సాక్షి, కరీంనగర్: ‘మహా జన్‌సంపర్క్ అభియాన్’లో భాగంగా గురువారం నుంచి ‘ఇంటింటికీ బీజేపీ’పేరిట తొమ్మిదేళ్ల మోదీ ప్రభుత్వ పాలనలో సాధించిన అభివృద్ధి, సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర బీజేపీ సిద్ధమైంది. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మొదలు పోలింగ్‌బూత్ స్థాయి కార్యకర్త దాకా మొత్తం పార్టీ యంత్రాంగం ఈ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ బీజేపీ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. తెలంగాణలో 30 లక్షల కుటుంబాలను కలుస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన 9 ఏళ్ళ అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నాం. కేంద్రం తెలంగాణకు ఏం ఇచ్చిందనే విషయాన్నీ ప్రజలకు వివరిస్తున్నాం. తెలంగాణ కోసం 1400 మంది చనిపోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అమరుల ఆశయాలను పట్టించుకోలేదు. కేసీఆర్ మళ్లీ జిమ్మిక్కులు చేస్తున్నారు.
కేవలం ప్రచారం కోసమే వేయి కోట్లు ఖర్చు పెట్టారు. కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మడం లేదు. మునిగిపోయే నావ కాంగ్రెస్. మునిగిపోయే నావలో చేరకండి. బీఆర్‌ఎస్ నేతల అవినీతిపై విచారణ సాగుతోంది. తెలంగాణలో ఎవరితోనూ పొత్తులు ఉండవు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది. బీజేపీ, బీఆర్‌ఎస్ ఒక్కటి కాదు. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీని ప్రజలు ఆదరిస్తున్నారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటుంది అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో ప్రజా గాయకుడు గద్దర్ గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ అంటే మాకు గౌరవం ఉంది. కేసీఆర్‌ను గద్దర్ ప్రశ్నించాలి. అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం కేసీఆర్ జిమ్మిక్‌లో భాగమే. ఈడీ, సీబీఐలతో బీజేపీ సంబంధం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి: మీకు రైతుబంధు రావడం లేదా?.. అయితే ఇలా చేయండి
Comments
Please login to add a commentAdd a comment