
పంతంగిలో గ్రామస్తులతో సరదాగా గద్దర్ (ఫైల్)
చౌటుప్పల్ : ప్రజాగాయకుడు గద్దర్‌కు చౌటుప్పల్ ప్రాంతంతో అనుబంధం చాలానే ఉందని చెప్పవచ్చు. ఎదో ఒక కార్యక్రమం ద్వారా ఇక్కడికి విచ్చేస్తుండేవారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ సారధ్యంలో గ్లోబల్ పీస్ హోస్ట్ కమిటీ సంస్థలో మెంబర్‌గా ఉన్న ప్రజాగాయకుడు గద్దర్ గతేడాది సెప్టెంబరు 15న చౌటుప్పల్‌కు విచ్చేశారు.
అదే నెల 25న జరిగే తన జన్మదినాన్ని పురస్కరించుకొని చౌటుప్పల్ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ఏర్పాటు చేస్తానని కేఏపాల్ ప్రకటించిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో అనువైన భూములను గుర్తించేందుకుగాను గద్దర్ విచ్చేశారు. ఆయా గ్రామాల్లోని ప్రజలతో ఆప్యాయంగా పలకరించి మాట్లాడారు.
దివంగత వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మావోయిస్టులతో చర్చల ప్రక్రియ ప్రారంబాన్ని పురస్కరించుకొని మావోయిస్టు అగ్రనాయకులకు ఇక్కడే స్వాగతం పలికి హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు. జాతీయ రహదారి మీదుగా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే క్రమంలో ఇక్కడ ఆగిన సందర్భాలు చాలానే ఉంటాయి. తెలంగాణ సాధన ఉద్యమ సమయంలో మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment