Folk Singer Gaddar Death | Telugu People Got Tears Of Sad With Folk Singer Gaddar Is No More News - Sakshi
Sakshi News home page

నా పేరు విఠల్‌.. గద్దర్‌ నా పాట పేరు.. ఉద్యమ నేత చివరి లేఖ ఇదే..

Published Sun, Aug 6 2023 4:08 PM | Last Updated on Sun, Aug 6 2023 4:55 PM

Entire Telugu People Got Tears Of Sad With Folk Singer Gaddar Is No More News - Sakshi

ప్రజా పాట ఆగిపోయింది.. ప్రజా ‘యుద్ధనౌక’ అలసిపోయింది. ఇక సెలవు అంటూ దిగికేగింది.   తెలంగాణ రాష్ట్రం సాధనలో కీలక పాత్ర పోషించిన గద్దర్‌ ఇక లేరు. ఈరోజు(ఆదివారం) ఆయన తుదిశ్వాస విడిచారు. అపోలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గుండె సంబంధిత అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన గద్దర్‌..  గత నెల 31 తేదీన ప్రజలకు ఒక లేఖ రాశారు. తాను త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలోకి వస్తానంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు అదే ప్రజల్ని తీవ్రంగా బాధిస్తోంది. తిరిగి వస్తావని మాట ఇచ్చావు కదా.. గద్దర్‌ అన్నా.. మరి ఇదేంటి అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు. 

ఇటీవల  గద్దర్‌ రాసిన లేఖ ఇదే..
గుమ్మడి విఠల్ నాపేరు.  గద్దర్ నాపాట పేరు. నా బతుకు సుదీర్ఘ పోరాటం. నా వయస్సు 76 సంవత్సరాలు. నా వెన్నుపూసలో ఇరుక్కున్న తూటా వయస్సు 25 సంవత్సరాలు.  ఇటీవల నేను పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు మద్దతుగా "మా భూములు మాకే" నినాదంతో పాదయాత్రలో పాల్గొన్నాను.  

నా పేరు జనం గుండెల చప్పుడు. నా గుండె చప్పుడు ఆగిపోలేదు. కానీ ఎందుకో గుండెకు గాయం అయ్యింది.  ఈ గాయానికి చికిత్సకై అమీర్ పేట/ బేగంపేట లోని శ్యామకరణ్ రోడులో అపోలో  స్పెక్ట్రా (Apollo Spectra) హాస్పిటల్ లో ఇటీవల చేరాను.  జూలై ఇరువై నుండి నేటి వరకు అన్నిరకాల పరీక్షలు, చికిత్సలు తీసుకుంటూ కుదుట పడుతున్నాను. 
విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్‌ కన్నుమూత

గుండె చికిత్స నిపుణులు డాక్టర్ దాసరి ప్రసాదరావు, డాక్టర్ డి. శేషగిరిరావు, డాక్టర్ వికాస్, డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి, డాక్టర్ ఎన్. నర్సప్ప (అనిస్తీషియా),  డాక్టర్ ప్రఫుల్  చంద్ర నిరంతర పర్యవేక్షణలో వైద్యం అందుతున్నది. గతంలో నాకు డాక్టర్ జి. సూర్య ప్రకాశ్ గారు, బి. సోమరాజు గారు వైద్యం చేశారు.

పూర్తి ఆరోగ్యంతో కోలుకొని తిరిగి మీ మధ్యకు వచ్చి సాంస్కృతిక ఉద్యమం తిరిగి ప్రారంభించి, ప్రజల రుణం తీర్చుకుంటానని ప్రజల సాక్షిగా మాట ఇస్తున్నాను.
నా యోగ క్షేమాలు విచారించడానికి అపోలో స్పెక్ట్రా హాస్పిటల్ అమీర్ పేట్, హైదరాబాద్ కు చెందిన కింది నెంబర్  : 8978480860 (ఫ్రంట్ ఆఫీస్) కు సందేశం పంపవల్సిందిగా విజ్ఞప్తి.
ఇట్లు
ప్రజా గాయకుడు 
మీ గద్దర్ 

👉: (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement