హైదరాబాద్: గద్దర్ మీద ఓడిపోతాననే భయం తోనే కేసీఆర్ గజ్వేల్, మేడ్చల్ నియోజకవర్గాల నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారని టీమాస్ ఫోరం చైర్మన్ ప్రొఫెసర్ కంచ ఐలయ్య విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ తెలంగాణ ప్రజల్ని మోసం చేసిందని, త్యాగం చేసిన వారిని దూరం పెట్టిందని ఆరోపించారు.
కోదండరాం పార్టీకి సింబల్ లేదని.. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణ జన సమితిని పెట్టించింద న్నారు. మహాకూటమిలో అన్ని పార్టీల అధినే తలు రెడ్లే ఉన్నారని.. కూటమి గెలిస్తే వెలమ రాజ్యం పోయి రెడ్ల రాజ్యం వస్తుందని విమర్శించారు. జనరల్ సీటు మీద పోటీ చేస్తున్న గద్దర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మీద గౌరవం ఉన్న ఏ పార్టీ కూడా గద్దర్ మీద పోటీ చేయవద్దని కోరారు. సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో టీమాస్ ఫోరం నాయకులు ప్రొఫెసర్ సుదర్శన్, శ్రీరాంనాయక్, టి.స్కైలా బాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment