గ్రామ శివారులోని తాటివారిగూడెం వెళ్లే దారి మధ్యన ఆటోలో ఏడుగురు వెళుతున్నారు. వారు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్న సమాచారంతో సీఆర్పీఎఫ్ బలగాలతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తమను చూసి ఆటోలో పారిపోతున్న ఆ ఏడుగురిని పోలీసులు వెంబడించి అదుపులోకి తీసుకుని విచారించారు. వీరిని, దుమ్ముగూడెం మండలంలోని దబ్బనూతల గ్రామస్తులు సొందె రవి, కుర్సం మురళి, తెల్లం నాగరాజు, బూర్గంపాడు మండలం వుడ్ యార్డ్ లక్ష్మీపురం గ్రామస్తుడు ఊకం శ్రీను, ఏపీలోని చింతూరు మండలం పోతనపల్లి గ్రామస్తుడు మడకం చిన్నబాబు, పాల్వంచ మండలం తోగ్గూడెం గ్రామస్తుడు బిందాని దమన్ అలియాస్ ధర్మ, ములకలపల్లి మండలం ఆనందపురం గ్రామస్తుడు కొండ్రు జగదీష్గా గుర్తించారు. వీరి నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనపర్చుకున్నారు. పాల్వంచ మండలంలోని తోగ్గూడెం, బూర్గంపాడు మండలంలోని లక్ష్మీపురం నుంచి మావోయిస్టులకు వీటిని సరఫరా చేస్తున్నట్టుగా వారు అంగీకరించారు. వీరి నుంచి పది ఎక్స్‌పోసివ్ బూస్టర్లు, పది ఎలక్ట్రానిక్ డిటొనేటర్లు, 300 మీటర్ల డీఎఫ్ వైర్, ఆటో (టీఎస్28 టీ0208) స్వాధీనపర్చుకున్నారు. కేసు నమోదు చేశారు. వారిని ఖమ్మం కోర్టుకు అప్పగించారు. కేసును చర్ల సీఐ సత్యనారాయణ దర్యాప్తు చేస్తున్నారు. -
తడపలగుట్టల్లో భారీ ఎన్కౌంటర్
-
తెలంగాణలో చానళ్లపై నిషేధం న్యాయమే కానీ...
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీవీ-9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానళ్లపై నిషేధం విషయంలో ఎంఎస్ఓల ప్రతి స్పందన న్యాయంగానే ఉన్నా.. దాని ప్రయోజనం పాలకుడి నియంతృత్వానికి దారి తీయొద్దని, ఉపయోగపడొద్దని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో మీడియాపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన నియంతృత్వ వ్యాఖ్యలు, నిషేధ ఫత్వాలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. మీడియా స్వేచ్ఛ అంటే పాలకులు, మీడియా యాజమాన్యల స్వేచ్ఛ కాదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనుసరిస్తున్న వైఖరి, మీడియా స్వేచ్ఛపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తూ బుధవారం సుదీర్ఘ లేఖను మీడియా సంస్థలకు విడుదల చేశారు. మీడియాపై నిషేధం తగదని పేర్కొంటూనే.. ‘ఈనాడు’ అధినేత రామోజీరావు, ‘ఆంధ్రజ్యోతి’ ఎండీ వేమూరి రాధాకృష్ణ, టీవీ-9 యాజమాన్యాలు అనుసరిస్తున్న వైఖరిని ఎండగట్టారు. కేవలం పచ్చళ్ల వ్యాపారం చేసే రామోజీరావు పత్రికా స్వేచ్ఛ ముసుగులో 10 వేల ఎకరాల ఫిల్మ్ సిటీ సామ్రాజ్యాన్ని స్థాపించుకోవడం జగమెరిగిన సత్యమన్నారు.