సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో మరోసారి పొలిటికల్ హీట్ పెరిగింది. తెలంగాణ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ రానుంది. ప్రజా గాయకుడు గద్దర్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. కొత్త పార్టీ ‘గద్దర్ ప్రజా పార్టీ’ పేరును గద్దర్ అనౌన్స్ చేశారు. ఈ క్రమంలో గద్దర్ ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర ఎన్నికల కార్యాయాలనికి గద్దర్ చేరుకున్నారు. రాజకీయ పార్టీ ‘గద్దర్ ప్రజా పార్టీ’ రిజిస్ట్రేషన్ కోసం ఎన్నికల అధికారులను కలిశారు గద్దర్. కాగా, నెల రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కానుంది.
ఈ సందర్భంగా గద్దర్ మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌పై పోటీచేస్తాను. బంగారు తెలంగాణ కాలేదు.. పుచ్చిపోయిన తెలంగాణ చేశారు. కేసీఆర్ విధానాలు తప్పు.. ధరణి పేరుతో కేసీఆర్ భూములను మింగాడు. పదేళ్ల తెలంగాణలో ప్రజలు కోరుకున్న పరిపాలన అందలేదు. 79ఏళ్ల వయసులో దోపిడీ పార్టీ పోవాలని ప్రజాపార్టీ పెట్టాను. ఓటును బ్లాక్ మనీ నుంచి బయటకు తేవాలి. ఇప్పటి వరకు అజ్ఞాతవాసం నుంచి ప్రజలను చైతన్యం చేశాను. ఇక నుంచి పార్లమెంటరీ పంథాను నమ్మకుని బయలుదేరాను. ఇది శాంతియుద్ధం.. ఓట్ల యుద్ధం. పార్టీ నిర్మాణం కోసం గ్రామగ్రామానికి వెళ్తాను. నేను భావ విప్లవకారుడిని, అడవిలో ఉన్నాను అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: హైదరాబాద్ సీఈసీ టీం.. సెప్టెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్!
Comments
Please login to add a commentAdd a comment