drama festival
-
పారదర్శకంగా నాటక రంగ నంది అవార్డుల ఎంపిక: పోసాని
సాక్షి, అమరావతి: ఈ నెల 23న నాటక రంగ నంది అవార్డులు అందిస్తున్నామని ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళీ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పూర్తి పారదర్శకంగా అవార్డుల ఎంపిక చేపడుతున్నామన్నారు. ప్రముఖ నాటకరంగ వ్యక్తులతో కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నంది అవార్డుల కోసం 115 దరఖాస్తులు వచ్చాయి. అందులో 38 మందిని ఎంపిక చేశారు. 5 కేటగిరీలలో మొత్తం 74 అవార్డులు ఇస్తాం. ఎమ్మెల్యే, ఎంపీల సిఫార్సులకు తావులేదు’’ అని పోసాని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: యువ న్యాయవాదులకు అండగా లా నేస్తం: సీఎం జగన్ -
ఆంధ్ర నాటకానికి నవ వసంతాలు
ఆంధ్ర నాటక కళాపరిషత్... నాటక కళ క్షీణ దశకు చేరుతున్న తరుణంలో నాటక పునరుజ్జీవం లక్ష్యంతో భారతదేశంలోనే తొలిగా తెనాలిలో ఏర్పాటైన నాటక సంస్థ. రంగస్థల నాటకానికి పునర్వికాసం కల్పించి తెలుగుదేశాన నాటక కళ పరిఢ విల్లేందుకు అవిరళ కృషే చేసింది. ఆధునిక సమాజంలో ఇంకా నాటకం అంతో ఇంతో మనుగడ సాగిస్తున్నదంటే ఇలాంటి సంస్థల కృషి ఫలితమే. ఇంతటి ఘనచరిత్ర కలిగిన సంస్థను దశాబ్దకాలం కిత్రమే పునరుద్ధరించారు. ఎనిమిది దశాబ్దాల ఉత్సవాలను తెనాలిలో ఘనంగా నిర్వహించారు. మళ్లీ ఇప్పుడు 90 వసంతాల వేళ, విజయవాడ మొగల్రా జపురంలోని సిద్ధార్థ కళాపీఠంలో గురువారం నుంచి నాలుగురోజులపాటు జాతీయ బహుభాషా నాటకోత్సవాలను నిర్వహిస్తున్నందున ఆంధ్ర నాటక కళాపరిషత్ ఆవిర్భావం, కృషిని గుర్తు చేసుకోవటం సందర్భోచితం... ఇతర రాష్ట్రాల నుంచి... పూర్వం ఇతర రాష్ట్రాల నుంచి నాటక కంపెనీలు వచ్చి ఆంధ్ర దేశంలో నాటకాలను ప్రదర్శిస్తుండేవి. 1880 తర్వాత తెనాలితో సహా అయిదారు పట్టణాల్లో నాటక కంపెనీలు ఏర్పాటయ్యాయి. పురాణాల నుంచి కథాంశాలను ఎన్నుకొని నాటకాలను తీసుకొచ్చారు. జాతీయోద్యమ ప్రభావంతో పౌరాణిక అంశాలతో నాటకాలను రూపొందించి, సందర్భోచితంగా బ్రిటిష్ వారిని దుయ్యబడుతూ వచ్చారు. ఆ రకంగా తెలుగునాట నాటక ప్రదర్శనలు విస్తారంగా జరుగుతున్న 1919లోనే నాటక పోటీలు ఆరంభమయ్యాయి. నాటక ప్రాభవం క్రమేపీ తగ్గిపోవడానికి, అపసవ్య ధోరణులకు ఈ పోటీలే దారితీయటం విశేషం! ఏ నటుడు ఎక్కువసేపు రాగం తీస్తే, ఆ నటుడికే ప్రేక్షకుల నుంచి ‘వన్స్‌మోర్’ వస్తుండటంతో నాటకానికి అర్ధం మారింది. నటనకు ప్రాధాన్యత తగ్గి గానం, సంగీతమే ప్రధానమైంది. నాటకాలు పాటకచేరీలు అన్నట్టుగా తయారయ్యాయి. నటులను సంస్కరిస్తే నాటకాలు బాగుపడతాయన్న భావనతో 1924లో తొలిసారిగా విజయవాడలో నాటక పాఠశాల ఏర్పాటుచేసి శిక్షణనిచ్చిన తర్వాత కూడా పద్ధతి మారలేదు. నటులు వ్యక్తిగత ప్రాబల్యం కోసం పాకులాడారు. వైషమ్యాలు పెరిగి, నాటక సమాజాలు నష్టాల్లో పడ్డాయి. క్రమంగా మూతపడ్డాయి. సినిమాలు అప్పుడప్పుడే వస్తున్నందున కొందరు ఆ రంగానికి వెళ్లారు. నాటకరంగం అధోగతిలో పడింది. నాటక రంగంలోని అపసవ్య ధోరణులను అరికట్టడానికి అనేకులు రకరకాలుగా ప్రయత్నించారు. ‘కళ కళ కోసం కాదు, కళ ప్రజల కోసం’ అనే ఆశయంతో ఔత్సాహికులు రంగంలోకి దిగి తెలుగు నాటకం ఔన్నత్యాన్ని కాపాడేందుకు కృషిచేశా రు. నాటక సంస్కరణలకు మార్గాలను అన్వేషించారు. ఇలాంటి తరుణంలో ‘సురభి’ నాటక కంపెనీ పితామహుడు వనారస గోవిందరావు ఆరునెలలపాటు కష్టపడి రాష్ట్రంలోని ప్రముఖులను కూడగట్టి, ఎంతో వ్యయంచేసి ‘ఆంధ్ర నాటక కళా పరిషత్’ ఆవిర్భావానికి దోహదపడ్డారు. సంస్థ ఆవిర్భావ సభలు 1929 జూన్ 19, 20, 21 తేదీల్లో తెనాలిలో వైభవంగా నిర్వహించారు. దశమార్చిన మారిన సభలు మూడురోజుల సభలతో ఆంధ్ర నాటక కళాపరిషత్, తెలుగు నాటక రంగానికి దశ, దిశానిర్దేశం చేసింది. స్పష్టమైన నియమాలను రూపొందించింది. పరిషత్ నిర్వహణతో రాష్ట్రంలో ఔత్సాహిక సమాజాలు వందలకొద్దీ పుట్టుకొచ్చాయి. కొత్త రచయితలు, నటీ నటులు, సంగీత కళాకారులు నాటక రంగంలోకి అడుగుపెట్టారు. పరిషత్తుల్లో బహుమతులు సాధించిన రచయితలు, నటులకు సినిమారంగంలో ప్రవేశం లభించింది. మొదటి సభలకు అతిథులు వీరే.. బుర్రా శేషగిరిరావు, వక్కలంక అచ్యుతరావు, భమిడిపాటి చిన యజ్ఞనారాయణ శర్మ, వింజమూరి లక్ష్మీనరసింహారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, బసవరాజు సుబ్బారావు, తల్లావఝుల శివశంకరశాస్త్రి, కాళ్లకూరి గోపాలరావు, బళ్లారి రాఘవ ప్రభృతులు హాజరయ్యారు. మొదటిరోజు ‘నాటక రచన’, రెండోరోజు ‘నటన’, చివరిరోజున ‘నాటక ప్రయోగం’ అంశంపై చర్చలు జరిగాయి. ప్రతిరోజు రాత్రి నాటకాలను ప్రదర్శించారు. ముగింపు సభలో ‘దేశోద్ధారక’ కాశీనాధుని నాగేశ్వరరావు, గోవిందరావు, ఆచంట సాంఖ్యాయన శర్మ, చట్టి చినపూర్ణయ్య పంతులు, విశ్వనాధ కవిరాజు, కొత్తపల్లి లక్ష్మయ్య, నీలంరాజు వేంకట శేషయ్యతో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వనారస గోవిందరావును ‘ఆంధ్ర నాటక కళోద్ధారక’ బిరుదుతో సత్కరించారు. తెనాలి నేపధ్యమే ప్రేరణ.. ‘సురభి’ నాటక సమాజం నాటక ప్రదర్శనలిస్తూ తెనాలికి వచ్చిన సందర్భంలో ఆ కంపెనీ నిర్వాహకుడు వనారస గోవిందరావుకు ఇక్కడి సాంస్కృతిక వాతావరణం నచ్చింది. అందుకే ఇక్కడ కళాపరిషత్ ఆవిర్భావానికి కృషి చేశారు. సాహితీ సమితి ఏర్పాటై ఉంది. రచయితలు, కళాకారులు, నాటక సమాజాలు ఉన్నాయి. తెనాలి నుంచి అప్పట్లో 20 వరకు దిన, వార, మాసపత్రికలు వెలువడుతుండేవి. ఇంత అనుకూలంగా ఉన్నందునే పరిషత్ విజయవంతమైంది. – నేతి పరమేశ్వరశర్మ, సీనియర్ కళాకారుడు పరిషత్ అనుమతిస్తే గొప్పే! ఆ రోజుల్లో ఆంధ్ర నాటక కళాపరిషత్‌లో ప్రదర్శనకు ఏదైనా నాటకానికి అనుమతి లభించిందంటే గొప్ప గౌరవంగా భావించేవారు. ‘కాళరాత్రి’, ‘మరో మొహంజదారో’, ‘ఎన్జీవో’, ‘ఈనాడు’, ‘దొంగవీరడు’, ‘పల్లెపడుచు’, ‘అన్నాచెల్లెలు’, ‘మావూరు’, ‘ఎదురీత’, ‘పెత్తందారు‘, ‘నటనాలయం’, ‘కనక పుష్యరాగం’, ‘కళ్లు’ వంటి అద్భుత కళాఖండాలు తెలుగు నాటక రంగంలో వెలుగులోకి రావడానికి కళాపరిషత్ దోహదపడింది. తర్వాత 1951 లో మున్సిపల్ చైర్మన్ నన్నపనేని వెంకట్రావు ఆధ్వర్యంలో మళ్లీ తెనాలిలో నాలుగురోజులు ఆంధ్ర నాటక కళాపరిషత్ సభలు జరిగాయి. ఆవిర్భావ సభల్లో పాల్గొన్న దేవులపల్లి కృష్ణశాస్త్రి ఈ సభలను, పోటీ నాటకాలను సినిమా దర్శకుడు వైవీ రావ్ ప్రారంభించారు. ప్రముఖ బాలీవుడ్ నటి వహీదా రెహమాన్, ఆ నాటి సభల్లో నృత్యం చేయటం మరో విశేషం. కళారంగంలో జాజ్వలమానంగా ప్రకాశించేందుకు ఎంతో కృషిచేసిన ఈ పరిషత్ పదేళ్లు విరామం అనంతరం, బొల్లినేని కృష్ణయ్య, అన్నమనేని ప్రసాదరావు సారధ్యంలో పూర్వవైభవానికి కృషిని కొనసాగిస్తోంది. ఆ క్రమంలో 2009లో తెనాలిలో ఎనిమిది పదుల నాటకోత్సవాలను జరుపుకోవటం విశేషం. -
నాటకం...జీవన ప్రతిబింబం
–రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ కర్నూలు(హాస్పిటల్): మానవ జీవితాన్ని ప్రతిబింబించేదే నాటకమని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్రస్థాయి నాటకోత్సవాలు స్థానిక టీజీవీ కళాక్షేత్రంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలోనే రాష్ట్రస్థాయి నంది నాటక పోటీలు కర్నూలులో నిర్వహించాల్సి ఉన్నా అప్పుడు సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర కోస్తాలో విజయనగరం, దక్షిణ కోస్తాలో గుంటూరు, రాయలసీమలో కర్నూలు కేంద్రంగా ఈ పోటీలు నిర్వహించడం ఆనందదాయకమన్నారు. కళాకారులను ప్రోత్సహించే ప్రాంతాలు సుభిక్షంగా ఉంటాయని చరిత్ర చెబుతుందన్నారు. రాయలసీమ కల్చరల్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక కళలను, కళాకారులను ప్రోత్సహిస్తామన్నారు. హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద కళాకారులకు కర్నూలులో 10వేల గృహాలను నిర్మిస్తున్నట్లు కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి చెప్పారు. ఎన్టీఆర్ వర్ధంతి రోజున నాటకోత్సవాలను