గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ పెద్ద మనసు చాటుకున్నాడు. మెగాస్టార్‌కు వారసుడిగానే కాకుండా సాయంలోనూ చిరంజీవికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నాడు. తన మంచి మనసుతో ఒక చిన్నారి ప్రాణాన్ని కాపాడి ప్రాణదాతగా నిలిచాడు. తమ కూతురు దక్కదని భావించిన ఆ తల్లిదండ్రులకు దేవుడిలా సాయం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
చిరంజీవి పుట్టినరోజు నాడే (ఆగష్టు 22) ఓ ఫోటో జర్నలిస్ట్ కుటుంబంలో చిన్నారి జన్మించింది. అయితే, పుట్టుకతోనే పల్మనరీ హైపర్‌టెన్షన్ (గుండె సంబంధిత) జబ్బుతో ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. పాప గుండెలో సమస్య ఉందని, బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో చిన్నారిని అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. లక్షల్లో ఖర్చయ్యే వైద్యం చేయించే స్థోమత ఆ తండ్రికి లేకపోవడంతో సతమతమవుతున్నారు.
తీవ్రమైన ఆవేదనతో దిక్కుతోచనిస్థితిలో ఉన్న వారి విషయం రామ్ చరణ్ దృష్టికి వెళ్లడంతో 53 రోజులపాటు చికిత్సకు సాయమందించారు. ఆపై చిన్నారి చికిత్స కోసం రక్తం, ప్లేట్‌లెట్లు వంటివి చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి సమకూర్చారు. ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో చిన్నారి డిశ్చార్జ్ అయ్యింది. తమ కూతురు ఇక దక్కదని ఆందోళన చెందిన ఆ తల్లిందండ్రుల్లో రామ్‌చరణ్ సంతోషం నింపారు.
Comments
Please login to add a commentAdd a comment