
గద్దర్‌ను సన్మానిస్తున్న ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు
సాక్షి, అల్వాల్: ప్రజాపాటపై తూటాల దాడి జరిగి 24 ఏళ్లు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయకపోవడం పాలకుల వైఫల్యమని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. తూటాల దాడి జరిగి 24 ఏళ్లు గడిచినందున మంగళవారం రాత్రి అల్వాల్ అంబేడ్కర్‌నగర్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు అణిచివేత వైఖరి అవలంభిస్తున్నాయని, అందులో భాగంగానే తనను అంతం చేయాలని ప్రయత్నించారన్నారు. ఘటన జరిగి రెండు దశాబ్దాలు జరిగినా నేటి వరకు నిందితును అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ జితేంద్రనాథ్, సీఎల్ యాదగిరి ఉన్నారు.
చదవండి: 14న ‘సాగర్’కు కేసీఆర్