తెలంగాణ చైతన్య గీతిక, ప్రజల గొంతుక శాశ్వతంగా మూగబోయింది. ప్రజాగాయకుడు గద్దర్ అనారోగ్యంతో కన్నుమూశారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం (ఆగస్టు 6) తుదిశ్వాస విడిచారు. గద్దర్ మరణంపై నటుడు, దర్శకనిర్మాత ఆర్ నారాయణ మూర్తి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'ఒక అన్నమయ్య పుట్టారు, దివంగతులయ్యారు. ఒక రామదాసు పుట్టారు, దివంగతులయ్యారు. ఒక పాల్ రబ్సన్ పుట్టారు, దివంగతులయ్యారు. ఒక గద్దర్ పుట్టారు, దివంగతులయ్యారు. ప్రజా వాగ్గేయకారులలో మరో శకం ముగిసింది' అంటూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
కాగా గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. 1949లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని తుప్రాన్‌లో జన్మించారు. తన పాటలతో ఎంతో మందిని ఉత్తేజపరిచారు. తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్న గద్దర్‌కు ఇటీవలే గుండెపోటు వచ్చింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితమే అపోలో ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించుకున్నారు. ఈ ఆపరేషన్ సక్సెస్ అయినట్టు కూడా వైద్యులు ప్రకటించారు. ఇంతలోనే ఆయన మృతిచెందడంతో విషాదం నెలకొంది.
చదవండి: విషాదం.. ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూత
చిన్నతనంలోనే గద్దర్ మనసుకు గాయాలు.. ఎన్నెన్నో అవమానాలు
Comments
Please login to add a commentAdd a comment