Gaddar Expulsion From KA Paul Praja Shanti Party, Details Inside - Sakshi
Sakshi News home page

ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్‌ బహిష్కరణ

Published Wed, Jun 21 2023 1:59 PM | Last Updated on Wed, Jun 21 2023 3:08 PM

Gaddar Expulsion From KA Paul Praja Shanti Party - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేఏ పాల్‌ పొలిటికల్‌ పార్టీ ప్రజాశాంతి నుంచి ప్రజా గాయకుడు గద్దర్‌ బహిష్కరణకు గురయ్యారు. ఈ మేరకు ప్రజాశాంతి పార్టీ బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. 

ఇదిలా ఉండగా.. తెలంగాణలో ప్రజా గాయకుడు గద్దర్‌ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. కొత్త పార్టీ ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ పేరును గద్దర్‌ అనౌన్స్‌ చేశారు. ఈ క్రమంలో గద్దర్‌ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల కార్యాయాలనికి గద్దర్ చేరుకున్నారు. రాజకీయ పార్టీ ‘గద్దర్‌ ప్రజా పార్టీ’ రిజిస్ట్రేషన్‌ కోసం ఎన్నికల అధికారులను కలిశారు గద్దర్‌. కాగా, నెల రోజుల్లో రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తి కానుంది. ఈ సందర్భంగా గద్దర్‌ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీచేస్తానని అన్నారు. బంగారు తెలంగాణ కాలేదు.. పుచ్చిపోయిన తెలంగాణ చేశారు. కేసీఆర్‌ విధానాలు తప్పు అంటూ సీరియస్‌ అయ్యారు. 

ఇది కూడా చదవండి: ఆడియో లీక్‌: కేటీఆర్‌ సార్‌ మీటింగ్‌కు వస్తారా.. లేకుంటే ఫైన్‌ కడతారా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement