తెలంగాణ ప్రజల గొంతుక మూగబోయింది. ఇన్ని రోజులు తన పాటలతో ఊర్రూతలూగించిన ప్రజా గాయకుడు గద్దర్ ఇకలేరు. అనారోగ్యం కారణాలతో ఆస్పత్రిలో చేరిన ఆదివారం ఆగస్టు 6న అమీర్‌పేట్‌లోని అపోలో స్పెక్ట్రా ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన అసలు పేరు విఠల్ రావు కాగా.. 1949 జూన్ 5న తూప్రాన్‌లో జన్మించారు.
(ఇది చదవండి: ఒక శకం ముగిసింది.. గద్దర్ మరణంపై ఆర్ నారాయణమూర్తి దిగ్భ్రాంతి)
అయితే రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ క్రమంలో గుండె ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. కానీ అంతలోనే ఆయన మృతిచెందడం విషాదకరంగా మారింది. ఆయన మరణించడానికి గల కారణాలపై వైద్యులు బులెటిన్ విడుదల చేశారు. గద్దర్ మృతికి గల ప్రధాన కారణాలను వెల్లడించారు.
ప్రధానంగా ఊపిరితిత్తులు, మూత్ర సమస్యలతోనే గద్దర్ కన్నుమూసినట్లు వైద్యులు తెలిపారు. జూలై 20న తీవ్రమైన గుండెజబ్బుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు.. ఆగస్టు 3వ తేదీన బైపాస్ సర్జరీ చేశారు. అయినప్పటికీ ఆయనకు గతంలో ఉన్న ఊపిరితిత్తుల సమస్య తలెత్తడంతో కోలుకోలేక మృతి చెందారని బులెటిన్‌లో వైద్యులు ప్రకటించారు.
(ఇది చదవండి: గద్దర్ మరణం.. కన్నీరు పెట్టిన విమలక్క)
Comments
Please login to add a commentAdd a comment