
ఈ నెల 23న నాటక రంగ నంది అవార్డులు అందిస్తున్నామని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ వెల్లడించారు.
సాక్షి, అమరావతి: ఈ నెల 23న నాటక రంగ నంది అవార్డులు అందిస్తున్నామని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక చేపడుతున్నామన్నారు.
ప్రముఖ నాటకరంగ వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నంది అవార్డుల కోసం 115 దరఖాస్తులు వచ్చాయి. అందులో 38 మందిని ఎంపిక చేశారు. 5 కేటగిరీలలో మొత్తం 74 అవార్డులు ఇస్తాం. ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సులకు తావులేదు’’ అని పోసాని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: యువ న్యాయవాదులకు అండగా లా నేస్తం: సీఎం జగన్