ప్రారంభించం అభినందనీయమని ఎమ్మెల్సీ ఎం. సుధాకర్‌బాబు అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి పోటీల్లో 276 బృందాలు పాల్గొంటున్నాయన్నారు. కళాకారులకు ఇస్కాన్ సంస్థ సహాయంతో భోజనాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి, కేడీసీసీబీ చైర్మన్ మల్లికార్జున రెడ్డి, మార్కెట్ యార్డు చైర్పర్సన్ శమంతకమణి, ఆర్డీవో రఘుబాబు, మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, నాటకోత్సవాల నిర్వాహకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. చప్పగా సాగిన నాటకోత్సవాలు రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలకు సరైన ప్రచారం లేకపోవడంతో బుధవారం ప్రేక్షకులు లేక చప్పగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు ప్రచారం లేకపోవడంతో కళలపై అభిమానం ఉన్న వారు రాలేకపోయారన్న వాదన వినిపించింది. సాక్షాత్తూ వేదికపై ఉన్న వారు సైతం నాటకాలకు జనం లేకపోవడాన్ని తప్పుబట్టారు. ఆలోచింపజేసిన నాటికలు.. నంది నాటకోత్సవాల్లో భాగంగా స్థానిక సి.క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన సాంఘిక నాటికలు ఆలోచింపజేశాయి. సమాజంలో జరుగుతున్న సాంఘిక దురాచారాలపై ఈ నాటికలను తమ కోణాన్ని చూపాయి. దురాచారాల వల్ల కలిగే నష్టాలు, ఇబ్బందులు, ఫలితం గురించి వివరించాయి. మొదటిరోజు ఐదు నాటికలకు గాను నాలుగు మాత్రమే జరిగాయి. కళాకారులు రాకపోవడంతో బ్రతికించండి అనే సాంఘిక నాటికను రద్దు చేశారు. వరకట్న దురాచారంపై బాపూజీ స్కౌట్ గ్రూప్ వారి ‘ఆశా–కిరణ్’ అనే సాంఘిక నాటిక ఆలోచింపజేసింది. అప్పులు తీసుకుని ఎగ్గొట్టే వారు చివరికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనే అంశంపై శ్రీ మురళి కళానిలయం ఆధ్వర్యంలో ‘అం అః–కం కః’ అనే సాంఘిక నాటకం నవ్వుల పువ్వులు పూయించింది. సినీ నటుడు జెన్నీఫర్ ఈ నాటికలో నటించారు. చైతన్య కళాభారతి ఆధ్వర్యంలో ‘అగ్నిపరీక్ష’ అనే సాంఘిక నాటకం..మంచి సందేశాన్ని ఇచ్చింది. బాగా చదివి ఉన్నత స్థాయికి వెళ్లిన తర్వాత తల్లిదండ్రులను, కుటుంబసభ్యులను మరిచిపోయే వారు.. చివరికి ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారనే అంశంపై ప్రభు ఆర్ట్స్ నల్గొండ వారి ఆధ్వర్యంలో ‘ఐదో దిక్కు’ అనే సాంఘిక నాటకం ప్రదర్శించారు. -
కర్నూలులో నందుల పండుగ
