హైదరాబాద్, సాక్షి: కళాకారులకు ఇచ్చే నంది అవార్డుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నంది అవార్డులను గద్దర్ అవార్డులుగా పేరు మారుస్తూ ప్రదానం చేయనున్నట్లు ప్రకటించనుంది. ఇక నుంచి కవులు కళాకారులకు నంది అవార్డులు కాదు గద్దర్ అవార్డులు ఇస్తాం అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి స్వయంగా తెలియజేశారు.
బుధవారం(జనవరి 31) గద్దర్ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ ప్రకటన చేశారు. ఇకపై గద్దరన్న పేరిట అవార్డులు ఇస్తాం. అర్హులైన కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఈ అవార్డులు ఇస్తాం. వచ్చే ఏడాది గద్దరన్న జయంతి నుంచి ఈ అవార్డుల ప్రదానం ఉంటుంది. త్వరలోనే జీవో రిలీజ్ చేస్తాం అని ప్రకటించారాయన.
‘‘నంది అవార్డులు పునరుద్ధరించాలని సినిమా వాళ్లు అడిగారు. నంది అవార్డులు కాదు.. మా ప్రభుత్వం కచ్చితంగా అవార్డులు ఇస్తుంది. గద్దర్ అవార్డుల పేరుతో పురస్కారాలు ఇస్తాం. కవులు, కళాకారులు, సినీ ప్రముఖులకు ఇచ్చే అధికారిక అవార్డులకు గద్దర్ అవార్డు ఇస్తాం. ఇదే శాసనం.. నా మాటే జీవో’’ అని సీఎం రేవంత్ అన్నారు.
ప్రజాగాయకుడు గద్దర్ (Gaddar) జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వేదిక నుంచి ట్యాంక్‌బండ్‌పై గద్దర్ విగ్రహ ఏర్పాటునకు కృషి చేస్తామని రేవంత్ ప్రకటించారు. మరోవైపు తెల్లపూర్(సంగారెడ్డి) మున్సిపాలిటీలో గద్దర్ విగ్రహ(తొలి!) ఏర్పాటుకు ఇప్పటికే ప్రభుత్వం స్థలం కూడా కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment