
నిర్దిష్టమైన ధర నిర్ణయించాలి
నేను మూడెకరాల్లో నిమ్మ సాగు చేశాను. 250 చెట్లు ఉన్నాయి. నకిరేకల్ నిమ్మ మార్కెట్‌కు 13 బస్తాల నిమ్మకాయలు తీసుకొచ్చాను. ఒక్కో చిన్న సైజు కాయ బస్తాకు రూ.200 ధర వచ్చింది. పండు కాయలకు బస్తాకు రూ.1300, పెద్ద సైజు కాయలకు రూ.1200 మించి ధర రావడం లేదు. పది రోజుల క్రితం మార్కెట్‌కు వస్తే రోజుకు రూ.30 వేలు వచ్చేవి. నేడు రూ.10వేలకు మించి రావడం లేదు. ధర సగానికి సగం పడిపోవడంతో ఏమి చేయలేని పరిస్థితి. నిమ్మ దీర్ఘకాలిక పంట అయినందున ప్రభుత్వం బస్తాకు ఒక నిర్దిష్టమైన ధర నిర్ణయించి అదే ధరకు కొనుగోలు చేయాలి.
– అన్నెబోయిన సురేందర్, బండమీదిగూడెం, శాలిగౌరారం మండలం