minampally hanumantharao
-
మల్లారెడ్డి కాలేజ్ వద్ద ఉద్రిక్తత
సాక్షి, హైదరాబాద్: నగరంలోని మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. యూనివర్సిటీకి చెందని విద్యార్థులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి దిష్టిబొమ్మను విద్యార్థులు దహనం చేశారు. వివరాల ప్రకారం.. విద్యార్థుల ఆందోళనలతో మల్లారెడ్డి అగ్రికల్చర్ యూనివర్సిటీ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పరీక్షలు ఒకటి, రెండు సబ్జెక్ట్‌లు ఫెయిల్ అయిన సుమారు 60 మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో వారు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా మల్లారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ విద్యార్థులు, వారి పేరెంట్స్ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకోగా.. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కాగా, ధర్నా చేస్తున్న విద్యార్థులకు కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావు మద్దతుగా నిలిచారు. -
మల్లారెడ్డికి ఊహించని షాక్.. సొంత పార్టీ నేతల వార్నింగ్!
సాక్షి, మేడ్చల్ జిల్లా: కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిపై సొంతపార్టీ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేశారు. నామినేటెడ్ పదవుల పంపకంలో ఏకపక్షంగా వ్యవహరించడంతో పాటు తాను చెబితేనే పనులు చేయాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేస్తున్నారంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యారు. మంత్రి పెత్తనాన్ని తీవ్రంగా తప్పుబట్టిన బీఆర్ఎస్ శాసనసభ్యులు.. ఈ వ్యవహారంపై అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటామని హెచ్చరించారు. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు సోమవారం ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసంలో అత్యవసరంగా భేటీ అయ్యారు. మైనంపల్లితో పాటు మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, కేపీ వివేకానంద, బేతి సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మంత్రి వ్యవహారశైలిపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో మేడ్చల్‌కే ప్రాధాన్యతనిస్తూ.. మిగతా సెగ్మెంట్లకు అన్యాయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం.. ‘మా నియోజకవర్గాల్లోని కార్యకర్తలకు న్యాయం చేయలేకపోతున్నాం. అధికార పార్టీలో ఉండి ఏం ప్రయోజనం? మంత్రి మల్లారెడ్డి ఒకదారి.. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు మరొకదారి.. ఈ ఇద్దరి వల్ల విసిగిపోయాం.. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపాల్సిన వారే అయోమయానికి గురిచేస్తూ జిల్లాలో పార్టీని భ్రషు్టపట్టిస్తున్నారు. ఇద్దరూ కలిసి పార్టీకి తీవ్ర కళంకాన్ని తెస్తున్నారు..’ అంటూ సమావేశంలో నేతలు చర్చించుకున్నారు. వారిని వెంటనే తప్పించి కార్యకర్తలకు న్యాయం చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే విషయం కూడా చర్చించారు. పార్టీ పరువు తీస్తున్నారు! కార్యకర్తలు, నాయకులు, ఎమ్మెల్యేలను సమన్వయంతో ముందుకు తీసుకు వెళ్లాల్సి ఉండగా..మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు. గ్రూపు రాజకీయాలకు పాల్పడుతూ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురి చేస్తూ పార్టీ పరువు తీస్తున్నారని ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు. సిట్టింగ్‌లకే టికెట్ ఇస్తామని సాక్షాత్తు సీఎం కేసీఆరే ప్రకటించినప్పటికీ, బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న కొందరు నేతలు పలు నియోజకవర్గాల్లో టికెట్ తమకే వస్తుందంటూ కార్యకర్తలను డైలమాలో పడేస్తున్నారని విమర్శించారు. ఏకపక్ష నిర్ణయాలతో విసిగిపోతున్నాం: ఎమ్మెల్యేలు జిల్లాలోని నామినేటెడ్ పదవులన్నీ మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గానికి మాత్రమే పరిమితమవుతున్నాయని జిల్లాకు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో కేవలం మేడ్చల్ నియోజకవర్గానికే ప్రాధాన్యత ఇస్తుండటంతో మిగతా నియోజకవర్గాల్లోని కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. సోమవారం ప్రత్యేక భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. మంత్రి తీరును నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం వల్లే మీడియా ముందుకు రావాల్సివచి్చందని చెప్పారు. మంత్రి మల్లారెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, చేష్టలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళతామన్నారు. మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయాన్ని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లిన తర్వాత కూడా.. రాత్రికి రాత్రే జీవో జారీ చేసి భాస్కర్ యాదవ్‌ను నియమించి, ఆ వెంటనే ప్రమాణ స్వీకారం చేయించారని విమర్శించారు. మంత్రి గతంలో పదవులను పొందిన వ్యక్తులకే మళ్లీ మళ్లీ కట్టబెడుతూ పంతం నెగ్గించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీకి కేడరే బలమని, అలాంటి కేడర్‌ను విస్మరిస్తే పార్టీ దెబ్బతినే అవకాశముందన్నారు. పార్టీ కేడర్‌ను రక్షించుకునేందుకే మీడియా ముఖంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఈ విషయాన్ని తెలుపుతున్నామని, వారి నుంచి పిలుపు కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. -
మీడియా ముందుకు సంజయ్ రాసలీలలు: మైనంపల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రసమితి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుపై కేసు నమోదైంది. కాగా, మల్కాజ్‌గిరిలో బీజేపీ కార్యకర్తపై.. టీఆర్ఎస్ కార్యకర్తల దాడి ఘటనలో మైనంపల్లితో పాటు.. మరో 15 మంది కార్యకర్తలపై స్థానిక పోలీసులు కేసులను నమోదు చేశారు. కాగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలపై.. టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి నిరసనగా రేపు బీజేపీ బంద్‌కు పిలుపునిచ్చింది. దీనిపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఘాటుగా స్పందించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. మల్కాజ్‌గిరిలో అడుగు పెడితే గుండు పగులుద్ధి అని హెచ్చరించారు. అదే విధంగా, బండి సంజయ్‌కు దమ్ముంటే తన ముందు ఆరోపణలు చేయాలని సవాల్ విసిరారు. కాగా, బండి సంజయ్ స్థాయి కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎంపీకి తక్కువ అని విమర్శించారు. ఇవాల్టి నుంచి బండి సంజయ్ భరతం పడతానన్నారు. అదేవిధంగా.. సంజయ్ రాసలీలలను త్వరలోనే మీడియా ముందు పెడతానని అన్నారు. -
నాపై తూటాల దాడికి 24 ఏళ్లు.. అయినా నేటి వరకు
సాక్షి, అల్వాల్: ప్రజాపాటపై తూటాల దాడి జరిగి 24 ఏళ్లు గడుస్తున్నా నిందితులను అరెస్టు చేయకపోవడం పాలకుల వైఫల్యమని ప్రజాగాయకుడు గద్దర్ అన్నారు. తూటాల దాడి జరిగి 24 ఏళ్లు గడిచినందున మంగళవారం రాత్రి అల్వాల్ అంబేడ్కర్‌నగర్‌లో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై ప్రజాస్వామ్య వ్యతిరేక శక్తులు అణిచివేత వైఖరి అవలంభిస్తున్నాయని, అందులో భాగంగానే తనను అంతం చేయాలని ప్రయత్నించారన్నారు. ఘటన జరిగి రెండు దశాబ్దాలు జరిగినా నేటి వరకు నిందితును అరెస్టు చేయకపోవడం శోచనీయమన్నారు. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, కార్పొరేటర్ జితేంద్రనాథ్, సీఎల్ యాదగిరి ఉన్నారు. చదవండి: 14న ‘సాగర్’కు కేసీఆర్ -
ఆ నేతలపై ఫిర్యాదు చేసినందుకు..
పంజగుట్ట: అధికార పార్టీ నేతల భూకబ్జాలపై ఫిర్యాదు చేసినందుకు తనపై దాడి చేశారని అల్వాల్‌కు చెందిన సాయి ప్రసాద్ ఆరోపించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ టీఆర్ఎస్ గ్రేటర్ అధ్యక్షులు మైనంపల్లి హనుమంతరావు, నాయకుడు నక్కా ప్రభాకర్ అల్వాల్‌లో ఆక్రమించుకున్న స్థలంలో రెండు అంతస్థులకు అనుమతి తీసుకుని మరో రెండు అంతస్థులు అక్రమంగా కట్టిన భవనాలపై ఆర్టిఏ ద్వారా సమాచారం తీసుకుని జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీకి ఫిర్యాదు చేశానన్నారు. దీంతో నక్కా ప్రభాకర్ అతని అనుచరులు తన ఇంటì కి వచ్చి తనపై దాడులు చేశారని, ఫిర్యాదు వాపస్ తీసుకోకపోతే చంపేస్తామని బెదిరించినట్లు తెలిపాడు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని కోరాడు. ఈ విశయమై పోలీస్‌స్టేషన్ లో ఫిర్యాదు చేశానని, త్వరలో హెచ్ఆర్సీని కూడా ఆశ్రయిస్తానని తెలిపారు.