– నేటి నుంచి రాష్ట్రస్థాయి నందినాటకోత్సవాలు – ఫిబ్రవరి 2 వరకు నాటక ప్రదర్శనలు – సినీ మాటల రచయిత దివాకర్‌బాబు, నటుడు కోటశంకర్‌రావు హాజరు – పద్య నాటకాలు, సాంఘిక నాటకాలు, బాల నాటికల ప్రదర్శనలు కర్నూలు(కల్చరల్): రంగస్థలంపై నంది నాటకానికి ఒక ప్రత్యేకత ఉంది. రాష్ట్రంలోని వివిధ నాటక సమాజాలు పలు సాంఘిక, పద్యనాటకాలు ప్రదర్శించవచ్చు. కాని ఒక నాటకం నంది నాటక పోటీలకు ఎంపిక కావడం, ఆ పోటీలలో విజేతగా నిలవడాన్ని రంగస్థల నటులు ప్రతిష్టాత్మకంగా భావిస్తారు. రంగస్థలంపై సరికొత్త సొగసులొలికే ఆహార్యపు సౌందర్యం.. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలు.. రోమాలు నిక్క బొడ్చుకునే ఉత్కంఠ భరితమైన దృశ్యాలు.. కనువిప్పు కల్గించే సంభాషణలు.. సురభివారి సాంకేతిక తరం గురించిన అద్భుతాలు.. మొత్తంగా కర్నూలు నగరంలో పదునైదు రోజుల పాటు నందుల పండుగ జరగనున్నది. ప్రేక్షకులకు వీనుల విందు కనుల విందు కల్గించే ఈ నందుల పండుగ కర్నూలు నగరానికి తొలిసారిగా తరలి వచ్చింది. గతంలో 2010లో నంద్యాల టౌన్ హాల్ ఆడిటోరియంలో రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాలు జరిగాయి. 2017 ప్రారంభంలో కర్నూలు నగరానికి నందినాటకాల పండుగ తరలి రావడంతో నాటకాభిమానులు గుండెల్లో ఆనందం ఉప్పొంగుతోంది. టీజీవీ కళాక్షేత్రం వేదిక: స్థానిక సీ.క్యాంపు సెంటర్లోని టీజీవీ కళాక్షేత్రంలో బుధవారం ఉదయం 9.30 గంటలకు రాష్ట్రస్థాయి నంది నాటకోత్సవాల ప్రారంభోత్సవం జరగనున్నది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలన చిత్ర టివి నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జరిగే ఈ నంది నాటకోత్సవాలు ఫిబ్రవరి 2వ తేదీ వరకు జరగనున్నాయి. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, శాసన మండలి చైర్మెన్ చక్రపాణియాదవ్, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ తదితర ప్రజాప్రతినిధులు అతిధులుగా హాజరవుతున్నారు. మొదటి రోజు: ఉదయం 10.30 నిమిషాలకు బాపూజీ స్కౌట్ గ్రూపు వారి ‘ఆశాకిరణ్’ సాంఘిక నాటక, 12 గంటలకు మురళీ కళా నిలయం ఆరి అం అః..కం కః సాంఘిక నాటిక, మధ్యాహ్నం 2 గంటలకు చైతన్య కళాభారతి వారి ‘అగ్నిపరీక్ష’ నాటిక సాయంత్రం 4.30 గంటలకు ప్రభు ఆర్ట్స్ వారి ‘ఐదో దిక్కు’ సాంఘిక నాటిక, సాయంత్రం 6 గంటలకు గణేష్ నికేతన్ వారి ‘బతికించండి’ సాంఘిక నాటిక ప్రదర్శించనున్నారని ఎఫ్‌డీఎస్ మేనేజర్ శ్రీనివాసరావు లలిత కళా సమితి అధ్యక్షులు పత్తి ఓబులయ్య ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. 15 రోజుల్లో 76 నాటక ప్రదర్శనలు: నంది నాటకోత్సవాల్లో భాగంగా 25 పద్య నాటకాలు, 11 సాంఘిక నాటకాలు, 27 నాటికలు, 9 బాలల నాటికలు, 4 కళాశాల విద్యార్థులు, నాటికలు ప్రదర్శించనున్నారు. పద్యనాటక ప్రదర్శనకు రూ.30 వేలు, సాంఘిక నాటక ప్రదర్శనకు రూ.20 వేలు, బాలల నాటికలు, కళా విద్యార్థుల నాటికలకు రూ.15 వేల చొప్పున ప్రదర్శనా పారితోషకాన్ని ఆయా నాటక సమాజాలకు అందిస్తామని శ్రీనివాసరావు తెలిపారు. 