మినీ నంది నాటకోత్సవం ప్రారంభం
మినీ నంది నాటకోత్సవం ప్రారంభం
Published Sat, Aug 27 2016 10:07 PM | Last Updated on Mon, Sep 4 2017 11:10 AM
– ఆకట్టుకున్న జీవితార్ధం సాంఘిక నాటకం
నంద్యాల: రాష్ట్ర టీవీ చలన చిత్ర నాటక రంగ అభివృద్ధి సంస్థ, కళారాధన ఆధ్వర్యంలో మినీ నంది నాటకోత్సవం..శనివారం నంద్యాలలో కనుల పండువగా ప్రారంభమైంది. స్థానిక మున్సిపల్ టౌన్‌హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, బుడ్డా వెంగళరెడ్డి పేరిట ఏర్పాటు చేసిన రేనాటి సూర్యచంద్రుల కళావేదికను ప్రముఖ పారిశ్రామిక వేత్త పోచాబ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. జాతీయ పతకాన్ని ప్రముఖ శాస్త్రవేత్త రవీంద్రనాథ్, కళారధన పతాకాన్ని సీడీపీఓ ఆగ్నేష్ ఏంజల్ ప్రారంభించారు.
ఆత్మసై ్థర్యం ఎంతో అవసరం..
మహిళలు ఆత్మసై ్థర్యంతో ముందడుగు వేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ దేశం సులోచన పిలుపునిచ్చారు. మహిళల సాధికారత, హక్కులు, చట్ట సభల్లో మహిళలు అనే అంశంపై ఏర్పాటైన చర్చావేదికలో ఆమె మాట్లాడారు. కళారాధన ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవికష్ణ, సంయుక్త కార్యదర్శి పెసల శ్రీకాంత్ నిర్వహణలో చర్చావేదిక జరిగింది. చైర్‌పర్సన్ దేశం సులోచన మాట్లాడుతూ.. గాంధీ, శివాజీ, స్వామి వివేకానందలకు వారి తల్లి బోధనలే స్ఫూర్తిని ఇచ్చాయని చెప్పారు. విద్యార్థులు సమయాన్ని వథా చేసుకోకుండా చదువు, క్రీడలపై ఆసక్తి చూపాలని చెప్పారు. చర్చలో సీడీపీఓ ఆగ్నేష్ ఏంజల్, ప్రముఖ గైనకాలజిస్ట్‌లు డాక్టర్‌నాగమణి, డాక్టర్ లక్ష్మిప్రసన్న, రోటరీ ఇన్నర్‌వీల్ అధ్యక్షురాలు సుశీల పాల్గొన్నారు.
ఆకట్టుకున్న జీవితార్థం..
గుంటూరు అమరావతి ఆర్ట్స్ సంస్థ కళాకారులు ప్రదర్శించిన జీవితార్ధం నాటకం ఆహూతులను ఆకట్టుకుంది. కుటుంబ వ్యవస్థలో మానవ సంబంధాలను.. రచయిత దర్శకుడు కావూరి సత్యనారాయణ అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రముఖ పౌరాణిక నటి శారదా బాయిని కళారాధన పౌరాణిక రంగస్థల రత్న పురస్కారాన్ని అందజేశారు.
అలరించిన సాంస్కృక ప్రదర్శనలు..
కేశవరెడ్డి విద్యాసంస్థల విద్యార్థులు శ్రేయాశెట్టి, శ్రేయశ్రీల శాస్త్రీయ నత్యం, గుడ్‌షెప్పర్డ్ స్కూల్, ఎస్‌డీఆర్ వరల్డ్ స్కూల్ విద్యార్థులు హిమ, లిన్సీ, ఇమ్మానియేల్‌ల వాయిద్య కచేరి ఆకట్టుకుంది. గురురాజ కాన్సెప్ట్ స్కూల్ విద్యార్థులు ప్రదర్శించిన జానపద బృంద నృత్యాలు ఉర్రూతలూగించాయి. దీపిక, కావ్యల నృత్యాలు, బాలరాజు ముఖాభినయం, లింగమయ్య మాయల మారాటి, ఏకపాత్రాభినయం, కేశవరెడ్డి స్కూల్ విద్యార్థులు ఝాన్సీ, అక్షయల నృత్యాలు, శాంతినికేతన్ విద్యార్థులు బృంద నృత్యం ఉత్సవాలకు శోభను చేకూర్చింది.
Advertisement