ఇటీవల మరణించిన ప్రజాకవి గద్దర్ భార్య గుమ్మడి విమలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేఖ రాశారు. గద్దర్ మృతి తెలుసుకొని తానెంతో బాధపడ్డానని తెలిపారు. తీవ్ర దు:ఖంలో ఉన్న గద్దర్ కుటుంబానికి మోదీ సానుభూతిని తెలియజేశారు.
సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను గద్దర్ పాటలు, రచనలు ప్రతిబింబిస్తాయని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని కొనియాడారు. గద్దర్ కుటుంబ సభ్యుల దు:ఖాన్ని మాటల్లో చెప్పలేనని, శ్రేయోభిలాషులకు, బంధువులకు దీనిని తట్టుకునే శక్తిని ప్రసాదించమని కోరకుంటున్నానని మోదీ తెలిపారు. చివరిగా లేఖలో ఓంశాంతి అని పేర్కొన్నారు.
కాగా ఈ నెల 6వ తేదీన గద్దర్ మృతి చెందిన విషయం తెలిసిందే. గత నెల జూలై 20వ తేదీన గుండెపోటుతో బేగంపేటలోని అపోలో స్పెక్ట్రా ఆసుపత్రిలో చేరిన గద్దర్‌కు గుండెకు శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. అయితే గద్దర్‌కు ఊపిరితిత్తులు, యూరినరీ ఇన్ ఫెక్షన్ కారణంగా మృతి చెందినట్టుగా ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. ఈ నెల 7వ తేదీన గద్దర్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు. ఆయన అంతిమ యాత్రను చూసేందుకు కూడా జనాలు భారీగా తరలివచ్చారు.
చదవండి: అమ్మ ప్రేమకు బహుమతిగా చంద్రుడిపై స్థలం కొన్న కూతురు..
Comments
Please login to add a commentAdd a comment