15 రోజుల పాటు జరిగే ఈ నాటకోత్సవాలలో రాష్ట్ర వ్యాప్తంగా 1335 మంది సినీ, టీవీ, రంగస్థల నటీనటులు పాల్గొంటున్నారు. నంది నాటకోత్సవాలలో జరిగే నాటక ప్రదర్శనల్లో ప్రముఖ సినీ మాటల రచయిత (యమలీల ఫేం) దివాకర్‌బాబు, నటుడు కోట శంకర్రావు, టీవీ నటుడు మేకా రామకృష్ణ, సురభి ప్రభావతి తదితరులు పాల్గొననున్నారు. కర్నూలు లలిత కళా సమితి రూపొందించిన పద్యనాటకం ప్రమీలార్జన పరిణయం ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం ప్రదర్శించనున్నారు. ప్రతి రోజు ఉదయం 9.30 గంటల వరకు జరిగే ఈ నంది నాటకోత్సవాల్లో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని ఎఫ్డీసీ అధికారులు తెలిపారు. -
ఆలోచింపజేసిన ‘సీతాకోకచిలుక’
– కనుల పండువగా మినీ నంది నాటకోత్సవాలు నంద్యాల: పిల్లలపై తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ప్రభావం చూపుతోందో వివరించిన సీతాకోక చిలుక బాలల సాంఘిక నాటకం ఆలోచింజేసింది. రాష్ట్ర చలన చిత్ర, టీవీ నాటకరంగ సంస్థ కళారాధన, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, ఐఎంఏ సంయుక్తంగా నిర్వహిస్తున్న మినీ నంది నాటకోత్సలు ఆదివారం కనుల పండువగా జరిగాయి. గురురాజ కాన్సెప్ట్ స్కూల్, కళారాధన సంస్థ రూపొందించిన సీతాకోకచిలుక నాటకానికి రాష్ట్ర ప్రభుత్వ బంగారునంది అవార్డు వచ్చింది. రెండు కుటుంబాలను ఆధారంగా తల్లిదండ్రుల ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో చిన్నారులపై పడే మంచి, చెడు ప్రభావాలను దర్శకుడు డాక్టర్ రవికష్ణ స్పష్టంగా వివరించారు. రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రామచంద్రయ్య, జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో లయన్స్, రోటరీ క్లబ్ అధ్యక్షులు భవనాశి నాగమహేష్, రమేస్, కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికష్ణ డాక్టర్ లక్ష్మణ్కిశోర్, పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. బాల గాయకుడు సాయివల్లభ్ పాటలతో అలరించారు. చిన్మయ స్కూల్, శాంతినికేతన్, గురురాజ స్కూల్ విద్యార్థులు అద్భుతమైన నత్యాలతో ఆకట్టుకున్నారు. గురురాజ స్కూల్ విద్యార్థుల యోగ ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. అలాగే నవజీవన్ బధిరుల దేశభక్తి మైదాన నత్యం ప్రేక్షకుల హదయాలను కదిలించింది. -
మినీ నంది నాటకోత్సవం ప్రారంభం
– ఆకట్టుకున్న జీవితార్ధం సాంఘిక నాటకం నంద్యాల: రాష్ట్ర టీవీ చలన చిత్ర నాటక రంగ అభివృద్ధి సంస్థ, కళారాధన ఆధ్వర్యంలో మినీ నంది నాటకోత్సవం..శనివారం నంద్యాలలో కనుల పండువగా ప్రారంభమైంది. స్థానిక మున్సిపల్ టౌన్హాల్లో జరిగిన కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి పేరిట ఏర్పాటు చేసిన రేనాటి సూర్యచంద్రుల కళావేదికను ప్రముఖ పారిశ్రామిక వేత్త పోచాబ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. జాతీయ పతకాన్ని ప్రముఖ శాస్త్రవేత్త రవీంద్రనాథ్, కళారధన పతాకాన్ని సీడీపీఓ ఆగ్నేష్ ఏంజల్ ప్రారంభించారు. ఆత్మసై ్థర్యం ఎంతో అవసరం.. మహిళలు ఆత్మసై ్థర్యంతో ముందడుగు వేయాలని మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన పిలుపునిచ్చారు. మహిళల సాధికారత, హక్కులు, చట్ట సభల్లో మహిళలు అనే అంశంపై ఏర్పాటైన చర్చావేదికలో ఆమె మాట్లాడారు. కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికష్ణ, సంయుక్త కార్యదర్శి పెసల శ్రీకాంత్ నిర్వహణలో చర్చావేదిక జరిగింది. చైర్పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ.. గాంధీ, శివాజీ, స్వామి వివేకానందలకు వారి తల్లి బోధనలే స్ఫూర్తిని ఇచ్చాయని చెప్పారు. విద్యార్థులు సమయాన్ని వథా చేసుకోకుండా చదువు, క్రీడలపై ఆసక్తి చూపాలని చెప్పారు. చర్చలో సీడీపీఓ ఆగ్నేష్ ఏంజల్, ప్రముఖ గైనకాలజిస్ట్లు డాక్టర్నాగమణి, డాక్టర్ లక్ష్మిప్రసన్న, రోటరీ ఇన్నర్‌వీల్ అధ్యక్షురాలు సుశీల పాల్గొన్నారు. ఆకట్టుకున్న జీవితార్థం.. గుంటూరు అమరావతి ఆర్ట్స్ సంస్థ కళాకారులు ప్రదర్శించిన జీవితార్ధం నాటకం ఆహూతులను ఆకట్టుకుంది. కుటుంబ వ్యవస్థలో మానవ సంబంధాలను.. రచయిత దర్శకుడు కావూరి సత్యనారాయణ అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ పౌరాణిక నటి శారదా బాయిని కళారాధన పౌరాణిక రంగస్థల రత్న పురస్కారాన్ని అందజేశారు. అలరించిన సాంస్కృక ప్రదర్శనలు.. కేశవరెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు శ్రేయాశెట్టి, శ్రేయశ్రీల శాస్త్రీయ నత్యం, గుడ్‌షెప్పర్డ్ స్కూల్, ఎస్డీఆర్ వరల్డ్ స్కూల్ విద్యార్థులు హిమ, లిన్సీ, ఇమ్మానియేల్‌ల వాయిద్య కచేరి ఆకట్టుకుంది. గురురాజ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన జానపద బృంద నృత్యాలు ఉర్రూతలూగించాయి. దీపిక, కావ్యల నృత్యాలు, బాలరాజు ముఖాభినయం, లింగమయ్య మాయల మారాటి, ఏకపాత్రాభినయం, కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు ఝాన్సీ, అక్షయల నృత్యాలు, శాంతినికేతన్ విద్యార్థులు బృంద నృత్యం ఉత్సవాలకు శోభను చేకూర్చింది.